Leo: లియో ట్రైలర్ చివరి సీన్ గురించి మాట్లాడిన లోకేష్

తలపతి విజయ్(thalapathy vijay) లియో సినిమా అక్టోబర్ లో అందరి ముందుకు రాబోతోంది. సినిమా గురించిన ట్రైలర్ ఇప్పటికే విడుదల అవ్వడంతో ప్రేక్షకుల ఆదరాభిమానులను దక్కించుకుంది. అంతేకాకుండా తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవల ట్విట్టర్ లో లియో సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజు(lokesh kanagaraj)కు రాపిడ్ ఫెయిర్ ద్వారా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది.  లియో ట్రైలర్ చివరి సీన్ గురించి మాట్లాడిన లోకేష్:  ట్విట్టర్ వేదికగా లియో(leo) […]

Share:

తలపతి విజయ్(thalapathy vijay) లియో సినిమా అక్టోబర్ లో అందరి ముందుకు రాబోతోంది. సినిమా గురించిన ట్రైలర్ ఇప్పటికే విడుదల అవ్వడంతో ప్రేక్షకుల ఆదరాభిమానులను దక్కించుకుంది. అంతేకాకుండా తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవల ట్విట్టర్ లో లియో సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజు(lokesh kanagaraj)కు రాపిడ్ ఫెయిర్ ద్వారా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. 

లియో ట్రైలర్ చివరి సీన్ గురించి మాట్లాడిన లోకేష్: 

ట్విట్టర్ వేదికగా లియో(leo) సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజు(lokesh kanagaraj)కు కొన్ని సరదా ప్రశ్నలు అడగడం జరిగింది. ఇందులో భాగంగా తనకు ట్రైలర్ చివరిలో కనిపించిన రివాల్వర్ స్లీవ్ రోల్ గురించి అడిగినప్పుడు, ఇది ఒక రష్యన్ స్టైల్ అని ఇంగ్లీష్ సినిమాలలో చాలావరకు ఈ స్టైల్ ఉపయోగించారని లోకేష్ కనగరాజు (lokesh kanagaraj) సమాధానం ఇవ్వడం జరిగింది. 

లియోలో తలపతి విజయ్ డబల్ యాక్షన్: 

ప్రముఖ నటుడు తలపతి విజయ్(thalapathy vijay), లియోలో కుటుంబ వ్యక్తి పార్థిబన్‌గా, అంతే కాకుండా భయంకరమైన గ్యాంగ్‌స్టర్ లియో దాస్‌గా రెండు పాత్రలలో లియో(leo) సినిమా ట్రైలర్ లో కనిపిస్తున్నాడు. అయితే ఇవి రెండు భిన్నమైన పాత్రలా లేక ఒకే పాత్రలో రెండు దశలా అనే విషయాన్ని లియో(leo) ట్రైలర్‌లో వెల్లడించలేదు. పార్థిబన్‌ను కుడిచేతి వాటంగా చూపించగా, లియో దాస్ ఎడమచేతి వాటం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఈ విషయాల మీద ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. 

Read More: Thalapathy Vijay: 15 ఏళ్ల తర్వాత విజ‌య్ త్రిష‌ సినిమా

లియో సినిమా గురించి మరింత: 

లోకేష్ కనకరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో తలపతి విజయ్ (thalapathy vijay) నటిస్తున్న లియో (leo)సినిమా గురించి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడం జరిగింది. అంతే కాకుండా కొన్ని లిరికల్ వీడియో సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. లియో(leo) చిత్రంలో త్రిష, (trisha) ప్రియా ఆనంద్, యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా నటిస్తున్నారు.  లియోని సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు, దీనికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే 15 సంవత్సరాల తర్వాత త్రిష మళ్లీ విజయ్  జతకట్టారు. 

ఇక త్రిష విషయానికొస్తే మనకు తెలిసిందే, తను వర్షం సినిమాతో టాలీవుడ్ కుర్ర కారు మనసు దోచుకుంది. తర్వాత అతడు సినిమాతో మహేష్ బాబు తో కూడా నటించింది. త్రిష టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అయింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో త్రిష యాక్టింగ్ కి మంచి క్రేజ్ వచ్చింది. త్రిష నాగార్జునతో కింగ్. రవితేజతో కృష్ణ లాంటి సినిమాలో నటించింది. చిరంజీవితో స్టాలిన్ లో కూడా నటించింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగు సినిమాలు నటించట్లేదు. అయినా ఇప్పటికీ తెలుగులో త్రిష కు మంచి క్రేజ్ ఉంది. తను సినిమా చేస్తానంటే నిర్మాతలు రెడీగా ఉన్నారు. తన సినీ కెరీర్లో చిన్నచిన్న వివాదాలు ఉన్నప్పటికీ త్రిష తన కెరీర్ లో ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది. 

ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే తన మొదటి సినిమా సందీప్ కిషన్ తో చేసిన నగరం. తను తర్వాత ఖైదీ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించాడు. లోకనాయకుడు కమల్ హాసన్ గారితో తను చేసిన విక్రమ్ బ్లాక్ బస్టర్. లోకివర్స్ అనే అనే సినిమాటిక్ యూనివర్స్ ని లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) క్రియేట్ చేశాడు. తను ఇంతకుముందు తలపతి విజయ్ తో మాస్టర్ అనే సినిమా తీశాడు. అది బ్లాక్ బస్టర్.