రెమ్యునరేషన్‌‌లో అల్లు అర్జున్ ప్రభాస్‌ని మించిపోయాడు

ఇప్పటివరకు అత్యధిక పారితోషికం తీసుకున్న దక్షిణాది నటుడు ప్రభాస్. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ప్రభాస్‌ని మించిపోయాడు అల్లు అర్జున్ తెలుగులో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అల్లు అర్జున్ గురించి చెప్పుకోవాలంటే పుష్ప ముందు, పుష్ప తరువాత అని చెప్పుకోవాలి. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ దేశ వ్యాపమయ్యింది. క‌రోనా త‌ర్వాత వచ్చిన పుష్ప టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాపంగా సందడి చేసి కలెక్షన్ల సునామీని తెచ్చిపెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా, […]

Share:

ఇప్పటివరకు అత్యధిక పారితోషికం తీసుకున్న దక్షిణాది నటుడు ప్రభాస్. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ప్రభాస్‌ని మించిపోయాడు

అల్లు అర్జున్ తెలుగులో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అల్లు అర్జున్ గురించి చెప్పుకోవాలంటే పుష్ప ముందు, పుష్ప తరువాత అని చెప్పుకోవాలి. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ దేశ వ్యాపమయ్యింది. క‌రోనా త‌ర్వాత వచ్చిన పుష్ప టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాపంగా సందడి చేసి కలెక్షన్ల సునామీని తెచ్చిపెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా పేరు సంపాదించాడు. అయితే ఇప్పుడు తాజాగా.. అల్లు అర్జున్ సౌత్ సినిమాలో ప్రభాస్‌ను మించి అత్యధిక పారితోషికం తీసుకునే నటుడయ్యాడు. వంగా సందీప్ రెడ్డి, భూషణ్ కుమార్ నిర్మించిన సినిమాతో హిందీలో అరంగేట్రం చేయబోతున్న అల్లు అర్జున్.. 125 కోట్ల రూపాయల ఫీజు తీసుకుంటున్నాడట. దీంతో అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా పూర్తయిన తర్వాత, అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి వంగా, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులు

అల్లు అర్జున్ – 100- 125 కోట్లు

ప్రభాస్ – 100 కోట్లు

జూనియర్ ఎన్టీఆర్ – 50-100 కోట్లు

రామ్ చరణ్ – 50-100 కోట్లు

మహేష్ బాబు – 60-80 కోట్లు

పవన్ కళ్యాణ్ – 50-65 కోట్లు

చిరంజీవి – 40- 60 కోట్లు

విజయ్ దేవరకొండ – 27-45 కోట్లు

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ 75 కోట్లు తీసుకున్నారట

రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు 75 కోట్ల రూపాయలను తీసుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇప్పుడు ఆస్కార్‌కి చేరుకుంది. అల్లు అర్జున్ ఫీజులు పెంచిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కూడా తమ ఛార్జీలను పెంచుకోవచ్చు.

టి-సిరీస్, భద్రకాళి ప్రొడక్షన్ 

మీడియా కథనాల ప్రకారం.. టి-సిరీస్, వంగ.. భద్రకాళి ప్రొడక్షన్స్ నిర్మాణంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రానికి ‘భద్రకాళి’ అనే టైటిల్ పెట్టవచ్చు. ఈ చిత్రం ఆధ్యాత్మికతకు సంబంధించినదని టాక్. 

సౌత్ సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్న టి-సిరీస్‌కి చెందిన భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. మేము హిందీ చిత్రాలలో మాత్రమే పని చేసే పరిధిని బ్రేక్ చేయబోతున్నాం. ఇప్పుడు సౌత్, రీజనల్ సినిమాలని కూడా నిర్మించడం స్టార్ట్ చేస్తున్నాం.

దీంతో పాటు టి-సిరీస్, భద్రకాళి ప్రొడక్షన్స్‌తో కలిసి ‘యానిమల్‌’ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. రణ‌్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న ఈ చిత్రంలో కనిపించనున్నారు.

అల్లు అర్జున్ రాబోయే సినిమాలు

2024లో ‘పుష్ప: ది రూల్’ తో పాటు ‘ఐకాన్’ కూడా విడుదల కాబోతోంది. 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2021లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా మొత్తం రూ.373 కోట్లు రాబట్టింది.