Mahesh Babu: నెట్టింట మ‌హేష్ బాబు క్రేజీ పిక్ వైర‌ల్‌..!

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవర్ గ్రీన్ హ్యాండ్ సమ్ హీరో ప్రిన్స్ మ‌హేష్ బాబు (mahesh babu) 50 ఏళ్లకు రెండేళ్ల దూరంలో ఉన్నాడు. అయినా ఇంకా కుర్ర హీరోలా మెరిసిపోతూ ఉంటాడు. ఇక ఆయన ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జిమ్ లో బాడీ బిల్డ్ చేస్తున్న ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటో చూసిన […]

Share:

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవర్ గ్రీన్ హ్యాండ్ సమ్ హీరో ప్రిన్స్ మ‌హేష్ బాబు (mahesh babu) 50 ఏళ్లకు రెండేళ్ల దూరంలో ఉన్నాడు. అయినా ఇంకా కుర్ర హీరోలా మెరిసిపోతూ ఉంటాడు. ఇక ఆయన ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జిమ్ లో బాడీ బిల్డ్ చేస్తున్న ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటో చూసిన అభిమానులు ఫైర్ ఇమేజీస్, స్పీచ్ లెస్, సూపర్ ఫిజిక్ అంటూ పలు కామెంట్లతో స్పందిస్తున్నారు. మహేష్ బాబు భార్య నమ్రత (namrata shirodkar) కూడా ఫైర్ ఇమోజీ పెట్టి స్పీచ్ లెస్ అంటూ మహేష్ బాబు ఫోటో పై స్పందించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు 25 ఏళ్లు అంటే నమ్మచ్చేమో అలా మెయింటేన్ చేస్తుంటాడు. ఆ కలర్.. హ్యాండ్సమ్ నెస్.. అమ్మాయిలు పిచ్చిగా ప్రేమించే మహేష్ బాబు..ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మధ్య అయితే ప్రతి సినిమాలోన్యూ లుక్ ను ట్రై చేస్తూ.. సరికొత్తగా కనిపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు మహేష్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన లేటెస్ట్ లుక్ ఒక‌టి బయటకొచ్చింది. 

ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో.. గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు మహేష్.. ఈ సినిమా ఎన్నో అవాంతరాల నడుమ షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ మూవీ తరువాత స్టార్ ద‌ర్శ‌కుడు రాజమౌళి డైరెక్ష‌న్‌లో మహేష్ మూవీ చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఇంకా ముహూర్తం కూడా సాగని ఈ సినిమాపై ఇప్పటికే వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. పైగా ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బంపర్‌ హిట్ తర్వాత జక్కన్న తెరెకెక్కిస్తున్న సినిమా కావడంతో యావత్‌ సినీ అభిమానులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. 

మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు రాజమౌళి. అది కూడా ఆఫ్రికన్ అడువుల్లో అడ్వెంచర్ మూవీగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే రాజమౌళి స్టోరీ లైన్‌ చెప్పి సినీ అభిమానుల్లో తిరుగులేని అంచనాలు నెలకొల్పాడు. పైగా పాన్‌ వరల్డ్‌ రేంజ్‌ సినిమా అంటూ సోషల్ మీడియా హైప్‌తోనే మహేష్‌ అభిమానులు దిల్ ఖుష్ అవుతోంది. అంతే కాదు.. ఈమూవీ ఈసారి ఎన్ని ఆస్కార్ లు కొడుతుందా అని అంతా ఎదరు చూస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మేకోవర్ అవుతున్నట్టు సమాచారం. జిమ్ లో తన బాడీని ఈ సినిమాకు తగ్గట్టు మార్చుకుంటున్నాడు. ఏ హాలీవుడ్ హీరోలాగానో మహేష్ ను మార్చే పనిలో ఉన్నాడు జక్కన్న. ఇక ఇందుకు సంబంధించిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా.. ఎంతైనా కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాడట. మాములుగా ఇండస్ట్రీలో మహేష్‌ను చాలా సాఫ్ట్‌ అని.. ఎక్కువగా రిస్క్‌ల జోలికి వెళ్లడు అని అంటుంటారు. అయితే రాజమౌళి సినిమా కోసం కండలు పెంచుతూ, జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ కనిపిస్తున్నాడు ప్రిన్స్. తాజాగా ఆయన జిమ్ ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మహేష్ జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. 

ఈ పోస్ట్ కు ఓ ట్యాగ్ కూడా తగిలించాడు..  హార్డ్ వర్క్ విషయానికి వస్తే ఏదీ ఎప్పుడూ నలుపు & తెలుపు కాదు… దానిని తీర్చిదిద్దడం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకోచ్చాడు సూపర్ స్టార్. మహేష్ కొత్త లుక్ పై ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ స్పందిస్తూ మాటలు రావడం లేదంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అభిమానులు కామెంట్ల రూపంలో మహేష్ కు మద్దతు పలుకుతున్నారు. మహేష్‌ యంగ్‌లుక్‌లో కనడటానికి రహస్యం ఇదేనా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.