మణిరత్నం నన్ను నిరాశపర్చాడు…

టాలీవుడ్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు గురించి అందరికీ తెలుసు. అతడు ఇప్పటికే ఎన్నో స్టార్ మూవీలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. అదుర్స్, నాయక్, వంటి సినిమాలతో చోటా కే నాయుడు పేరు గడించారు. తమిళ హిట్ మూవీ స్టార్ డైరెక్టర్ పొన్నియన్ సెల్వన్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం మూవీ తనను నిరాశపర్చిందని చెప్పాడు.  బింబిసారతో ఆకట్టుకున్న చోటా టాలీవుడ్ హిట్ మూవీ బింబిసారతో చోటా కే నాయుడు […]

Share:

టాలీవుడ్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు గురించి అందరికీ తెలుసు. అతడు ఇప్పటికే ఎన్నో స్టార్ మూవీలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. అదుర్స్, నాయక్, వంటి సినిమాలతో చోటా కే నాయుడు పేరు గడించారు. తమిళ హిట్ మూవీ స్టార్ డైరెక్టర్ పొన్నియన్ సెల్వన్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం మూవీ తనను నిరాశపర్చిందని చెప్పాడు. 

బింబిసారతో ఆకట్టుకున్న చోటా

టాలీవుడ్ హిట్ మూవీ బింబిసారతో చోటా కే నాయుడు ప్రశంసలు అందుకున్నాడు. రాబోయే మూవీ ‘పెద కాపు’ మూవీకి గానూ చోటా తన కెమెరా వర్క్ తో పేరును గడించాడు. ఇక బింబిసార మూవీలో చోటా కే నాయుడు పనితనం అతని కెమెరా వర్క్ సూపర్బ్ అంటూ అంతా మెచ్చుకున్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాల మీద తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి చెప్పాడు. దీంతో సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

యువదర్శకులతో ఎక్కువగా.. 

ఇప్పటి వరకు తన కెరియర్లో యువదర్శకులతో ఎక్కువగా పని చేసినట్లు చోటా కే నాయుడిని ఇంటర్య్వూయర్ ప్రశ్నించగా.. అవును నేను చాలా మంది యువదర్శకులతో కలిసి పని చేశాను. వారి ఎనర్జీ నాకు ఎక్కువగా నచ్చుతుందని ఆయన తెలిపారు. అందుకోసమే యువ దర్శకులను ఎక్కువగా ఎంచుకుంటానని తెలిపాడు. కానీ తాను సీనియర్ దర్శకులతో కూడా వర్క్ చేశానని వెల్లడించాడు. దాసరి నారాయణరావు వంటి సీనియర్లతో తాను వర్క్ చేశానని ప్రకటించాడు. 

పొన్నియన్ సెల్వన్ తో నిరాశపర్చాడు.. 

కేజీఎఫ్ మూవీలోని సినిమాటోగ్రఫీ తనకు బాగా నచ్చిందని కానీ ఏస్ డైరెక్టర్ పొన్నియన్ సెల్వన్ తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ మూవీ మాత్రం తనను తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపాడు. తాను మణిరత్నం కు పెద్ద అభిమానినని ఆయన తెలిపాడు. మణిరత్నం సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు తాను చెన్నైకి పరుగెత్తికెళ్లి ఆయన మూవీలు తిలకించే వాడినని తెలిపాడు. మణిరత్నం మూవీల్లో ఉండే కంటెంట్ తనను ఎంతో అట్రాక్ట్ చేసిందని పేర్కొన్నాడు. అందుకోసమే మణిరత్నం మూవీలు మిస్ అవకుండా చూస్తానని వెల్లడించాడు. 

బాక్సాఫీస్ వద్ద పేలినా కానీ

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ అయింది. రెండు భాగాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ తో పాటుగా చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి మొదలైన  చాలా మంది స్టార్ క్యాస్ట్ నటించారు. అంతే కాకుండా త్రిష కూడా ఈ మూవీలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద విజయం సాధించినా కానీ కొంత మంది పెదవి విరిచారు. ఈ మూవీ స్టోరీ అర్థం కాలేదని.. అసలు ఏ క్యారెక్టర్ కు ఏ క్యారెక్టర్ ఏమవుతుందని అర్థం కాలేదని అంటున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి చోటా కే నాయుడు కూడా ప్రస్తుతం వైరల్ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మణిరత్నం ఒకప్పుడు హిట్ మూవీలకు పెట్టింది పేరు. ఆయన మూవీ వస్తుందంటే చాలు చాలా మంది చూసేవారు. కానీ కొద్ది రోజుల నుంచి మణిరత్నం తన ఫామ్ ను కోల్పోయాడు. తిరిగి ఇటీవలే పొన్నియన్ సెల్వన్ మూవీతో గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు. అయినా కానీ ఈ మూవీ చాలా మందికి నచ్చలేదని కామెంట్లు చేస్తున్నారు.