పోలీస్ క్యారెక్టర్ లో కనిపించనున్న మంచు లక్ష్మి

ప్రఖ్యాత నటి, నిర్మాత, తెలుగులో ప్రఖ్యాత గాంచిన నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి రాబోయే చిత్రం అగ్నినక్షత్రం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రమోషనల్ సాంగ్ తెలుసా తెలుసా అనే పాటను విడుదల అవ్వడమే కాకుండా, ప్రస్తుతం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఈ ఆహ్లాదకరమైన పాట, మంచు లక్ష్మిలో ఉండే బహుముఖ ప్రతిభను హైలైట్ చేయడమే కాకుండా, ప్రఖ్యాత బాలీవుడ్ చిత్రనిర్మాత రోహిత్ శెట్టి తెరకెక్కించిన మరెన్నో ఆకర్షణీయమైన పోలీసు ఓరియంటెడ్ సినిమాల నుండి కూడా […]

Share:

ప్రఖ్యాత నటి, నిర్మాత, తెలుగులో ప్రఖ్యాత గాంచిన నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి రాబోయే చిత్రం అగ్నినక్షత్రం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రమోషనల్ సాంగ్ తెలుసా తెలుసా అనే పాటను విడుదల అవ్వడమే కాకుండా, ప్రస్తుతం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఈ ఆహ్లాదకరమైన పాట, మంచు లక్ష్మిలో ఉండే బహుముఖ ప్రతిభను హైలైట్ చేయడమే కాకుండా, ప్రఖ్యాత బాలీవుడ్ చిత్రనిర్మాత రోహిత్ శెట్టి తెరకెక్కించిన మరెన్నో ఆకర్షణీయమైన పోలీసు ఓరియంటెడ్ సినిమాల నుండి కూడా ఇన్స్పైర్ అయ్యాను అంటుంది మంచు లక్ష్మీ. 

అతనికి పెద్ద ఫ్యాన్: 

మంచు లక్ష్మి నిజానికి, రోహిత్ శెట్టి లార్జర్-దాన్-లైఫ్ సినిమాటిక్ అప్రోచ్కి ఒక పెద్ద అభిమాని అంటోంది. కథాంశాన్ని వాస్తవికతలో చూపించే విధంగా, తన స్వంత ప్రాజెక్ట్‌లో ఇలాంటి గొప్పతనాన్ని, రోహిత్ శెట్టి సినిమాటిక్ వేలో చూపించాలని, లక్ష్యంగా పెట్టుకున్నా అని చెప్పింది మంచు లక్ష్మి.

తన ఉత్సాహాన్ని పంచుకుంటూ, రోహిత్ శెట్టి తెరకెక్కించే అద్భుతమైన పోలీసు చిత్రాలకు నేను ఫిదా అయిపోయానని.. నిజానికి వాస్తవానికి దగ్గరగా ఉండే పోలీస్ క్యారెక్టర్, నిజంగా జరుగుతున్నది అనే భావన తనకు చాలా బాగా నచ్చుతుంది అంటుంది లక్ష్మి. తాను పోలీసాఫీసర్‌గా నటిస్తున్న అగ్నినక్షత్రంలో కథలోని సారాంశంతో పాటుగా, నిజంగా జరుగుతున్న భావన కలిగించేలా చూప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను అని చెప్పింది. ‘తెలుసా తెలుసా’ పాట రోహిత్ శెట్టి చిత్ర నిర్మాణ శైలికి ప్రతిభందించేలా ఉంటుందని, ఇందులో ముఖ్యంగా 80 కోట్ల విలువైన కార్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయని.. ఇది మన కళ్ల ముందు జరుగుతున్న భావాన్ని వెదజల్లుతుందని, ముఖ్యంగా మహిళల్లో ఉండే ధైర్య ప్రదర్శనలు కళ్ళకి ఆకట్టుకుంటాయని చెప్పింది మంచు లక్ష్మి. 

పోలీసులే నా ప్రేరణ: 

లక్ష్మి హైదరాబాద్‌లోని స్వాతి లక్రా, అంజలి కుమార్ మరియు స్టీఫెన్ రవీంద్ర మరియు సివి అనంగ్ గార్గ్ వంటి అధికారుల నుండి అద్భుతమైన పోలీసు అధికారుల నుండి అదేవిధంగా షీ టీమ్ అధికారుల నుండి ప్రేరణ పొందింది. ఆమె తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, హైదరాబాద్‌లో కొంతమంది చాలా ధైర్య సాహసాలతో కూడినపోలీసు అధికారులు ఉన్నారని, వారి అంకితభావానికి నేను ఆకర్షితురాలినయ్యానని. అదేవిధంగా తాను సినిమాలో పోషిస్తున్న పాత్రకు వీలైనంత వాస్తవికంగా ఉండాలని మరియు పాత్రకు నా వ్యక్తిగత టచ్ తీసుకురావాలని నేను కోరుకున్నానని చెప్పింది మంచు.

నటిగా మరియు నిర్మాతగా తన బాధ్యత గురించి మాట్లాడుతూ, లక్ష్మి క్రమశిక్షణతో కూడిన దినచర్యను శ్రద్ధగా అనుసరించింది. సమతుల్య విధానాన్ని కొనసాగించాలని డిసైడ్ అయ్యి ఆమె, అష్టాంగ యోగ సాధనలో నిమగ్నమవ్వడానికి, ముఖ్యంగా ఆమె శ్రద్ధగా ఉదయం 5 గంటలకు నిద్ర లేచింది, నిర్మాతగా ఆమె మనస్సు మరియు శరీరం రాబోయే రోజు కోసం సిద్ధంగా ఉండేలా చూసుకుంది. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన యోగా టీచర్ పట్ల లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె యోగ గురించి మాట్లాడుతూ, యోగా నాకు ప్రశాంతమైన నిర్మాతగా అదేవిధంగా సోమరితనంగా ఉండకుండా సహాయపడిందని.. యోగాతో పాటు, ఒక పోలీసు పాత్రను పోషించడానికి కావలసిన శారీరకతను సాధించడానికి ఆమె తన పోస్ట్-షూట్ రొటీన్‌లో వెయిట్ మేనేజ్మెంట్ శిక్షణ మరియు కిక్‌బాక్సింగ్‌ను కూడా నేర్చుకున్నట్లు తెలిపింది. 

పాట గురించి మరింత:

లక్ష్మి స్నేహితురాలు, అత్యంత ప్రతిభావంతులైన రచయిత్రి దీప్తి రెడ్డి ఈ పాటకు రాప్ సాహిత్యాన్ని రూపొందించారు. దీప్తి నైపుణ్యానికి మార్గనిర్దేశం చేసిన లక్ష్మి మంచు సాహిత్యాన్ని ఉత్సాహంగా రాప్ చేసింది. ప్రముఖ గాయకులు సునీత సారథి, శిరీష మరియు అదితి భావరాజులు పాటను ఆలపించారు. ప్రముఖ కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. అగ్నినక్షత్రం చిత్రానికి వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహించారు.