Forbes మ్యాగజైన్ కవర్ పేజీపై మెగా పవర్ స్టార్.. వావ్ అంటున్న ఫ్యాన్స్!

Forbes: ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటిన చెర్రీ, ఇప్పుడు తన భార్య ఉపాసనతో కలిసి ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించి అందరి ద్రుష్టిని ఆకట్టుకున్నారు.

Courtesy: IDL

Share:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరో అరుదైన ఘనత సాధించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటిన చెర్రీ,  ఇప్పుడు తన భార్య ఉపాసనతో కలిసి ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించి అందరి ద్రుష్టిని ఆకట్టుకున్నారు. ఈ దంపతుల ఫొటోను ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ తన కవర్ పేజీగా ముద్రించింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై చెర్రీ దంపతులను చూసిన ఆయన ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

ఈ పిక్ లో పింక్ కలర్ అవుట్ ఫిట్స్ లో ఉపాసన సోఫాలో కూర్చోగా.. రామ్ చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చున్న ఫొటోను ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీగా ముద్రించింది. ఈ ఫొటో పక్కన ‘సూపర్ కపుల్. వారిద్దరూ కాలేజీ స్వీట్ హార్ట్స్. ఒకరు వ్యాపారవేత్త, సంఘసంస్కర్త. మరొకరు సూపర్ స్టార్’ అంటూ  పేర్కొంది. ప్రస్తుతం ఈ కవర్ పేజీ సోషల్ మీడియాలో వైరలవుతుంది. కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు.

మరోవైపు, ఇటీవల రామ్ చరణ్, ఉపాసన దంపతులు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఇంటికి అతిథులుగా వెళ్లారు. గత కొన్ని రోజులుగా ముంబై పర్యటనలో ఉన్న చరణ్ దంపతులు, తమ పాప క్లింకారాతో కలిసి ముంబైలోని ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఇక ఈ శుక్రవారం సీఎం ఏక్ నాథ్ షిండే ఫ్యామిలీని కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్, ఉపాసన షేర్ చేశారు. 'మీ అసాధారణమైన ఆతిథ్యం, ఆప్యాయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు' అని పేర్కొంటూ ఉపాసన ట్వీట్ చేశారు. మరోవైపు,ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. రామ్ చరణ్, ఉపాసనతో సమావేశం గొప్పగా జరిగిందని తెలిపారు. తమ ఇంటికి వచ్చిన రామ్ చరణ్ దంపతులకు పుష్పగుచ్ఛంతోపాటు వినాయకుడి విగ్రహాన్ని ఇచ్చి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు సీఎం. సినీ రంగంతోపాటు పలు అంశాలపై తమ మధ్య సానుకూల చర్చలు జరిగాయన్నారు. ఈ భేటీలో షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్, ఆయన సతీమణి వృశాలి ఉన్నారు.