Mahesh Babu: ఒత్తిడి ఉండదు.. జాగ్రత్త మాత్రమే ఉంటుంది: మహేష్

ప్రేక్షకులు మనకు స్టార్‌డమ్‌ ఇస్తే.. దాని ద్వారా వచ్చే ఒత్తిడిని కూడా స్వీకరించాల్సిందేనని సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు(Mahesh Babu) అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మహేష్‌(Mahesh) – నమ్రత(Namrata) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్‌ తన తండ్రి దివంగత కృష్ణ(Krishna)ను గుర్తుచేసుకున్నారు.  సూపర్ స్టార్ మహేశ్​ బాబు టాలీవుడ్​(Tollywood)లో ఎంత పెద్ద హీరోనో తెలిసిన విషయమే. ప్రతీ సినిమాకు నటనను మెరుగుపరుచుకుంటూ కెరీర్​లో ఉన్నత స్థాయికి ఎదిగారు. అయితే ఎంతటి స్టార్ యాక్టర్​ అయినా సరే.. […]

Share:

ప్రేక్షకులు మనకు స్టార్‌డమ్‌ ఇస్తే.. దాని ద్వారా వచ్చే ఒత్తిడిని కూడా స్వీకరించాల్సిందేనని సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు(Mahesh Babu) అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మహేష్‌(Mahesh) – నమ్రత(Namrata) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్‌ తన తండ్రి దివంగత కృష్ణ(Krishna)ను గుర్తుచేసుకున్నారు.

 సూపర్ స్టార్ మహేశ్​ బాబు టాలీవుడ్​(Tollywood)లో ఎంత పెద్ద హీరోనో తెలిసిన విషయమే. ప్రతీ సినిమాకు నటనను మెరుగుపరుచుకుంటూ కెరీర్​లో ఉన్నత స్థాయికి ఎదిగారు. అయితే ఎంతటి స్టార్ యాక్టర్​ అయినా సరే.. కథలు, పాత్రలు, సినిమాలు, వాటి రిజల్ట్​ విషయంలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయం గురించి మాట్లాడారు మహేశ్​బాబు(Mahesh Babu). స్టార్‌ అయితే ఒత్తిడిని అంగీకరించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మహేశ్‌-నమ్రత దంపతులు హాజరై సందడి చేశారు. అక్కడే మహేశ్​.. తన కెరీర్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను మాట్లాడారు. తన తండ్రి దివంగత నటుడు సూపర్ స్టార్​ కృష్ణను గుర్తుచేసుకున్నారు.

Read More: Ram charan: ఇండియన్ 2 లో నటించబోతున్న గ్లోబల్ స్టార్..?

 “సక్సెస్(Success) వచ్చినప్పుడు ఆనందం కంటే, ఎక్కువ బాధ్యతగా ఫీల్ అవుతాను. మరింత కష్టపడాలనుకుంటాను. ఫ్లాపుల వల్ల నేను ఎలాంటి ఒత్తిడిని అనుభవించనప్పటికీ, ప్రేక్షకులు నా నుంచి ఎక్కువ ఆశిస్తున్నందున, నా చిత్రాల ఎంపికలో నేను మరింత జాగ్రత్తగా ఉన్నాను. తన కోసం థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడికి ఏదో ఒక కొత్తదనం చూపించడం తన బాధ్యత అంటున్నాడు మహేష్.. ఫిజిక్ లో మార్పు మాత్రమే కాదు, హెయిర్ స్టయిల్ లో చిన్న మార్పు కూడా కొత్తదనాన్నిస్తుందని చెబుతున్నాడు. ఈ క్రమంలో ఫ్లాప్ వచ్చినప్పుడు బాగా కుంగిపోయిన ఫీలింగ్ వస్తుందని చెబుతున్నాడు.

“సినిమా బాగా ఆడనప్పుడు, కుంగిపోయిన ఫీలింగ్ ఉంటుంది. చాలా అంచనాలు ఉంటాయి, చాలా మంది చాలా కష్టపడి సినిమా తీస్తారు. అయితే, ఆ సినిమా కార్యరూపం దాల్చడానికి నేను కారణం కాబట్టి, ఫ్లాప్ అయితే పూర్తి బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ఎందుకంటే, నేను ప్రాజెక్ట్‌కి గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వకపోతే, అసలు ఆ సినిమా వచ్చి ఉండేది కాదు కదా. నేను అది నమ్ముతాను. అలా చేయడమే బెటర్. దాని వల్ల నా నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టడానికి వీలవుతుంది. విజయం ఒక్కసారిగా రాదు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటేగానీ వస్తుందని” అంటూ మహేశ్‌ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు.

ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram) దర్శకత్వంలో గుంటూరు కారం(Gunturu Karam) అనే మాస్​ యాక్షన్ ఎంటర్​టైనర్​ సినిమా చేస్తున్నారు. ‘అతడు(Athadu)’, ‘ఖలేజా(Khaleja)’ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రానున్న చిత్రమిది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమాలో మహేశ్‌కు జోడీగా హీరోయిన్లు శ్రీలీల(Sreeleea), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సేషనల్​ మ్యూజిక్ డైరెక్టర్​ తమన్‌ స్వరాలు అందించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్​పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 

దీని తర్వాత దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)తో ఓ భారీ ప్రాజెక్ట్​ చేస్తున్నారు మహేశ్. అడ్వెంచర్ నేపథ్యంలో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని సమాచారం. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad) కథ రాస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం మహేష్ ఏకంగా రూ. 110 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక గుంటూరు కారం సినిమాకు మహేష్ బాబు రూ. 78 కోట్లను పారితోషకంగా అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.