సలార్ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్. ఈ మూవీలో ప్రభాస్ తరఫున గోల్డెన్ గర్ల్ శ్రుతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీకి గ్రాండ్ అయిన కేజీఎఫ్ సిరీస్ కు డైరెక్టర్ నీల్ ముడిపెడతాడని అంతా అనుకుంటున్నారు. అదే జరిగితే ఇక ఈ మూవీ విజయాన్ని ఎవరూ ఆపలేరని అంతా కామెంట్లు చేస్తున్నారు. అదే జరిగితే డార్లింగ్ ఫ్యాన్స్ […]

Share:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్. ఈ మూవీలో ప్రభాస్ తరఫున గోల్డెన్ గర్ల్ శ్రుతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీకి గ్రాండ్ అయిన కేజీఎఫ్ సిరీస్ కు డైరెక్టర్ నీల్ ముడిపెడతాడని అంతా అనుకుంటున్నారు. అదే జరిగితే ఇక ఈ మూవీ విజయాన్ని ఎవరూ ఆపలేరని అంతా కామెంట్లు చేస్తున్నారు. అదే జరిగితే డార్లింగ్ ఫ్యాన్స్ కు చాలా రోజుల నుంచి పట్టుకున్న బెంగ తీరుతుందని అంతా కామెంట్ చేస్తున్నారు. ఇక అది నిజం కావాలని అంతా కోరుకుంటున్నారు. 

తీరనున్న ఫ్యాన్స్ బెంగ

గత కొద్ది రోజులుగా యంగ్ రెబల్ స్టార్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో ఆడడం లేదు. అతడి నుంచి వచ్చిన బాహుబలి-2 తర్వాత ఏ చిత్రం కూడా ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా ఆడలేదు. దీంతో హార్డ్ కోర్ ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. ఎలాగైనా సరే తమ హీరో హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ తో సలార్ ను కలుపుతారనే వార్త తెలిసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే తమ హీరోకు బ్లాక్ బస్టర్ పక్కా అని అంతా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే సలార్ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ దూసుకుపోతుంది. 100 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఈ మూవీ రిలీజ్ ఉన్న రికార్డులన్నింటినీ తుడిచి పారేస్తుందని మేకర్స్ తో పాటుగా ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ట్రైలర్ వచ్చేది అప్పుడే

ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ డేట్ గురించి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేస్తామని వారు ఫ్యాన్స్ కు హామీ ఇచ్చారు. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం ఈ మూవీ ట్రైలర్ సెప్టెంబర్ లో విడుదల కానుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆగస్టు చివరి వారానికి రావడంతో సెప్టెంబర్ నెల త్వరలోనే రానుంది. ఈ ట్రైలర్ కోసం అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టీజర్ తోనే అన్ని అంచనాలను నెలకొల్పిన ఈ మూవీ ట్రైలర్ ఒక రేంజ్ లో ఉండడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మూవీలో ప్రభాస్ తో పాటుగా శృతి హాసన్, మలయాళ నటుడు పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కొరకు ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు వినికిడి.

టీజర్ తోనే అలా.. మరి ట్రైలర్ ఎలా

జూలై 7వ తేదీన రిలీజ్ అయిన టీజర్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. టీజర్ లో చూపెట్టిన వయొలెన్స్ మరియు ఆ విజువల్స్ చూస్తుంటే ఈ మూవీకి ప్రశాంత్ నీల్ లాస్ట్ మూవీ కేజీఎఫ్ కు ఏదో లింక్ ఉన్నట్లు అనిపిస్తుంది. టీజర్ లోనే యాక్షన్ సీన్స్ ఓ లెవెల్లో ఉన్నాయి. ఇక ట్రైలర్ లో యాక్షన్ ను డైరెక్టర్ ఎలా చూపించనున్నాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీజర్ తోనే ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఇంకా ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో అని అంతా కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీని తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అందుకోసం థియేటర్లను కూడా బుక్ చేసి పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీ అనుకున్న తేదీకే వస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. అంతే కాకుండా ఇండియన్ మూవీలో ఉన్న రికార్డులను ఈ మూవీ కచ్చితంగా తిరగరాస్తుందని ఇటు ఫ్యాన్స్ తో పాటు అటు మేకర్స్ కూడా నొక్కి చెబుతున్నారు.