Mansoor Ali Khan: చిరంజీవి, త్రిష, కుష్బూలపై పరువునష్టం దావా వేస్తా..

మళ్లీ మొదటికొచ్చిన వ్యవహారం

Courtesy: Twitter

Share:

Mansoor Ali Khan: మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) త్రిష (Trisha) వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ మన్సూర్ ఆ వివాదాన్ని తట్టి లేపుతున్నాడు. చిరంజీవి(Chiranjeevi), త్రిష(Trisha), కుష్బూల(Kushboo) మీద పరువునష్టం దావా కేసును(Defamation suit case) వేశాడు. ఇప్పుడు ఇది నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది.

మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) త్రిష (Trisha) మీద చేసిన వ్యాఖ్యలు, వాటిని సినీ తారలు ఖండించిన తీరు అందరికీ తెలిసిందే. మన్సూర్ మీద అన్ని రకాల ఒత్తిళ్లు రావడంతో చివరకు త్రిషకు (Trisha) సారీ చెప్పాడు మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan). ఆ క్షమాపణలను త్రిష సైతం అంగీకరించినట్టుగా ట్వీట్ వేసింది. అంతటిితో వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ మన్సూర్ మాత్రం మరో సైడ్ నుంచి నరుక్కుంటూ వస్తున్నాడని ఇప్పుడు అందరికీ అర్థమైంది. త్రిషకు (Trisha) అండగా నిలిచిన కుష్బూ, చిరంజీవిల(Chiranjeevi) మీద మన్సూర్(Mansoor Ali Khan) పరువు నష్టం దావా(Defamation suit) వేశాడు. దీంతో మరోసారి మన్సూర్ వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.

ఇటీవల లోకేశ్ కనకరాజ్(Lokesh Kanakaraj) తెరకెక్కించిన ‘లియో’(Leo) చిత్రంలో త్రిషతో పాటు మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) కూడా కీలక పాత్రలో నటించాడు. అయితే తను నటించిన ఇంతకు ముందు సినిమాల్లోలాగా హీరోయిన్‌ను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి రేప్ చేసే సీన్(Rape scene) ఉంటుందేమో అని ఆశించానని కానీ షూటింగ్ జరుగుతున్నంత కాలం కనీసం తనకు త్రిషను(Trisha) చూపించలేదని ఒక ఈవెంట్‌లో మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) ఓపెన్ కామెంట్స్ చేశాడు. త్రిష సైతం ఈ కామెంట్స్‌కు వెంటనే రియాక్ట్ అయ్యింది. ఈ కామెంట్స్ చాలా అసభ్యకరంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. ఇలాంటి కామెంట్స్‌ను తాను ఖండిస్తున్నానంటూ, ఇక జీవితంలో మన్సూర్ అలీ ఖాన్‌తో(Mansoor Ali Khan) కలిసి నటించడం కుదరదు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

ఆయన వ్యాఖ్యలను త్రిషతో(Trisha) పాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఈ వ్యవహారంపై మన్సూర్‌ అలీ ఖాన్‌కు(Mansoor Ali Khan) నోటీసు జారీ చేసింది. అందులో త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మిమ్మల్ని సంఘం సభ్యత్వం నుంచి ఎందుకు తొలగించ కూడదో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. కుష్బూ(Kushboo) వెంటనే స్పందించి మహిళా కమిషన్‌ను(Women's Commission) రంగంలోకి దించింది. మన్సూర్ మీద జాతీయ మహిళా కమిషన్ కేసు కూడా నమోదు చేసింది. చిరంజీవి(Chiranjeevi) సైతం త్రిషకు అండగా నిలుస్తూ.. మన్సూర్‌‌ది వక్రబుద్ది అంటూ స్పందించాడు. 

త్రిష ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై రియాక్ట్ అవ్వడానికి మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) .. ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశాడు. తను మామూలుగా అన్న మాటల వల్ల కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని, తనంటే ఇష్టం లేని వాళ్లు కావాలనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించాడు. అంతే కాకుండా ఈ విషయంలో సారీ చెప్పడం కుదరదు అంటూ అందరి ముందు ప్రకటించాడు. కానీ పోలీస్ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత మన్సూర్ మనసు మారిపోయినట్టుంది. అందుకే త్రిషకు(Trisha) సారీ చెప్పి ఈ వివాదాన్ని ముగించాలని అనుకున్నాడు. త్రిష కూడా పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఇన్‌డైరెక్ట్‌గా మన్సూర్‌ను(Mansoor Ali Khan) క్షమిస్తున్నట్టు పోస్ట్ పెట్టి ఈ వివాదాన్ని ముగించింది.

అంతటితో వివాదం క్లోజ్ అయిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ మన్సూర్ ఇలా వివాదాన్ని తట్టి లేపాడు. చిరంజీవి(Chiranjeevi), త్రిష(Trisha), కుష్బూల(Kushboo) మీద పరువునష్టం దావా వేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే వీరికి నోటీసులు వెళ్తాయని మన్సూర్ చెబుతున్నాడు. మరి వీటిపై ఆ ముగ్గురు ఎలా స్పందిస్తారో చూడాలి. చూస్తుంటే మన్సూర్ ఇదంతా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికే చేస్తున్నాడని నెటిజన్లు అంటున్నారు.