Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!

శంకర్(Shankar) దర్శకత్వంలో రామ్‌ చరణ్‌(Ram Charan) నటిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌(Game Changer)’. దసరా సందర్భంగా చిత్ర బృందం మ్యూజికల్ అప్డేట్(Update) అందించారు. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌(Ram charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్‌(Shankar) దర్శకత్వంలో వహిస్తున్న తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌(Game Changer)’. పవర్‌ ఫుల్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్ లో చెర్రీ తండ్రీకొడులుగా రెండు విభిన్నమైన లుక్స్‌ లో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) […]

Share:

శంకర్(Shankar) దర్శకత్వంలో రామ్‌ చరణ్‌(Ram Charan) నటిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌(Game Changer)’. దసరా సందర్భంగా చిత్ర బృందం మ్యూజికల్ అప్డేట్(Update) అందించారు.

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌(Ram charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్‌(Shankar) దర్శకత్వంలో వహిస్తున్న తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌(Game Changer)’. పవర్‌ ఫుల్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్ లో చెర్రీ తండ్రీకొడులుగా రెండు విభిన్నమైన లుక్స్‌ లో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మెగా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. అయితే చాలా కాలంగా మరో అప్డేట్(Update) ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ తో వచ్చారు. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం త్వరలో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ రానున్నట్లు సమాచారం. ఈ నెల (అక్టోబర్28న) ఈ సాంగ్ ను రిలీజ్(Release) చేయబోతున్నారని తెలుస్తోంది. త్వరలో మేకర్స్ నుంచి అధికారక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. లీకైన సాంగ్ రిలీజ్ చేస్తున్నారా? లేక కొత్త సాంగ్ ఏమైనా రిలీజ్ చేస్తున్నారా అనే క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.  ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ పోస్టర్ ను పంచుకున్నారు. ఇందులో కలర్ ఫుల్ డ్రెస్ లో ఉన్న రామ్ చరణ్ బ్యాక్ సైడ్ లుక్ ని మాత్రమే చూపించారు. అతని చేతిలో బుక్, మరో చేతికి కడియం, చెవి పోగును మనం గమనించవచ్చు. బ్యాగ్రౌండ్ సెటప్ అంతా చూస్తుంటే ఇది శంకర్ స్టైల్ లో భారీ స్కేల్ లో చిత్రీకరించిన సాంగ్ అని స్పష్టమవుతోంది. 

 నిజానికి కొన్ని రోజుల ముందు ‘గేమ్‌ ఛేంజర్‌’(Game Changer) సినిమా నుంచి ఆన్ లైన్ వేదికగా ఓ సాంగ్ లీకైన సంగతి తెలిసిందే. ‘జరగండి జరగండి.. జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చెనండీ’ అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయింది. లిరిక్స్ మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. ఏదో ఒకటీ రెండు లైన్స్ కాకుండా ఏకంగా బేసిక్ వెర్షన్ ఫుల్ సాంగ్ బయటకు రావడం అందరినీ షాక్ కు గురి చేసింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న మేకర్స్.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. లీక్ చేసిన వారిపైనే కాదు.. ఈ పాటను వాట్సాప్‌ తోపాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన వారిపైనా చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. 

అయితే అప్పుడు లీకైన ‘జరగండి’ పాటనే ఇప్పుడు అఫీషియల్ గా రిలీజ్ చేయాలని ‘గేమ్‌ ఛేంజర్‌’ టీమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాకపోతే దానికి థమన్(Thaman) సౌండింగ్ ని మిక్స్ చేసి ఫ్రెష్ ఫీలింగ్ కలిగించేలా ఫైనల్ వెర్షన్ సాంగ్ ను వదులబోతున్నారని సమాచారం. ఈ పాటను దసరా పండగకే విడుదల చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ.. దర్శక నిర్మాతలు మాత్రం విజయ దశమికి అప్డేట్ ఇచ్చి, దీపావళికి సాంగ్ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రామ్ చరణ్, కియారా లపై షూట్ చేసిన ఈ పాట ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్‌ రాజు – శిరీష్(Dil Raju – Sirish) నిర్మిస్తున్నారు. తమ బ్యానర్ లో రూపొందే 50వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇందులో ఎస్‌.జె. సూర్య విలన్(S.J. Surya) గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, జయరామ్, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ సినిమాకు అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అది ఎప్పుడనేది శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఇండియన్ 2’ సినిమా మీద ఆధారపడి ఉంది.