Leo: ఉదయం 4 గంటల షోపై ప్రభుత్వంతోనే తేల్చుకోండి.. లియో సినిమా విషయంలో మద్రాస్ హైకోర్టు తీర్పు

ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వంతోనే చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని మద్రాస్‌ హైకోర్టు సినిమా ప్రొడ్యూసర్కు సూచించింది.  Leo Movie :లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో తలపతి విజయ్ (Thalapathy Vijay), త్రిష జంటగా నటిస్తున్న ‘లియో’ (LEO) మూవీ ఉదయం 4 గంటల షోపై మద్రాస్ హైకోర్టు (Madras high court)కీలక వ్యాఖ్యలు చేసింది. ఉదయం 4 గంటల షో నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వానికే వదిలేస్తున్నట్లు తెలిపింది.లియో స్పెషల్ స్క్రీనింగ్ వాదనపై జస్టిస్ అనితా సుమంత్‌ బెంచ్ […]

Share:

ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వంతోనే చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని మద్రాస్‌ హైకోర్టు సినిమా ప్రొడ్యూసర్కు సూచించింది. 

Leo Movie :లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో తలపతి విజయ్ (Thalapathy Vijay), త్రిష జంటగా నటిస్తున్న ‘లియో’ (LEO) మూవీ ఉదయం 4 గంటల షోపై మద్రాస్ హైకోర్టు (Madras high court)కీలక వ్యాఖ్యలు చేసింది. ఉదయం 4 గంటల షో నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వానికే వదిలేస్తున్నట్లు తెలిపింది.లియో స్పెషల్ స్క్రీనింగ్ వాదనపై జస్టిస్ అనితా సుమంత్‌ బెంచ్ తన నిర్ణయాన్ని వెలువరించింది. అక్టోబర్ 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి షోలను అనుమతించే నిర్ణయంపై పున:పరిశీలనను తమిళనాడు ప్రభుత్వానికే వదిలి వేస్తున్నట్లు మద్రాస్ హైకోర్టు తెలిపింది.

కాగా, లియో చిత్రానికి స్పెషల్ షోలు వేయకుండా తమిళనాడు ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను (Orders) పున:పరిశీలించాలని లియో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. అయితే, ఉదయం 4 గంటల షో కోసం హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదు. అంతేకాకుండా, ఇండస్ట్రీ ప్రముఖుడు శ్రీధర్ పిళ్లై ఈ విషయంపై ట్వీట్ చేశారు. మూవీ స్పెషల్ షోపై(Special show) చర్చించేందుకు లియో నిర్మాతతో పాటు తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం ప్రతినిధులు తమిళనాడు ప్రభుత్వ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు.  

సినిమా రన్ టైమ్‌ (Movie run time) 2 గంటల 44 నిమిషాలు..

కాగా, సాధారణంగా సినిమాలు 2 గంటలు, 2.15 గంటలు, 2.30 గంటల నిడివి ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రమే దాదాపు 3 గంటల నిడివి ఉంటుంది. లియో విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా మొత్తం రన్ టైమ్ 2 గంటల 44 నిమిషాలు అని తెలిసింది. బ్రేక్‌ టైమ్‌, థియేటర్‌ శుభ్రం చేయడానికి, తదితర ఆరెంజ్‌మెంట్లు చేసుకోవడానికి ప్రతి 2 షోల మధ్య కచ్చితమైన గ్యాప్ ఉండాలి. ఇందులో భాగంగా ప్రతి షోకు మొత్తం 3 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది.  

కాబట్టి, మొత్తం ఐదు షోలు కలిసి దాదాపు 18 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది. అయితే, ప్రభుత్వ జీవో ప్రకారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 1.30 వరకు మాత్రమే రాష్ట్రంలో షోలకు అనుమతి ఉంది. ఈ లెక్కన మొత్తం సమయం 16 గంటల 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్నాటకలో సినిమాకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో తెల్లవారుజామున 4 గంటల షోకు అనుమతించారు. మరోవైపు, తమిళనాడు ప్రభుత్వంతో జరిగే చర్చల అనంతరం రాష్ట్రంలో కూడా తెల్లవారుజామున 4 గంటల షో అనుమతులపై ఓ క్లారిటీ రానుంది.

 ‘లియో’కు భారీ డిమాండ్..

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం లియో మ్యానియా (Leo Movie) నడుస్తుంది. అదే రేంజ్‌లో బుకింగ్స్‌ (Bookings) కూడాఉన్నాయి. ఈ నెల 19న విడుదల కానున్న ఈ మూవీ టికెట్స్ బుకింగ్స్ దేశంలో, విదేశాల్లో ఉన్న అన్ని సెంటర్లలో రికార్డులను (Records)అధిగమించింది. భారీ అంచనాల మధ్య సినిమా విడుదల అవుతుండటంతో తొలి రజు భారీ వసూళ్లు రాబట్టవచ్చని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

కాగా, ఇటీవల లియో దర్మకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయిందని, అందుకే మూవీ  చూడటానికి వచ్చే ప్రేక్షకుడు ఎలాంటి అంచనాలు లేకుండా ‘క్లీన్‌ మైండ్సెట్’ (Clean mindset) తో థియేటర్లకు రావాలని విజ్ఞప్తి చేశాడు. సినిమాపై హైప్ ఉండటంతో అడియన్స్‌ క్లియర్ మైండ్‌తో ఎంజాయ్‌ చేయడం మంచిదని ఆయన వెల్లడించాడు. దాదాపు 3 వేల మంది సిబ్బంది ఈ సినిమా కోసం పనిచేశారని చెప్పాడు. అయితే, సినిమాలో మొదటి 10 నిమిషాలను ప్రేక్షకులు అస్సలు మిస్‌ కావొద్దని మరోసారి స్పష్టం చేశాడు. విజయ్‌, త్రిష హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్‌తో పాటు అర్జున్ సర్జా తదితరులు నటిస్తున్నారు.