‘గాజుబొమ్మ’ పాటకి మహేష్ బాబు ప్రశంసలు

హాయ్ నాన్న సినిమా గురించి ఇంతకుముందు ఒక ప్రత్యేకమైన సాంగ్ తో అప్డేట్ వచ్చేసింది. అయితే ఇప్పుడు తండ్రి కూతుర్లు మధ్య ఉండే ప్రేమకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన సాంగ్ సినిమా టీం రిలీజ్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి, తండ్రి కూతుర్ల ప్రేమకు సంబంధించిన ప్రతికమైన సాంగ్ గురించి మహేష్ బాబు తనవైపు నుంచి ప్రశంసలు వినిపించారు. అంతేకాకుండా ఈ సినిమాలో మృనల్ ఠాగూర్ తెలుగు సినిమా ప్రేక్షకులను మరోసారి అలరించడానికి రాబోతున్నారు. గాజు బొమ్మ […]

Share:

హాయ్ నాన్న సినిమా గురించి ఇంతకుముందు ఒక ప్రత్యేకమైన సాంగ్ తో అప్డేట్ వచ్చేసింది. అయితే ఇప్పుడు తండ్రి కూతుర్లు మధ్య ఉండే ప్రేమకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన సాంగ్ సినిమా టీం రిలీజ్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి, తండ్రి కూతుర్ల ప్రేమకు సంబంధించిన ప్రతికమైన సాంగ్ గురించి మహేష్ బాబు తనవైపు నుంచి ప్రశంసలు వినిపించారు. అంతేకాకుండా ఈ సినిమాలో మృనల్ ఠాగూర్ తెలుగు సినిమా ప్రేక్షకులను మరోసారి అలరించడానికి రాబోతున్నారు.

గాజు బొమ్మ పాట: 

తెలుగు వారి ప్రశంసలు అందుకున్న నాని, ఒక తండ్రి – కూతురు మధ్య సంబంధాన్ని అద్దం పట్టే చిత్రంలో కనిపించబోతున్నాడు. హాయ్ నాన్నా అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అనుబంధంపై దృష్టి సారించి, ఓవరాల్ గా మంచి అనుభూతిని కలిగిస్తుందని అంచనా వేయచ్చు. రెండు వారాల క్రితం చిత్రం యొక్క మొదటి సింగిల్ విడుదలైన తరువాత, రెండవ సింగిల్ విడుదల అవ్వడమే కాకుండా, అందులో తండ్రి భావోద్వేగాలు, కూతురు మీద తండ్రికి ఉన్న అపారమైన ప్రేమను ప్రతిభందిస్తుంది. 

దసరా నటుడు గతంలో తన సోషల్ మీడియా ద్వారా పాట గురించిన మంచి విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ రోజు పూర్తి పాట విడుదల తేదీని కూడా ప్రకటించారు. ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ పాట ఖచ్చితంగా ప్రజల హృదయాలను ఆకర్షిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. విజయ్ దేవరకొండ మరియు సమంతా రూత్ ప్రభు నటించిన చిత్రం కుషి తర్వాత ..హేషమ్ అబ్దుల్ వహాబ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ హాయ్ నాన్న. ఈ గాజు బొమ్మ పాట విన్న తర్వాత మహేష్ బాబు తన ప్రశంసలు అందించారు. మంచి అనుభూతిని కలిగించే పాట అంటూ.. హాయ్ నాన్న చిత్రానికి అభినందనలు తెలిపారు. 

సినిమా విశేషాలు: 

దర్శకుడు-రచయిత అయిన శౌర్యువ్ హాయ్ నాన్నాకు రచన మరియు దర్శకత్వం వహించాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం) మరియు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల పాన్-ఇండియన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర బృందంలో సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వరుగీస్, ఎడిటర్‌గా ప్రవీణ్ ఆంథోని మరియు ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా ఉన్నారు.

ప్రత్యేక ఆకర్షణ మృణాల్: 

ముఖ్యంగా హిందీ సీరియల్స్ తో అలరించి, తెలుగులో అడుగుపెట్టిన మృనాల్ ఠాకూర్, తన నటనతో సీతారామం సినిమాతో అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా తన సినీ కెరీర్ ను చాలా చక్కగా మలుచుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ‘హాయ్ నాన్న’ అనే సినిమా లో నటించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో నాని హీరోగా ప్రధాన పాత్రలో నటించారు. మరి ఈ సినిమాకు గాను పారితోషకాన్ని అందుకున్న సీతారామం హీరోయిన్, రెండున్నర కోట్లు వరకు తీసుకున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనంతరం, సీతారామం సినిమాతో హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నాని, విజయ్ దేవరకొండ, హీరోల సరసన కూడా తనదైన శైలిలో నటించడానికి, వారితో కొన్ని సినిమాలు సైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రవితేజ గోపీచంద్ సినిమాలో కూడా మృనాల్ ఠాకూర్ నటించబోతోంది. మరో పక్క బాలీవుడ్ లో కూడా మృనాల్ ఠాకూర్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.’ఆంఖ్ మే చోలీ’, ‘పూజ మేరీ జాన్’, ‘పిప్ప’ వంటి సినిమాల్లో నటిస్తోంది మృనాల్ ఠాకూర్.