ఓటీటీలోకి లావ‌ణ్యా త్రిపాఠి

ఇప్పటి వ‌ర‌కు హీరోయిన్‌గా మెప్పించిన లావ‌ణ్యా త్రిపాఠి త్వ‌ర‌లోనే ఓటీటీలో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి రెడీ అయ్యింది.  లావణ్యా త్రిపాఠి న‌టించిన తొలి ఒరిజిన‌ల్ ‘పులి మేక’. లావణ్యా త్రిపాఠి తొలిసారిగా పోలీస్ అధికారి కిరణ్ పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఇదే.  కాగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ ఒరిజిన‌ల్.. ఆడియన్స్‌ను అల‌రించ‌నుంది. జీ 5, కోన ఫిల్మ్స్ కార్పొరేష‌న్ కాంబోలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. లావణ్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ వెబ్ సిరీస్‌లో ఆది […]

Share:

ఇప్పటి వ‌ర‌కు హీరోయిన్‌గా మెప్పించిన లావ‌ణ్యా త్రిపాఠి త్వ‌ర‌లోనే ఓటీటీలో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి రెడీ అయ్యింది. 

లావణ్యా త్రిపాఠి న‌టించిన తొలి ఒరిజిన‌ల్ ‘పులి మేక’. లావణ్యా త్రిపాఠి తొలిసారిగా పోలీస్ అధికారి కిరణ్ పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఇదే.  కాగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ ఒరిజిన‌ల్.. ఆడియన్స్‌ను అల‌రించ‌నుంది. జీ 5, కోన ఫిల్మ్స్ కార్పొరేష‌న్ కాంబోలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. లావణ్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ వెబ్ సిరీస్‌లో ఆది సాయికుమార్‌, సిరి హ‌న్మంత్, రాజా చెంబోలు మొదలైనవారు ఇత‌ర ప్ర‌ధాన పాత్రల్లో న‌టించారు. ఇందులో ఆది సాయి కుమార్ ఫోరెన్సిక్ అధికారిగా కీలక పాత్ర పోషించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పులి – మేక’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. కొన్నాళ్ల నుంచి లావణ్య త్రిపాఠికి సరైన హిట్ లేదు. దీంతో ఆమె మూవీలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. అందాల రాక్షసి టైమ్​లో స్టార్ హీరోయిన్​గా వెలుగు వెలిగిన ఈ అమ్మడు ప్రస్తుతం ఎటువంటి స్టార్ డమ్ లేకుండా మూవీలు చేస్తోంది. తనతో ఎంట్రీ ఇచ్చిన వారు మాత్రమే కాకుండా తన తర్వాత ఎంట్రీ ఇచ్చిన వారు కూడా స్టార్ హీరోయిన్​లుగా చలామణి అవుతున్నా అమ్మడుకు ఎందుకో సరిగ్గా లక్ కలిసి రాలేదు. దాంతో స్టార్ డమ్​కు అల్లంత దూరానే ఉండిపోయింది. ఇక ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన ఆది సాయికుమార్​కు కూడా కొన్ని రోజులుగా సరైన హిట్ లేదు. దీంతో వీరి కాంబోలో వచ్చిన పులిమేక సిరీస్ ఎంత వరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. 

రాత్రి పది పదకొండు గంటల ప్రాంతంలో ఓ హత్య జరుగుతుంది. ఒక భయంకరమైన మనిషి నడుచుకుంటూ వచ్చి చంపేశాడు. ఆ కేసును ఫిమేల్ పోలీస్ ఆఫీసర్ కిరణ్ ఎలా ఛేదించింది.. ఇదండీ, ‘పులి – మేక’ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్ .

హత్య చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి కిరణ్‌‌ (లావణ్యా త్రిపాఠి)కి పైఅధికారి 72 గంటలు టైమ్ ఇస్తాడు. ఈలోపు ఆమె పట్టుకోగలిగిందా, లేదా? అదే మనిషి మరో హత్య చేశాడని ఆది సాయి కుమార్ డైలాగ్స్ బట్టి తెలుస్తుంది. అసలు హంతకుడు ఎవరు? ఇవన్నీ సిరీస్ చూస్తే తెలుస్తుంది. ఒక సీరియల్ కిల్లర్ ఒకరి తర్వాత మరొకరుగా పోలీస్ శాఖలోని వారినే టార్గెట్ చేస్తూ, చంపేస్తుంటాడు. అతడిని ఎవరు, ఎలా పట్టుకున్నారు? అనేది కథ. 

‘మీకు పెళ్ళైందా మేడమ్?’ అని ఆది సాయి కుమార్ అడగటం, ‘ఆర్ యు సీరియస్?’ అని లావణ్యా త్రిపాఠి అని సమాధానం ఇవ్వడం చూస్తే, ఈ సిరీస్‌‌లో ఈ ఇద్దరి మధ్య ఏమైనా ప్రేమాయణం ఉందేమో అనిపిస్తోంది. లావణ్యా త్రిపాఠి పోలీసు యూనిఫామ్‌లో బాగానే ఉంది. సిరీస్ చూస్తే ఎలా చేసిందో తెలుస్తుంది.

ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో పోలీసు శాఖతో బాటు, జ్యోతిష్యం కూడా ఒక భాగం. ‘పులి – మేక’ను ఉత్కంఠగా ఉండేలా రూపొందించినట్లే అనిపిస్తోంది. ఇది ఈ నెల 24 నుంచి జీ 5లో రాబోతోంది.