Dr.Priya: ఇండస్ట్రీలో విషాదం.. గుండె పోటుతో నటి హఠాన్మరణం..

ఇది ఊహకందని విషాదం. గర్భవతి అయిన మలయాళం నటి డాక్టర్ ప్రియ(Dr. Priya).. చెకప్ కోసం హాస్పిటల్‌కు వెళ్లారు. ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు(Heart attack) రావడంతో వైద్యులు చికిత్స అందించారు. అయినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె 8 నెలల గర్భవతి. రెండు రోజుల క్రితమే మలయాళ నటి రెంజుషా మీనన్(Renjusha Menon) ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రెంజుషా మీనన్ మృతికి కారణాలు తెలియరాలేదు. ఇక ఆమె చనిపోయిన రెండు […]

Share:

ఇది ఊహకందని విషాదం. గర్భవతి అయిన మలయాళం నటి డాక్టర్ ప్రియ(Dr. Priya).. చెకప్ కోసం హాస్పిటల్‌కు వెళ్లారు. ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు(Heart attack) రావడంతో వైద్యులు చికిత్స అందించారు. అయినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె 8 నెలల గర్భవతి.

రెండు రోజుల క్రితమే మలయాళ నటి రెంజుషా మీనన్(Renjusha Menon) ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రెంజుషా మీనన్ మృతికి కారణాలు తెలియరాలేదు. ఇక ఆమె చనిపోయిన రెండు రోజులకే మరో నటి మృతి చెందడం ఇండస్ట్రీ(Industry)లో కలకలం సృష్టిస్తోంది. తాజాగా మలయాళ టెలివిజన్ నటి డాక్టర్ ప్రియ (Dr. Priya) హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె వయసు 35 సంవత్సరాలు. అందులోనూ ఆమె 8 నెలల గర్భవతి(Pregnant). హాస్పిటల్‌కు రెగ్యులర్ చెకప్ కోసం వెళ్లిన ఆమె హఠాత్తుగా గుండె పోటు(Heart attack) కు గురయ్యారు. వైద్యులు ఆమెను బతికించడానికి ప్రయత్నించినా కుదరలేదు. ప్రియ చనిపోవడంతో ఆమె గర్భంలో ఉన్న బిడ్డను కాపాడాలని వైద్యులు ప్రయత్నించారు. బిడ్డను బయటికి తీశారు. ప్రస్తుతం ఆ బిడ్డ ఐసీయూ(ICU)లో ఉంది. ఈ విషయాన్ని మరో మలయాళ నటుడు కిశోర్ సత్య(Kishore Satya) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కిశోర్ పోస్ట్ చదివిన ఎవరికైనా గుండె తరుక్కుపోక మానదు.

‘మలయాళం టెలివిజన్ సెక్టార్‌(Malayalam Television Sector)లో మరో ఊహించని మరణం చోటుచేసుకుంది. డాక్టర్ ప్రియ(Dr. Priya) గుండెపోటుతో నిన్న మృతిచెందారు. ఆవిడ 8 నెలల గర్భవతి. బేబీ ప్రస్తుతం ఐసీయూ(ICU)లో ఉంది. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. నిన్న రొటీన్ చెకప్ కోసం హాస్పిటల్‌కు వెళ్లారు. హఠాత్తుగా గుండె పోటు వచ్చింది’ అని కిశోర్ సత్య తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌(Instagram post)లో పేర్కొన్నారు. ప్రియ హఠాన్మరణాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారని.. ముఖ్యంగా ప్రియ తల్లిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదని కిశోర్ అన్నారు.

‘ఒక్కగానొక్క కూతురు మరణాన్ని తట్టుకోలేక ఆమె తల్లి గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రియ భర్త 6 నెలలుగా ఎక్కడికీ వెళ్లకుండా ఆమెను కన్న తండ్రిలా చూసుకున్నాడు. ఆయన బాధను ఎవరు తీరుస్తారు. నిన్న రాత్రి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, అక్కడ పరిస్థితి చూసి నా గుండె తరుక్కుపోయింది. వాళ్లకు ఏం చెప్పి ఓదారుస్తాం? దేవుడికి ఎన్నో పూజలు చేసే వీళ్లకే ఆ భగవంతుడు ఎందుకింత అన్యాయం చేశాడు? నా మదిలో ఇవే ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు. రంజూష(Ranjusha) మృతి షాక్ నుంచి తేరుకోకముందే మరో విషాదం. ఒక మనిషి కేవలం 35 సంవత్సరాల వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతే ఆ మనిషికి నివాళి అర్పించడానికి కూడా మన మనసు అంగీకరించదు. ఈ విషాదం నుంచి ప్రియ భర్త, తల్లిని ఎలా బయటపడేయాలి.. తెలీదు. ఈ బాధ నుంచి బయటపడే శక్తిని వారికి ఆ దేవుడు ఇవ్వాలి’ అని కిశోర్ తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ పోస్టు చదివిన వారంతా ప్రియ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇలా జరగడం చాలా బాధాకరమని కామెంట్లు పెడుతున్నారు. కాగా, మలయాళ నటి రంజూషా మీనన్ రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె వయసు కూడా 34 ఏళ్లే. ఇంట్లో ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ మరణాన్ని మరిచిపోక ముందే మరో విషాదం మలయాళ టీవీ పరిశ్రమలో చోటు చేసుకోవడం బాధాకరం. డాక్టర్ ప్రియ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.