ప్రభాస్ – లోకేష్ కనకరాజు కాంబోలో రాబోతున్న చిత్రం 

ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నవేళ మరొక సినిమా అప్డేట్ వచ్చిందని చెప్పుకోవాలి. లియో సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజు లియో సినిమా అనంతరం, హీరో ప్రభాస్ తో మరొక చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. రండి.  కన్ఫామ్ చేసిన లియో సినిమా డైరెక్టర్:  లియో కోసం సిద్ధమవుతున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో కలిసి ఒక సినిమా కోసం పనిచేసే అవకాశం ఉందని చెప్పారు. లోకేష్, ప్రభాస్ […]

Share:

ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నవేళ మరొక సినిమా అప్డేట్ వచ్చిందని చెప్పుకోవాలి. లియో సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజు లియో సినిమా అనంతరం, హీరో ప్రభాస్ తో మరొక చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. రండి. 

కన్ఫామ్ చేసిన లియో సినిమా డైరెక్టర్: 

లియో కోసం సిద్ధమవుతున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో కలిసి ఒక సినిమా కోసం పనిచేసే అవకాశం ఉందని చెప్పారు. లోకేష్, ప్రభాస్ కలిసి ఒక ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేయడం నిజంగా ప్రతి విషయమే. లోకేశ్ మేకింగ్ స్టైల్, అదే విధంగా ప్రభాస్ వైవిధ్యమైన నటన రెండింటి కాంబోలో రాబోతున్న చిత్రం గురించి అభిమానులు తప్పకుండా ఆత్రుతగా వెయిట్ చేస్తూ ఉంటారు.

లోకేశ్ కనగరాజ్ 2021లో గలాట్టా సినిమాకుగాను ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను మొత్తం 10 సినిమాలు మాత్రమే చేస్తానని లోకేష్ ప్రకటించడం విచారకరమైన వార్తగా అభిమానులకు అనిపించింది. అయితే తాను ప్రభాస్ తో కలిసి తీయబోతున్న చిత్రం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే తాను సూర్యతో కూడా సినిమా తీసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. తలైవర్ 171 అనే పేరుతో లోకేష్ కనగరాజ్- రజినీకాంత్ కొంగులో వస్తున్న మరొక చిత్రం. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, లోకేష్ కార్తీ సినిమా కైతి 2 మరియు కమల్ హాసన్ సినిమా విక్రమ్ 2 లో పని చేయబోతున్నారు. 

లియో సినిమా విశేషాలు: 

జూన్ 22న విజయ్ తన 49వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా లియో ఫస్ట్  లుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్ కి విజయ్ ఫ్యాన్స్ దగ్గర్నుండి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. నిన్న అర్ధరాత్రి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే ఫాన్స్ సర్ప్రైజ్ అయ్యారు. ఈ ఫస్ట్ లుక్ లో విజయ్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. చేతిలో సుత్తితో ఎవర్నో కొడుతున్నట్టు ఉన్న ఈ పోస్టర్ ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచింది.  ఇందులో హీరోయిన్ త్రిష తో విజయ్ ది హిట్ పెయిర్. గతంలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన గిల్లీ బ్లాక్ బస్టర్ హిట్. వీళ్ళిద్దరు మరోసారి కలిసి నటిస్తుండడంతో లియో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

ముఖ్యంగా లియో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ప్రతి ఒక్కరిని తప్పకుండా అలరిస్తుందని త్రిష ఆశాభావం వ్యక్తం చేసింది. సినిమా గురించి ప్రత్యేకించి ఎక్కువగా చెప్పకపోయినప్పటికీ, సినిమాలో విజయ్ పక్కన తన కెమిస్ట్రీ ఎప్పటిలాగే బాగుంటుందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా త్రిష, ప్రియ ఆనంద్ నటిస్తున్నారు. ప్రియ ఆనంద్ ముందుగా తెలుగులో లీడర్ సినిమా తో తన సినీ జీవితం ప్రారంభించింది.

 తర్వాత శర్వానంద్ తో కలిసి కో అంటే కోటి అనే సినిమాలో నటించింది. తెలుగులో కలిసిరాక ప్రియా ఆనంద్ తమిళ్ లో సినిమాలు చేయడం మొదలుపెట్టింది. తమిళ్ లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే తన మొదటి సినిమా సందీప్ కిషన్ తో చేసిన నగరం. తను తర్వాత ఖైదీ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించాడు. లోకనాయకుడు కమల్ హాసన్ గారితో తను చేసిన విక్రమ్ బ్లాక్ బస్టర్. లోకివర్స్ అనే అనే సినిమాటిక్ యూనివర్స్ ని లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేశాడు. తను ఇంతకుముందు తలపతి విజయ్ తో మాస్టర్ అనే సినిమా తీశాడు. అది బ్లాక్ బస్టర్.