నా పాటలు నేను వినన్న టాప్ సింగర్ కుమార్ సానూ

21 వేలకు పైగా పాటలు పాడటం మరో ఎత్తు. కానీ.. ఇన్ని పాటలు పాడటం వెనుక ఎంతో కష్టం ఉంది. కానీ.. నేను పాడిన పాటల్లో ఇప్పటివరకు ఏ పాటను కూడా నేను స్వంతంగా వినలేదు అంటున్నారు టాప్ ప్లే బ్యాక్ సింగర్. సినీ ఇండస్ట్రీ ఎప్పుడు కత్తి మీద సాము లాంటిదే. అవకాశాల కోసం ఎంతగానో ఎదురు చూడాలి. ఒక సింగర్ గా సినిమాలో పాటలు పాడే అవకాశం రావడం చాలా అరుదు. ఆ అవకాశాన్ని […]

Share:

21 వేలకు పైగా పాటలు పాడటం మరో ఎత్తు. కానీ.. ఇన్ని పాటలు పాడటం వెనుక ఎంతో కష్టం ఉంది. కానీ.. నేను పాడిన పాటల్లో ఇప్పటివరకు ఏ పాటను కూడా నేను స్వంతంగా వినలేదు అంటున్నారు టాప్ ప్లే బ్యాక్ సింగర్.

సినీ ఇండస్ట్రీ ఎప్పుడు కత్తి మీద సాము లాంటిదే. అవకాశాల కోసం ఎంతగానో ఎదురు చూడాలి. ఒక సింగర్ గా సినిమాలో పాటలు పాడే అవకాశం రావడం చాలా అరుదు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 21 వేలకు పైగా పాటలు పాడటం మరో ఎత్తు. కానీ.. నేను ఇన్ని పాటలు పాడటం వెనుక ఎంతో కష్టం ఉంది. ఇక నేను పాడిన పాటల్లో ఇప్పటివరకు ఏ పాటను కూడా నేను స్వంతంగా వినలేదు అంటున్నారు టాప్ ప్లే బ్యాక్ సింగర్ కుమార్ సానూ. ఇటీవల కుమార్ సాను చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ కుమార్ సాను ఎందుకు తన పాటలను వినడో ఇప్పుడు తెలుసుకుందాం.

వరుసగా 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు

కుమార్ సానూ గా ప్రసిద్ధికెక్కిన కేదార్ నాథ్ భట్టాచార్జీ 1990 నుంచి 1995 వరకు వరుసగా 5 సంవత్సరాలు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్న  ప్రముఖ భారతీయ గాయకుడు. ఈయన కలకత్తాలో 1957 సెప్టెంబరు 23న జన్మించారు. 2009లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. కుమార్ సాను 90S మెలోడీ కింగ్ గా అభివర్ణిస్తారు. కుమార్ సాను బెంగాలీ, హిందీ, అస్సామీ, మరాఠీ, భోజ్ పూరి, నేపాలి, మణిపురి, మలయాళం, ఇంగ్లీష్ భాషలలో 21 వేలకు పైగా పాటలు పాడారు. పలు చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. 

నా పాటలు నేను వినను

ఇటీవల కుమార్ సానూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఆ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీరు పాడిన పాటలను మీరు వింటారా అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ప్రశ్నించగా.. లేదు నేను పాడిన పాటలు మళ్లీ సొంతంగా నేనైతే వినను. నా కూతురు నేను పాడిన పాటలను పెట్టి వినిపిస్తే మాత్రం ఖచ్చితంగా వింటాను. నా అంతట నేను ఆ పాటను వింటే పాటలో ఏదైనా తప్పుగా అనిపిస్తే.. నా మనసు ప్రశాంతంగా ఉండలేదు. ఏదో తప్పు చేశాననే భావన నన్ను వెంటాడుతుందని నేను భావిస్తాను. అందుకే నా పాటలను వినాలంటే నాకు కాస్త భయం. అందుకే మరోసారి విని ఆ పాటలను పున:సమీక్షించాలని అనుకోను. ఎవరైనా నా పాటలను పెడితే తప్పకుండా వింటాను. ఇప్పటివరకు నేను పాడిన పాటలు మూడు దశాబ్దాలకు పైగా ప్రజలు వింటున్నారు. అంతకు మించి పెద్ద గుర్తింపు నాకు ఇంకేముంది అని కుమార్ సానూ అన్నారు. 

కుమార్ సానూ పేరు ఎవరు పెట్టారు..?

నా అసలు పేరు కేదార్నాథ్ భట్టాచారి. నాకు సంగీతం మీద చాలా మక్కువ. అందుకోసం గాయకుడిగా అవకాశాలు రావడం కోసం పలు షోలలో, రెస్టారెంట్లలో ప్రదర్శనలు ఇచ్చాను. నా గాత్ర శైలి లో కిషోర్ కుమార్ ను అనుకరించే వాడినని తెలిపారు. 1984లో పాటలు పాడడం మొదలుపెట్టిన నాకు.. ఆషికి హిందీ చిత్రం 1990 ద్వారా మంచి గుర్తింపు లభించింది. 

సంగీత దర్శక ద్వయం కల్యాంజీ – అనండ్జీ నా పేరును మార్చాలని నిర్ణయించుకున్నాడు. అతను, “ కాలియన్ జి, ఆనంద్ జీ బెంగాలీ గాయకులు హిందీ, ఉర్దూ సాహిత్యాన్ని నేను పాడలేరని నమ్మాడు. కానీ.. వారు నాకు చెప్పారు.. మీరు ఉర్దూలో చాలా నిష్ణాతులు అని, కానీ.. ఈ ఇంటిపేరు భట్టాచారి మీకు బెంగాలీ అనే లేబుల్ ను ఇస్తుంది. అందుకే వారు నాకు కుమార్ సాను అని పేరు పెట్టారు అని ఆయన తెలిపారు.