అమెరికాలో మెగాస్టార్ వెకేషన్

బ్లాక్ బస్టర్ సినిమాలంటే మెగాస్టార్ చిరంజీవి అనే అంటాం. తనకు ఆ రేంజ్ క్రేజ్ ఉంది. రీసెంట్ గా తన ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసి. మూవీ ప్రమోషన్ కి కాస్త గ్యాప్ ఉండడంతో అలా వెకేషన్ కి అమెరికా వెళ్ళాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం బోళా శంకర్ ఆగస్టులో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి ఇంకాస్త టైం ఉంది.  కొత్త చిత్రం గురించి చెప్పిన చిరంజీవి: ఈ గ్యాప్ లో తన […]

Share:

బ్లాక్ బస్టర్ సినిమాలంటే మెగాస్టార్ చిరంజీవి అనే అంటాం. తనకు ఆ రేంజ్ క్రేజ్ ఉంది. రీసెంట్ గా తన ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసి. మూవీ ప్రమోషన్ కి కాస్త గ్యాప్ ఉండడంతో అలా వెకేషన్ కి అమెరికా వెళ్ళాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం బోళా శంకర్ ఆగస్టులో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి ఇంకాస్త టైం ఉంది. 

కొత్త చిత్రం గురించి చెప్పిన చిరంజీవి:

ఈ గ్యాప్ లో తన వైఫ్ సురేఖతో కలిసి చిరంజీవి ఫారిన్ వెళ్ళాడు. తన ఇన్స్టాగ్రామ్ లో

నేను ఇప్పుడు ఫారెన్ వెళ్తున్నాను. తిరిగి రాగానే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ లో నా కొత్త చిత్రం

ప్రారంభిస్తానని తెలియజేశాడు. మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చిరంజీవి వారం అక్కడే ఉండి తిరిగి ఇండియాకు వస్తాడని తెలిసింది. తన కొత్త చిత్రం గురించి చిరంజీవి అంత క్లియర్ గా చెప్పకపోయినా, ఈ సినిమా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మలయాళ సినిమా బ్రో డాడీ రీమేక్ లో చిరంజీవి నటిస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. ఇందులో ఇంకో హీరోగా సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తాడని అంటున్నారు. చిరంజీవి సంక్రాంతికి విడుదల చేసిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో రవితేజ తో కలిసి చిరంజీవి ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించాడు. ఈ సినిమాలో చిరంజీవి కోర్టు సీన్ లో అద్భుతమైన యాక్షన్ చూపించాడు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అయ్యాక. తన తదుపరిచిత్రం బోళా శంకర్ మీద అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా టీజర్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఇది ప్రేక్షకుల అంజనాలను మరింత పెంచింది. ఈమధ్యే చిరంజీవి, సురేఖ లు తాతయ్య, నానమ్మ అయ్యారు. చిరంజీవి తన రెండవ ఇన్నింగ్స్ లో

చాలా దూకుడుగా సినిమాలు చేస్తున్నాడు. 

దూకుడుగా సినిమాలు చేస్తున్న చిరంజీవి:

తన రెండో ఇన్నింగ్స్ లో చిరంజీవి దూకుడుగా సినిమాలు చేస్తున్నాడు. ఖైదీ నెంబర్ 150 తో తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. తర్వాత సైరా నరసింహారెడ్డి అనే సినిమాలో నటించాడు అది ఆశించినంత విజయాన్ని ఇవ్వలేదు. తర్వాత రామ్ చరణ్ కాంబినేషన్ లో నటించిన ఆచార్య డిజాస్టర్ అయింది. తర్వాత సత్యదేవ్ తో కలిసి నటించిన గాడ్ ఫాదర్ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి యాక్టింగ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా నయనతార తో వచ్చే సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ బాగా పండాయి. 

ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య తనకు కావాల్సిన విజయాన్ని అందించింది. వాల్తేరు వీరయ్య డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ చిరంజీవి తమ్ముడి గా నటించాడు. ఈ చిత్రంలో ఇద్దరూ పోటీపడి నటించారు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ గా రవితేజ చేసిన పాత్ర ఈ సినిమాకే హైలైట్ అయింది. వాల్తేరు వీరయ్య ఇచ్చిన జోష్ తో చిరంజీవి భోళాశంకర్ ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ సినిమా చిరంజీవికి పెద్ద విజయం అందించాలని కోరుకుందాం.