గుంటూరు కారం.. మ‌హేష్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

యావరేజి సినిమాలను కూడా సూపర్ హిట్ స్టేటస్ వైపు పరుగులు ;పెట్టించే సత్తా ఉన్న అతి తక్కువ మంది స్టార్ హీరోలలో ఒకడు సూపర్ స్టార్ మహేష్ బాబు. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబు కి ఉన్న క్రేజే వేరు. వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ ఇమేజి ని సొంతం చేసుకున్నాడు. ఇక గత ఏడాది ఆయన ‘సర్కారు వారి పాట’ తో మరో సూపర్ హిట్ ని తన […]

Share:

యావరేజి సినిమాలను కూడా సూపర్ హిట్ స్టేటస్ వైపు పరుగులు ;పెట్టించే సత్తా ఉన్న అతి తక్కువ మంది స్టార్ హీరోలలో ఒకడు సూపర్ స్టార్ మహేష్ బాబు. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబు కి ఉన్న క్రేజే వేరు. వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ ఇమేజి ని సొంతం చేసుకున్నాడు. ఇక గత ఏడాది ఆయన ‘సర్కారు వారి పాట’ తో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే ఆ చిత్రానికి మొదటి ఆట నుండి డిజాస్టర్ టాక్ వచ్చింది. 3 రోజులు కూడా థియేటర్స్ లో ఉండదని అందరూ అనుకున్నారు. కానీ ఆ చిత్రానికి రన్ రెండు వారాలకు పైగా వచ్చింది. అభిమానులు, ట్రేడ్ పండితులు ఇదేమి స్టామినా రా బాబు అని ఆశ్చర్యపోయారు. డిజాస్టర్ టాక్ తో మొదలైన ఆ సినిమా ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసింది.

షూటింగ్ దశలోనే రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన థియేట్రికల్ రైట్స్ :

ఇలాంటి అనితరసాధ్యమైన స్టామినా ఉన్న హీరో త్రివిక్రమ్ లాంటి బ్రాండ్ ఇమేజి ఉన్న డైరెక్టర్ తో చేతులు కలిపితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో ‘అతడు’, ‘ఖలేజా’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు కానీ, టీవీ టెలికాస్ట్ లో మాత్రం అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అందుకే వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ చిత్రం ‘గుంటూరు కారం’ పై ట్రేడ్ లో ఇంత క్రేజ్ ఏర్పడింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా అన్నీ ప్రాంతాలలో అద్భుతంగా జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ , ఓవర్సీస్ మరియు కర్ణాటక ప్రాంతాలకు కలిపి ఈ సినిమా 160 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.

అక్షరాలా 78 కోట్ల రూపాయిల పారితోషికం అందుకుంటున్న మహేష్ బాబు :

ఇక ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపుగా 78 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. గత కొన్ని సినిమాల నుండి లాభాల్లో వాటాలు తీసుకుంటూ వస్తున్న మహేష్ బాబు, ఈ సినిమాకి మాత్రం పారితోషికం రూపం లో తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. చాలా మంది పాన్ ఇండియన్ హీరోలు కూడా ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్ ప్రారంభ సమయం లో పూజ హెగ్డే ని మెయిన్ హీరోయిన్ గా, శ్రీలీల ని సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నారు. షూటింగ్ కూడా అలాగే స్టార్ట్ చేసారు, కానీ ఎందుకో మధ్యలో ప్రొపోజ్ హెగ్డే ఈ సినిమా నుండి తప్పుకుంది. అప్పుడు పూజా హెగ్డే పాత్రని శ్రీలీల కి ఇచ్చేసి, శ్రీలీల పాత్ర కోసం మీనాక్షి చౌదరి అనే హీరోయిన్ ని తీసుకున్నారు. మీనాక్షి చౌదరి గతం లో హిట్, ఖిలాడీ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది, రీసెంట్ గా ఈమె హీరోయిన్ గా నటించిన ‘హత్య’ అనే చిత్రం కూడా విడుదలైంది. మరి ఈమె మహేష్ బాబు పక్కన సరిపోతుందో లేదో చూడాలి. కేవలం 20 శాతం షూటింగ్ కూడా పూర్తి కాకముందే 160 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఈ సినిమా, రాబొయ్యే రోజుల్లో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.