పుష్ప సినిమాను రిజెక్ట్ చేసిన న‌టులు వీరే..!

పుష్ప.. అదో మూవీ కాదు.. అదో ఫైరు అని చాలా మంది చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను తిరగరాసిన పుష్పమూవీలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. అతడికి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆడిపాడింది. ఈ విషయం అందరికీ తెలసిందే గా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అని అనుకుంటున్నారా… దానికీ ఓ కారణం ఉంది. పుష్ప మూవీలో అల్లు అర్జున్ ను మొదట హీరోగా అనుకోలేదట. హీరోలుగా అనుకున్న వారు ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ […]

Share:

పుష్ప.. అదో మూవీ కాదు.. అదో ఫైరు అని చాలా మంది చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను తిరగరాసిన పుష్పమూవీలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. అతడికి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆడిపాడింది. ఈ విషయం అందరికీ తెలసిందే గా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అని అనుకుంటున్నారా… దానికీ ఓ కారణం ఉంది. పుష్ప మూవీలో అల్లు అర్జున్ ను మొదట హీరోగా అనుకోలేదట. హీరోలుగా అనుకున్న వారు ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేయడంతో ఈ మూవీ చివరకు అల్లు అర్జున్ వద్దకు వచ్చిందని ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ ఈ మూవీని తెరకెక్కించిన టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇటీవలే ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కూడా పుష్ప మూవీ దుమ్ములేపింది. మొట్టమొదటి సారిగా ఓ తెలుగు హీరోకు నేషనల్ అవార్డును తీసుకొచ్చి పెట్టింది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత సంచలనాలు క్రియేట్ చేసింది. ప్రపంచం మొత్తం పుష్ప ఫీవర్ తో ఊగిపోయింది. 

అందులో కొత్త రికార్డు 

తెలుగు చలన చిత్ర పరిశ్రమ పుట్టి చాలా సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక్కటంటే ఒక్క నేషనల్ అవార్డు కూడా రాలేదు. మొట్ట మొదటి సారిగా పుష్ప సినిమాకు గాను హీరో అల్లు అర్జున్ కు ఈ నేషనల్ అవార్డు వచ్చింది. దీంతో అల్లు అర్జున్ మీద పొగడ్తల వర్షం కురుస్తోంది. అల్లు అర్జున్ తాత స్వర్గీయ అల్లు రామలింగయ్య, అతని మేనమామ మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమను కొత్త హైట్స్ కు తీసుకెళ్లారని, అలాగే అల్లు అర్జున్ కూడా తన నటనతో ఇండస్ట్రీకి మరిన్ని కీర్తి ప్రతిష్టలు తెస్తున్నాడని అంతా కొనియాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు లీడింగ్ పార్టీ లీడర్స్ కూడా అల్లు అర్జున్ కు అభినందనలు తెలియజేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం పుష్ప ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా పుష్ప టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ అనేక మంది ట్వీట్లు చేస్తున్నారు. ఈ మూవీకి ఇంత స్పందన వస్తుందని తెలియక కొంత మంది నటీనటులు ఈ మూవీ ఆఫర్ ను తిరస్కరించారట. ఇక చేసేదేం లేక చివరికి ఈ సబ్జెక్ట్ అల్లు అర్జున్ ను చేరింది. అల్లు అర్జున్ హీరోగా చేసేందుకు ఒప్పుకోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని టాక్. ఇక ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ మూవీలను ఎంతో మంది హీరోలు వదులుకున్నారు. ఇండస్ట్రీలో ఇటువంటి విషయాలు కామన్ అని కొంత మంది కామెంట్ చేస్తున్నారు. 

మొదట మహేశ్ వద్దకు.. 

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టను లెక్కల మాస్టారు సుక్కు మొదట మహేశ్ వద్దకు తీసుకెళ్లాడట. వారు ఇప్పటికే 1 నేనొక్కడినే వంటి మూవీ చేసి ఉన్నారు. కానీ అందులోని క్యారెక్టర్ ఫుల్ మాస్ యాంగిల్ లో ఉంటుంది. మహేశ్ బాబు లవర్ బాయ్. మహేశ్ బాబును అలా ఊహించుకోవడం కష్టం. వీటి వల్లే మహేశ్ ఈ మూవీ చేసేందుకు నో చెప్పాడట. ఇక చేసేదేం లేక లెక్కల మాస్టారు కూడా అతడి నిర్ణయానికి సరే అని తల ఊపాడట. 

‘శ్రీ వల్లి’గా సామ్ ను అనుకున్నారట… 

శ్రీవల్లి పాట ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీ వల్లి గా డీగ్లామరస్ రోల్ లో నేషనల్ క్రష్ రష్మిక మెరిసిపోయింది. ఈ మూవీతో రష్మిక రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ దెబ్బతో ఒక టాలీవుడ్ లోనే అని కాకుండా అన్ని వుడ్స్ లో రష్మికకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. దీంతో పలు ఇండస్ట్రీల నుంచి రష్మికకు ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. కానీ ఈ పాత్రను సమంతను చేయమని ముందు సంప్రదించారట. దీనికి సమంత ఒప్పుకోకపోవడంతో ఆ క్యారెక్టర్ చివరికి రష్మిక వద్దకు వెళ్లిందని తెలుస్తోంది. హీరోయిన్ పాత్రను రిజెక్ట్ చేసినా కానీ సామ్ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడి ఈ చిత్ర విజయంలో క్రూషియల్ రోల్ పోషించింది. 

భన్వర్ సింగ్ షెకావత్ గుర్తున్నాడా… 

పుష్ప మూవీలో హీరో పుష్పరాజ్ ది ఎంత గుర్తు పెట్టుకోదగ్గ క్యారెక్టరో.. మూవీ చివర్లో వచ్చే ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ ది కూడా అంతే ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ లో మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ దుమ్ము లేపాడు. అతడు చెప్పిన పార్టీ లేదా పుష్ప డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎక్కడో ఓ చోట వినిపిస్తూ ఉంటుంది. అటువంటి క్రేజీ ఆఫర్ ను తమిళ నటుడు విజయ్ సేతుపతి మిస్ చేసుకున్నాడట. మొదట భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ కోసం విజయ్ ని సంప్రదించగా.. అతడు నో చెప్పాడట. ఇక మూవీ టీం ఫాహద్ ఫజిల్ ను ఎంపిక చేసింది. 

ఆ భామే ‘ఊ’ అని ఊపాల్సింది… 

పుష్ప సిమాలో ‘ఊ అంటావా మావా..’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కుర్రకారుతో పాటు ముసలివాళ్లను కూడా ఈ పాట ఉర్రూతలూగించింది. ఈ మాస్ బీట్ లో సమంత చేసిన డ్యాన్స్ అయితే మరో లెవెల్. ఇక మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ ఈ మూవీకి అందించిన సాంగ్స్ అన్నీ మ్యూజికల్ హిట్లే. ఇక ఊ అంటావా పాట పాడిన సింగర్ హస్కీ వాయిస్ ఒక రేంజ్ లో వైరల్ అయింది. సింగర్ హస్కీ వాయిస్ తో పాటు సమంత అల్లు అర్జున్ ల డ్యాన్స్, కొరియోగ్రఫీ వల్ల ఈ సాంగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంతటి హిట్ సాంగ్ లో నటించేందుకు మొదట బాలీవుడ్ భామ నోరా ఫతేహిని చిత్ర బృందం కాంటాక్ట్ చేసిందట. కానీ ఆ భామ రిజెక్ట్ చేయడంతో ఈ ఆఫర్ సమంత తలుపు తట్టిందని ఫిలిం నగర్ టాక్.