OTT రిలీజ్ లాక్ చేసుకున్న విశాల్ మూవీ

తమిళ హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ మార్క్ ఆంటోనీ ఓటీటీ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. ఈ మూవీలో విశాల్ తో పాటు టాలెంటెడ్ యాక్టర్, కమ్ డైరెక్టర్ అయిన ఎస్ జే సూర్య కూడా నటించాడు. అంతే కాకుండా ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ తో తెలుగులో అదరగొట్టిన సునీల్ కూడా ఈ మూవీలో నటించాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 15న రిలీజ్ అయింది. ఇది […]

Share:

తమిళ హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ మార్క్ ఆంటోనీ ఓటీటీ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. ఈ మూవీలో విశాల్ తో పాటు టాలెంటెడ్ యాక్టర్, కమ్ డైరెక్టర్ అయిన ఎస్ జే సూర్య కూడా నటించాడు. అంతే కాకుండా ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ తో తెలుగులో అదరగొట్టిన సునీల్ కూడా ఈ మూవీలో నటించాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 15న రిలీజ్ అయింది. ఇది ఒక కామెడీ డ్రామాగా తెరకెక్కింది. ఈ మూవీకి తమిళ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. విశాల్, ఎస్ జే సూర్యల కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీని బంపర్ హిట్ చేశారు. రీసెంట్ టైమ్ లో చూసుకుంటే విశాల్ కు సరైన హిట్ లేదు. కానీ ఈ మూవీ భారీ వసూల్లను సాధించి పెట్టినట్లు తెలుస్తోంది. ఏకంగా ఈ మూవీ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిందని సమాచారం. 

ఓటీటీని లాక్ చేసుకున్న మార్క్..

 నిన్న మొన్నటి వరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన విశాల్ చిత్రం మార్క్ ఆంటోని ప్రస్తుతం బుల్లి తెర ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ గా అలరించేందుకు సిద్ధం అవుతుందని టాక్. ఈ విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయినా కానీ ఈ విషయం తెగ వైరల్ అవుతోంది. దీంతో థియేటర్లలో ఈ మూవీని చూడడం మిస్ అయిన వారు బుల్లి తెర మీద చూసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ కోసం విశాల్ సెంట్రల్ ఫిలిం బోర్డు మీద లంచం ఆరోపణలు కూడా చేశాడు. ఈ ఆరోపణలు ప్రకంపనలను సృష్టించాయి. కేవలం ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా విమర్శకులు కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. దీంతో ఈ మూవీకి కలెక్షన్స్ రావడం చాలా సులభం అయింది. సరైన హిట్ లేక సతమతం అవుతున్న విశాల్ కు ఈ మూవీ పెద్ద ఊరటను కలిగించింది. ఈ మూవీ కేవలం తెలుగు, తమిళం వంటి భాషల్లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది. హిందీ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డు సభ్యులు తనను లంచం డిమాండ్ చేశారని విశాల్ ఆరోపించారు. 

డేట్ ఇదే… 

ఓటీటీ డీల్ లాక్ చేసుకున్న మార్క్ ఆంటోని మూవీ అక్టోబర్ 13నుంచి స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు ఇంకా పుకార్లే అయినప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై అటు అమెజాన్ కానీ ఇటు మూవీ యూనిట్ కానీ ఎటువంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. అక్టోబర్ 13కు ఇంకా రెండు రోజులే సమయం ఉన్నా కానీ సంస్థ స్పందించకపోవడం అంటే ఈ వార్తలు ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇక ఈ మూవీలో రీతూ వర్మ, సునీల్, సెల్వరాఘవన్, అభినయ, రెడిన్ కింగ్స్లీ, వై.జి.మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇక ఈ మూవీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఇక వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. జీవీ తనదైన మ్యూజిక్ తో అలరించాడు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన మార్క్ ఆంటోని చిత్రం డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం అయిందనే వార్తలు విని… ఈ మూవీని థియేటర్లలో చూడలేని వారు ఓటీటీలో చూసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ ఓటీటీ రిలీజ్ వార్తలు ఇంకా ఎవరూ కన్ఫమ్ చేయకపోయినా కానీ అంతా సిద్ధం అవుతున్నారు. ఈ తేదీలో కాకపోతే మరో తేదీలో మూవీ తప్పకుండా డిజిటల్ స్క్రీన్ మీదకి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే థియేటర్లలో సక్సెస్ ఫుల్ జర్నీని చేసిన మార్క్ బుల్లితెర మీద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.