యాపిల్ సీఈఓ‌కి వడాపావ్ రుచి చూపించిన మాధురీ దీక్షిత్

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1984నుండి 1995 మధ్య కాలంలో హిందీలో అగ్ర హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఈమె మంచి నాట్యకారిణి కూడా. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించడమే కాదు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈమె ప్రతిభను గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. మరాఠీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈమె ముంబైకి చెందినవారు. మైక్రో బయాలజిస్ట్ అవ్వాలని ఆశయం ఉన్న […]

Share:

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1984నుండి 1995 మధ్య కాలంలో హిందీలో అగ్ర హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఈమె మంచి నాట్యకారిణి కూడా. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించడమే కాదు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈమె ప్రతిభను గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. మరాఠీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈమె ముంబైకి చెందినవారు. మైక్రో బయాలజిస్ట్ అవ్వాలని ఆశయం ఉన్న ఆమె కథక్ నృత్యాన్ని ఎనిమిది సంవత్సరాలు అభ్యసించి అందులో ప్రావీణ్యత సాధించారు.

సినిమాల ద్వారా 650 మిలియన్ల ఆస్తులు కూడబెట్టిన ఈమె విదేశాలలో 150 మిలియన్ల దాకా సంపాదించింది. ఇక 55 సంవత్సరాల వయసులో కూడా తన అందంతో యువతను ఉర్రూతలూగిస్తోందంటే ఇక ఈ ముద్దుగుమ్మ ఎంతలా తన అందాలతో యువతను తన వైపు తిప్పుకుంటోందో అర్థం చేసుకోవచ్చు. సినీ రంగంలో ఇప్పటికీ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. అంతటితో ఆగకుండా ఏదో ఒక విషయంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న మాధురీ దీక్షిత్ ఇటీవల ముంబై చేరుకున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌కి ముంబై ఫేమస్ స్నాక్ ఐటమ్ వడాపావ్ రుచి చూపించింది.

ప్రపంచంలో యాపిల్ సంస్థకు చెందిన గ్యాడ్జెట్స్‌కు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా తెలిసిందే. ముఖ్యంగా ఇండియాలో ఈ సంస్థ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో తమ మార్కెట్ ను ఇక్కడ కూడా విస్తరించడానికి ఆపిల్ సంస్థ ముందుకు వచ్చింది.  ఈ క్రమంలోనే ఏప్రిల్ 18న ముంబైలో యాపిల్ తొలి స్టోర్‌ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తాజాగా భారతదేశానికి చేరుకున్నారు. ఇక ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ రావడం ఇక్కడ ఆశ్చర్యపోయే విషయమని చెప్పాలి.

ఈ సందర్భంగా ముంబై సాంప్రదాయ వంటకాలను ఆమె దగ్గరుండి మరీ ఆయనకు రుచి చూపించారు. ఈ మేరకు ముంబైలో ఉన్న ఒక రెస్టారెంట్లో టిమ్ కుక్‌కు విందు ఏర్పాటు చేశారు మాధురీ దీక్షిత్. అంతేకాదు ముంబైలో ఫేమస్ ఫుడ్ అయిన వడాపావ్ గురించి మాధురీ ఆయనకు వివరించడంతో.. ఆయన దీని రుచికి మంత్రముగ్ధులయ్యారు. మాధురీ, టిమ్ కుక్ రెస్టారెంట్‌లో వడాపావ్ తింటున్న ఫోటోలను మాధురీ దీక్షిత్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ..  “ముంబైలో వడా పావ్‌కి మించిన వెల్కమ్ ఇంకొకటి ఉండదు” అంటూ ట్యాగ్ లైన్ కూడా రాసుకుంది.

ఇకపోతే మాధురి దీక్షిత్ పోస్టును టిమ్ కుక్ రీపోస్టు చేస్తూ.. “ముంబై ఫేమస్ ఫుడ్ వడాపావ్ నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు” అంటూ ఆయన రీ పోస్ట్ చేశారు. అంతేకాదు వడాపావ్ చాలా రుచిగా ఉంది అంటూ కూడా ఆయన తెలిపారు.ఇకపోతే యాపిల్ కంపెనీ భారత దేశంలో గత 25 సంవత్సరాలుగా తమ ఉత్పత్తులను విక్రయిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తమ మార్కెట్‌ను ఇండియాలో కూడా విస్తృతం చేయడానికి సన్న హాలు చేస్తోంది.  అందులో భాగంగానే భారత్ లో రెండు యాపిల్ రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభిస్తోంది. ఈ స్టోర్‌లను ప్రారంభించిన అనంతరం టిమ్.. బుధవారం నరేంద్ర మోదీ, ఐటీ శాఖ మంత్రులను కలిసి చర్చలు చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా లోకల్ ఆర్టిస్టులు,  ఇన్నోవేటర్స్ వంటి వాటిని హైలెట్ చేస్తూ ఈ కంపెనీ ప్రత్యేకంగా “టుడే ఎట్ యాపిల్” వర్క్ షాప్  నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.