లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార బెస్ట్ సినిమాలు ఇవే..!

ఇప్పుడున్న హీరోయిన్ల‌లో ఎవ‌రైనా లేడీ సూప‌ర్‌స్టార్ అనిపించుకున్నారు అంటే అది న‌య‌న‌తార‌. ర‌జినీకాంత్ త‌ర్వాత అంత‌టి రేంజ్‌లో హీరోయిన్ల‌లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు జ‌వాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.. షారుక్ ఖాన్ జవాన్ సినిమా ట్రైలర్ ఇప్పటికే ఉత్కంఠ భరితంగా సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తుంది. ఇందులో షారుక్ ఖాన్ అలాగే మన సౌత్ అందాల తార నయనతార హిందీలో అందరినీ అలరించడానికి వచ్చేస్తోంది. సౌత్ ఇండియా హీరోయిన్ […]

Share:

ఇప్పుడున్న హీరోయిన్ల‌లో ఎవ‌రైనా లేడీ సూప‌ర్‌స్టార్ అనిపించుకున్నారు అంటే అది న‌య‌న‌తార‌. ర‌జినీకాంత్ త‌ర్వాత అంత‌టి రేంజ్‌లో హీరోయిన్ల‌లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు జ‌వాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.. షారుక్ ఖాన్ జవాన్ సినిమా ట్రైలర్ ఇప్పటికే ఉత్కంఠ భరితంగా సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తుంది. ఇందులో షారుక్ ఖాన్ అలాగే మన సౌత్ అందాల తార నయనతార హిందీలో అందరినీ అలరించడానికి వచ్చేస్తోంది. సౌత్ ఇండియా హీరోయిన్ హిందీలో తన మొదటి సినిమా ఎలా ఉంటుందో అని, తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాని తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేశాడు. 

బాలీవుడ్ లో నయనతార డెబ్యూ:

నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. సినిమాని తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేశాడు. తను ఇంతకుముందు నయనతారతో రాజా రాణి వంటి చిత్రం చేశాడు. గత నెలలో రిలీజ్ అయిన జవాన్ సినిమా ట్రైలర్లో నయనతార లుక్ చాలా బాగుంది. అంతేకాకుండా వస్తాను ఒక పోలీస్ ఆఫీసర్ గా అదే విధంగా శారీలో కూడా షారుక్ ఖాన్ పక్కన ఆకట్టుకొనుంది. జవాన్ సినిమాతో నయనతార బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన నటిస్తుంది. ఈ సినిమాలో నయనతారే కాకుండా విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా కూడా నటిస్తున్నారు. దీపికా పదుకొనే ఇందులో గెస్ట్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ట్రైలర్ వచ్చేవారం విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి ప్రతి ఒక్కరిలో సినిమా మీద ఇంకా ఆసక్తి పెరిగేలా చేస్తుంది. జవాన్ సినిమా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. షారుక్ ఖాన్,అట్లీ దీన్ని లాంచ్ చేసిన ఈ ట్రైలర్ చూసి అందరూ షాక్ అవ్వడమే కాకుండా అందులో కనిపించిన ప్రముఖ సౌత్ ఇండియా నటీనటులు పాత్రలు ఆకట్టుకునేలా ఉంటున్నాయని అభిమానులు భావిస్తున్నారు. అయితే షారుక్ ఖాన్ ఈ సినిమాలో రెండు పాత్రలు పోషిస్తున్నాడా అనే సందేహం కూడా ఏర్పడింది.

జవాన్ నయనతారకు బ్రేక్ ఇవ్వనుందా?: 

నయనతార సుమారు 20 ఏళ్ల క్రింద సినీ రంగ ప్రవేశం చేసింది. చంద్రముఖి సినిమా తనకి మొదటగా బ్రేక్ ఇచ్చింది. తర్వాత తను తెలుగులో లక్ష్మీ తో అరంగ్రేటం  చేసింది. తర్వాత నాగార్జునతో బాస్ సినిమా నటించింది. ఆ తర్వాత కూడా నయనతార ప్రభాస్ తో యోగి, రవితేజ తో దుబాయ్ శీను వంటి సినిమాలు చేసింది. నయనతార తన పర్ఫార్మెన్స్ తో అనతి కాలంలోనే టాలీవుడ్ లో పెద్ద స్టార్ అయింది. తెలుగులో నటిస్తూనే తమిళ్ లో కూడా సినిమాలు చేసింది. ఇంకా చెప్పాలంటే ఆమె ఎక్కువగా సమాజంలో ఎక్కువగా జరిగే అంశాల దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమాలలో ముఖ్య పాత్రలలో నటించడం జరిగింది నయనతార. ఆ సినిమాలలో ముఖ్యంగా నయనతారకు మంచి పేరు తెచ్చినవి, పుతియా నియమం, అరమ్మ్, బిల్లా, నానుమ్ రౌడీ ధాన్, కొలమావు కోకిల, మాయ. ఈ సినిమాలో ఆమె ఒక డిస్టిక్ కలెక్టర్ గా సమస్యల మీద పోరాడడం, అత్యాచారానికి గురై నిందితుల్ని మట్టి కల్పించడం, లేడీ గ్యాంగ్ స్టార్ గా కనిపించడం, చెవులు వినిపించని ఒక అమ్మాయిగా నటించడం, ఇలా వైవిద్య పాత్రలలో నటించడమే కాకుండా అభిమానులను మరింత దగ్గర నయనతార. ఆ సినిమాల విజయాలతో నయనతార తమిళ్లో లేడీ సూపర్ స్టార్ అయింది. చిరంజీవితో నయనతార చేసిన సైరా తనకు మంచి విజయాన్ని అందించింది. ఇప్పటికీ నయనతార మంచి జడ్జిమెంట్ తో సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా తను విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది. నయనతార సినిమాలో ఉందంటే సినిమాలో కంటెంట్ ఉందని తమిళ ప్రేక్షకులు నమ్ముతారు. నయనతార నటించిన హిందీ సినిమా జవాన్ పెద్ద విజయం సాధించి అక్కడ కూడా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుందాం. రానున్న రోజుల్లో నయనతార బాలీవుడ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. తనకు ఇది బాగా కలిసి రావాలని కోరుకుందాం.