మరో సారి ట్రోలింగ్.. స్పందించిన లక్ష్మి మంచు 

తాజాగా సైమా వేడుకల్లో పాల్గొన్న మంచు లక్ష్మి వేదిక బయట మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కెమెరాకి అడ్డు వచ్చాడని అతడి పై చేయి చేసుకుంది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయంపై లక్ష్మి మంచు స్పందించారు. అయితే తాజాగా మంచు లక్ష్మికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ గా మారింది. అందుకు కారణం ఆ వీడియోలో మంచి లక్ష్మి ఓ వ్యక్తి మీద చేయి చేసుకోవడమే. ఇంతకీ మేటర్ ఏంటంటే.. […]

Share:

తాజాగా సైమా వేడుకల్లో పాల్గొన్న మంచు లక్ష్మి వేదిక బయట మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కెమెరాకి అడ్డు వచ్చాడని అతడి పై చేయి చేసుకుంది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయంపై లక్ష్మి మంచు స్పందించారు.

అయితే తాజాగా మంచు లక్ష్మికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ గా మారింది. అందుకు కారణం ఆ వీడియోలో మంచి లక్ష్మి ఓ వ్యక్తి మీద చేయి చేసుకోవడమే. ఇంతకీ మేటర్ ఏంటంటే.. కొద్ది రోజుల క్రితం దుబాయ్ వేదికగా సైమా అవార్డుల వేడుక జరిగిన విషయం తెలిసిందే కదా. దక్షిణ భారతదేశానికి చెందిన చాలామంది సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. మంచి లక్ష్మి కూడా సైమా అవార్డ్స్ ఫంక్షన్ కి హాజరయ్యారు. ఈ క్రమంలోనే వేదిక బయట మంచు లక్ష్మి మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కెమెరాకు అడ్డంగా వెళ్లడంతో కోపంగా ఆ వ్యక్తి వీపు మీద కొట్టింది. ఆ తర్వాత కెమెరా వైపు తిరిగి మాట్లాడుతుంటే మరో వ్యక్తి అడ్డు వచ్చాడు. 

దాంతో కోపంగా “డ్యూడ్ కెమెరాకు అడ్డు రాకుండా ఉండాలనేది మినిమం బేసిక్స్” అంటూ మంచు లక్ష్మి అతనిపై ఫైర్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అయితే వీరిలో చాలామంది మాత్రం మంచి లక్ష్మి ఇంత చిన్న విషయానికి అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదంటూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయంపై ఒక వ్యక్తిని కొట్టినందుకు లక్ష్మి మంచు అనే నటి సమర్థించుకుంది. తాను రెడ్ కార్పెట్‌పై ఉన్న సమయంలో ఆ వ్యక్తి తన కెమెరా ముందు నడిచాడని, తాను ఇంటర్వ్యూ మధ్యలో ఉన్నానన్న విషయాన్ని పట్టించుకోలేదని వివరించింది. ఒక నటిగా, ప్రజలు కళాకారుల స్థలాన్ని గౌరవించడం మరియు వారి పనికి అంతరాయం కలిగించడం చాలా ముఖ్యం అని లక్ష్మి మంచు తెలిపారు. ఈ మర్యాదను ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తి తనకు తగినది పొందాడని ఆమె అన్నారు. ఈ సంఘటన రికార్డ్ చేయబడిందని తాను భయపడనని, తనకు తానుగా నిలబడటం చాలా ముఖ్యం అని లక్ష్మి పేర్కొన్నారు. ఈ సన్నివేశాన్ని ఎడిట్ చేయమని యాంకర్ చెప్పగా మంచు లక్ష్మి మాత్రం అలాగే ఉండనివ్వు అంటూ చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ లో సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈమె వరుస సినిమాలు చేస్తూ మరోపక్క వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి ఆమె చేసే పోస్టులన్నీ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. అందుకు రీజన్ ఏంటో తెలియకపోయినా కొన్నిసార్లు మంచి లక్ష్మిని సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఆ ట్రోలింగ్ పట్టించుకోని మంచి లక్ష్మి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది.

ఇక మంచు లక్ష్మి విషయానికొస్తే.. ప్రస్తుతం ఈమె ప్రధాన పాత్రలో ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమా తెరకెక్కుతోంది. మంచు ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు, మంచు లక్ష్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మంచి లక్ష్మి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వంశీకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ మర్డర్ మిస్టరీగా రూపొందుతున్న ఈ సినిమాలో సముద్రఖని, విస్వంత్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.