మహేష్ బాబు సితార సంద‌డి

టాలీవుడ్ స్టార్ నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు.. సినిమాల విషయం పక్కన పెడితే దిల్ రాజు మొదటి భార్య చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. తరువాత చాలా కాలం తర్వాత దిల్ రాజు తేజస్విని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. దిల్ రాజు కి గత ఏడాది జూన్ 29న కొడుకు పుట్టాడు. ఇక దిల్ రాజు మొదటి భార్య అనితకు పుట్టిన కుమార్తె హర్షితా రెడ్డి గురించి అందరికీ తెలిసింది ఆమె తన తండ్రికి […]

Share:

టాలీవుడ్ స్టార్ నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు.. సినిమాల విషయం పక్కన పెడితే దిల్ రాజు మొదటి భార్య చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. తరువాత చాలా కాలం తర్వాత దిల్ రాజు తేజస్విని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. దిల్ రాజు కి గత ఏడాది జూన్ 29న కొడుకు పుట్టాడు. ఇక దిల్ రాజు మొదటి భార్య అనితకు పుట్టిన కుమార్తె హర్షితా రెడ్డి గురించి అందరికీ తెలిసింది ఆమె తన తండ్రికి దగ్గర ఉండి రెండో పెళ్లి చేయించింది తన కుమారుడు మొదటి పుట్టినరోజును గ్రాండ్గా జరుపుకున్న విషయం తెలిసిందే హైదరాబాదులోని జేఆర్సి కన్వెన్షన్ లో ఈ వేడుకను నిర్వహించారు ఈ ఫంక్షన్కు టాలీవుడ్ మొత్తం హాజరైంది ఈ వేడుకకు హాజరైన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి వేడుకలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన కూతురు సితార. 

దిల్ రాజ్ కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమ నుంచి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.  ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయనతోపాటు తన కూతురు సితారను కూడా తీసుకువచ్చారు. ఓకే ఈవెంట్ కి తండ్రి కూతురు ఇద్దరు హాజరయ్యేసరికి కెమెరా క్లిక్ లన్నీ వాళ్ళిద్దరి పైనే ఉన్నాయి. వైట్ అండ్ వైట్ డ్రెస్సింగ్ లో మెరిసిన వీరిద్దరూ ఈ వేడుకకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కాగా సితార మహేష్ వైట్ అండ్ వైట్ లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేష్ సాధారణంగా ఎక్కడికి వెళ్లినా భార్య నమ్రతతో కలిసి వెళ్తారు. ఈ వేడుకకు మాత్రం కూతురు సితారతో కలిసి వచ్చారు. ఇక వీరిద్దరే ప్రస్తుతం ఫంక్షన్లో హైలెట్ గా నిలిచారు. ఇద్దరు వైట్ కలర్ డ్రెస్ లో అదరగొట్టారు. మహేష్ బాబు వైట్ కలర్ షర్ట్ లో కనిపించగా సితార వైట్ టైట్ డ్రెస్ లో మెరిసింది. ఇక తండ్రి కూతుళ్లు పక్కపక్కన నడుస్తుంటే ఆ సీన్ చూడముచ్చటగా ఉంది. మహేష్ బాబు ఎంతో జాగ్రత్తగా సితార చెయ్యి పట్టుకుని తీసుకెళ్లడం చూపరులను ఆకట్టుకుంది .. ప్రస్తుతం ఈ ఫోటోలు నేట్టింట చెక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత ముద్దుల తనయ సితార చిన్నప్పుడే నుంచి తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ స్టార్ కిడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఏ స్టార్ కిడ్ కు సొంతం చేసుకోలేనంత ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎన్నో అరుదైన రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. అంతేకాకుండా పలు రకాల కళలలో తన ప్రతిభను ప్రదర్శిస్తూ అనేక రికార్డులను సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది సితార.  తాజాగా సితారా ప్రముఖ జ్యువెలరీ యాడ్ లో నటించింది. అందంగా ముస్తాబయి నగలు పెట్టుకుని సారీ కట్టుకొని ఫోజులు ఇచ్చింది. రంగురంగుల సారి వివిధ రకాల జువెలరీ డిజైన్స్ తో ఆమె ఫోటోలకు ఫోజులిచ్చింది. సితారపై ప్రముఖ నగల సంస్థ ఈ వీడియోను షూట్ చేసింది. దాన్ని టైం స్క్వేర్ లో ప్రదర్శించారు. ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యాడ్ ని ప్రదర్శించడం విశేషం.