స్కాట్‌లాండ్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న‌ మ‌హేష్ బాబు

మన టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఎవరు అనగానే మనకు గుర్తుకు వచ్చే జంట సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత శిరోద్కర్..  అభిమానులే కాదు, ఇతర సెలబ్రిటీలు కూడా పాపులర్ జంటను ఎంతగా ప్రేమిస్తున్నారనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. మ‌హేష్ బాబు పుట్టినరోజుకు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండగా బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం ఫామిలీ అంత స్కాట్లాండ్‌లో ఉంది ఈ క్షణాన్ని వారి పిల్లలు గౌతమ్ ఘట్టమనేని, […]

Share:

మన టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఎవరు అనగానే మనకు గుర్తుకు వచ్చే జంట సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత శిరోద్కర్..  అభిమానులే కాదు, ఇతర సెలబ్రిటీలు కూడా పాపులర్ జంటను ఎంతగా ప్రేమిస్తున్నారనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. మ‌హేష్ బాబు పుట్టినరోజుకు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండగా బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం ఫామిలీ అంత స్కాట్లాండ్‌లో ఉంది ఈ క్షణాన్ని వారి పిల్లలు గౌతమ్ ఘట్టమనేని, సితార ఘట్టమనేని బంధించారని కూడా ఆయన పంచుకున్నారు. . ఫామిలీ అంత ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు . మహేష్ బాబు ఒకవైపు సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. తన కుటుంబానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మహేష్ బాబు ని ఒక పర్ఫెక్ట్ ఫామిలీ మాన్ అని అనొచ్చు.

 ఈయన కాస్త రీ ఫ్రెష్ అవుదామని స్కాట్లాండ్‌కు వెళ్లారు. అక్కడ తన కుటుంబంతో గడిపిన సమయాన్ని మహేష్ బాబు నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ వెకేషన్ నుండి ఇప్పటికే కొన్ని పిక్స్ బయటకు వచ్చి వైరల్ కాగా ఇప్పుడు మహేష్ తన భార్యతో కలిసి దిగిన అందమైన పిక్ ను షేర్ చేసుకున్నాడు.

ఈ పిక్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఫైర్ వర్క్స్ ను ఇద్దరు కలిసి చూస్తూ ఉండగా దిగిన అద్భుతమైన పిక్ ను అందరితో పంచుకున్నాడు.ఈ పిక్ తో మరోసారి మహేష్ తన ప్రేమను ఈ విధంగా తెలిపారు.ఇద్దరు ఎంతో అపురూపమైన క్షణాలను ప్రేమగా ఆస్వాదిస్తునట్టు అనిపిస్తుంది .

కోట్ల రూపాయలతో కొత్త కారు కొన్న మహేష్ బాబు

ఓ వైపు సినిమాల్లో.. మరోవైపు పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉండే మహేష్ బాబు రీసెంట్ గా కోట్ల రూపాయలు వెచ్చించి ఓ రేంజ్ రోవర్ కారు కొన్నారట. అందరిలో డిఫరెంట్ గా గోల్డ్ కలర్ ఎంచుకున్నారు. దీనికోసం ఏకంగా 5.4 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది.. ఈ కారు తాలూకు వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వీలు కుదిరినప్పుడల్లా భార్యాపిల్లలతో కలిసి సరదాగా టూర్స్ వేయడం మహేష్ బాబు హ్యబీ. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ పరిపూర్ణ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు ఈ సూపర్ స్టార్. అంతేకాదు పలు సామజిక కార్యక్రమాలు చేస్తూ అందరి మెప్పు పొందుతుంటారు.

గుంటూరు కారం సినిమా వివరాలు… 

సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన మహేష్ బాబు.. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్  దర్శకత్వంలో గ్రాండ్ గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది

ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ అంటూ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. గుంటూరు కారం అంటూ టైటిల్‌ను ఖరారు చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.

గుంటురూ కారం’ సినిమా విషయంలో ఇప్పటికే రకరకాల వివాదాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుందని.. పూజా ఈ సినిమా కోసం దాదాపుగా 4 కోట్లు డిమాండ్ చేయడంతో ఆమెను టీమ్ తప్పించారు. ఇక ఆమె స్థానంలో శ్రీలీలను మేయిన్ హీరోయిన్‌గా తీసుకున్నారట. సెకండ్ లీడ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.

అనేక వివాదాల నడుమ ఈ సినిమా ఇప్పుడే ట్రాక్‌లోకి వచ్చింది. అందులో భాగంగా రీసెంట్ టీమ్ ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మహేష్ లండన్‌లో ఉన్నారు.. రాగానే కొత్త షెడ్యూల్ షురూ కానుంది. ఈ మూవీపై మహేష్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్ వరల్డ్ మూవీ చేయనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా వచ్చే యేడాది సెట్స్ పైకి వెళ్లనుంది. 2025లో ఈ సినిమా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ నెల 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘గుంటూరు కారం’ టీజర్‌తో పాటు రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమాపై బిగ్ అప్‌డేట్ ఇవ్వనున్నట్టు సమాచారం