అజిత్ కుమార్ లైకా ప్రొడ‌క్ష‌న్స్ మ‌ధ్య వార్..!

అజిత్ కుమార్ విధముయార్చి సినిమా నుంచి లైకా ప్రొడక్షన్స్ తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ అలాగే అజిత్ కుమార్ మధ్య కొన్ని విషయాలు కారణంగానే ఈ సినిమా నుంచి లైకా ప్రొడక్షన్స్ తప్పుకున్నట్లు ఊహాగానాలు వెలవడుతున్నాయి.  కారణాలు ఇవే అయ్యి ఉండొచ్చు..:  అజిత్ కుమార్ సైన్ చేసిన తదుపరిచిత్రం విదాముయార్చి. తూనీవు సినిమా సక్సెస్ అనంతరం మాగిజ్ తిరుమేని విధముయార్చి అనే చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇప్పటికీ కూడా ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ […]

Share:

అజిత్ కుమార్ విధముయార్చి సినిమా నుంచి లైకా ప్రొడక్షన్స్ తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ అలాగే అజిత్ కుమార్ మధ్య కొన్ని విషయాలు కారణంగానే ఈ సినిమా నుంచి లైకా ప్రొడక్షన్స్ తప్పుకున్నట్లు ఊహాగానాలు వెలవడుతున్నాయి. 

కారణాలు ఇవే అయ్యి ఉండొచ్చు..: 

అజిత్ కుమార్ సైన్ చేసిన తదుపరిచిత్రం విదాముయార్చి. తూనీవు సినిమా సక్సెస్ అనంతరం మాగిజ్ తిరుమేని విధముయార్చి అనే చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇప్పటికీ కూడా ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా, అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి షూటింగ్ విషయాలు బయటకి రాకపోవడం కారణంగా, మరికొన్ని వార్తలు బయట వినిపిస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ అంతేకాకుండా సినిమాలో హీరోగా నటించనున్న అజిత్ కుమార్ మధ్య ఏదో విషయం జరిగినట్లు పుకార్ల షికార్లు చేస్తున్నాయి.

 వచ్చిన వార్తల ప్రకారం , లైకా ప్రొడక్షన్స్ అజిత్ కుమార్ మధ్య కొన్ని విషయాల్లో జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా అజిత్ కుమార్ ప్రస్తుత చిత్రం నుంచి ప్రొడక్షన్ హౌస్ తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా షూటింగ్ షెడ్యూల్ విషయంలో ఆలస్యం కారణంగా లైకా ప్రొడక్షన్ హౌస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే వచ్చే నెలలలో, సినిమా షూటింగ్ ఒకవేళ ప్రారంభం అవ్వకపోతే గనక కచ్చితంగా లైకా ప్రొడక్షన్ హౌస్ సినిమా విషయాల నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ అజిత్ కుమార్ కాంబోలో మునపటి చిత్రం తునివు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే.

ఇంతకుముందు లైకా ప్రొడక్షన్ హౌస్, అజిత్ కుమార్ నటించనున్న విధముయార్చి చిత్రంకు గాను డైరెక్షన్ చేయబోతే విగ్నేష్ శివన్ అని ప్రకటించడం జరిగింది. కాకపోతే, స్క్రిప్ట్ అదే విధంగా స్టోరీ లైన్ అనేది ప్రొడ్యూసర్స్ ని ఆకట్టుకోకపోవడం వల్ల, విగ్నేష్ శివన్ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. తరువాత ఈ చిత్రం తీసేందుకు గాను డైరెక్టర్గా మగ్గిజ్ తిరుమేని రంగంలోకి దిగారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. విధముయార్చి సినిమాలో ముఖ్యపాత్ర అయిన హీరోయిన్ పాత్ర పోషించునున్నారు త్రిష. త్రిష-అజిత్ కుమార్ కలిసి ఇప్పటికీ నాలుగు సినిమాలలో వరుసగా హీరో హీరోయిన్లుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జి, కిరీడం, మన్ కదా, ఎన్నై అరిందల్ సినిమాలో త్రిష అజిత్ కుమార్ హీరో హీరోయిన్లుగా నటించిన ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. విధముయార్చి  సినిమాలో కూడా అజిత్ కుమార్ పక్కన త్రిష హీరోయిన్గా నటించడంతో ఈ సినిమా వారి కాంబోలో వచ్చే ఐదు సినిమాగా మారనుంది.

అజిత్ కుమార్ గురించి మరింత:

హీరో అజిత్ కుమార్ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో సూపరిచితులు. అంతేకాకుండా ఆయన ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ అదే విధంగా ప్రతి విషయం లోని ప్రత్యేకతను కోరుకునే వ్యక్తిత్వం ఉన్న మనిషి. ప్రస్తుతం హీరో అజిత్, కొన్ని నెలలుగా వర్డ్ టూర్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అజిత్ తన షూటింగ్ సమయాలలో తప్పిస్తే, మిగిలిన సమయం అంతా కూడా ప్రపంచ పర్యటనలోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు. టూర్ లో భాగంగా ఆయన ప్రస్తుతం యూరప్ లో బైక్ టూర్ లో ఉన్నట్లు తీసుకున్న ఫోటోలు, అజిత్ భార్య షాలిని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తర్వాత వైరల్ గా మారాయి.