కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన కృతి సనన్

మంగళవారం కృతి సనన్ తన కొత్త ప్రొడక్షన్ హౌస్ బ్లూ బటర్ఫ్లై ఫిలిమ్స్ ని ప్రారంభిస్తున్నట్టు చెప్పింది. ఈ బ్యానర్ పై హార్ట్ టచ్చింగ్ సినిమాలను నిర్మిస్తానని తను స్వయంగా తెలియజేసింది.  ఇన్స్టాగ్రామ్ లో బ్యానర్ గురించి చెప్పిన కృతి సనన్: పది సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కథానాయికగా వెలుగొందుతున్న కృతి సనన్ తన కొత్త ప్రొడక్షన్ హౌస్ గురించి మంగళవారం ఇన్స్టాగ్రామ్ లో తెలియజేసింది. ఈ ప్రొడక్షన్ హౌస్ లో తను మంచి మంచి కాన్సెప్ట్ లను […]

Share:

మంగళవారం కృతి సనన్ తన కొత్త ప్రొడక్షన్ హౌస్ బ్లూ బటర్ఫ్లై ఫిలిమ్స్ ని ప్రారంభిస్తున్నట్టు చెప్పింది. ఈ బ్యానర్ పై హార్ట్ టచ్చింగ్ సినిమాలను నిర్మిస్తానని తను స్వయంగా తెలియజేసింది. 

ఇన్స్టాగ్రామ్ లో బ్యానర్ గురించి చెప్పిన కృతి సనన్:

పది సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కథానాయికగా వెలుగొందుతున్న కృతి సనన్ తన కొత్త ప్రొడక్షన్ హౌస్ గురించి మంగళవారం ఇన్స్టాగ్రామ్ లో తెలియజేసింది. ఈ ప్రొడక్షన్ హౌస్ లో తను మంచి మంచి కాన్సెప్ట్ లను ప్రొడ్యూస్ చేస్తానని తెలియజేసింది. ఇండస్ట్రీకి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా తాను ప్రొడక్షన్ హౌస్ ని ఏర్పాటు చేస్తున్నానని తెలియజేసింది. సినిమా ఇండస్ట్రీలో తాను చాలా విషయాలు నేర్చుకున్నాకే ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేస్తున్నాను అని తెలియజేసింది ఈ హీరోయిన్. 

ఇంకా దీన్ని పక్కన పెడితే కృతి సనన్ కొత్తగా రెండు సినిమాల్లో నటిస్తుంది. గన్ పత్ అనే సినిమాలో టైగర్ ష్రాఫ్ కి జోడిగా నటిస్తుంది. మరొక సినిమాలో షాహిద్ కపూర్ తో కలిసి నటిస్తుంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ మరో కథానాయిక, ఇందులో టబు కూడా నటిస్తుంది. కృతి సనన్ రీసెంట్ గా నటించిన ఆదిపురుష్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇందులో తను సీతగా అద్భుతంగా నటించింది.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇందులో రాముడిగా ప్రభాస్ నటించాడు. ఈ సినిమా తర్వాత కృతి సనన్ రేంజ్ మారిపోయింది. సినిమా ఫ్లాప్ అయినా కానీ కృతికి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. అందుకే తను కొత్త సినిమాలను జాగ్రత్తగా ఎంచుకుంటుంది ఈ హీరోయిన్. 

కృతి సనన్ కొత్త ప్రొడక్షన్ హౌస్:

కొత్తగా బ్లూ బటర్ఫ్లై ఫిలిమ్స్ అనే బ్యానర్ ఓపెన్ చేస్తున్నానని కృతి సనన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది. కృతి సనన్ పదేళ్ల క్రితం తెలుగులో వచ్చిన మహేష్ బాబు 1 నేనొక్కడినే అనే చిత్రంతో తన కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమా తర్వాత తను నాగచైతన్యతో కలిసి దోచెయ్ అనే సినిమాలో నటించింది ఈ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో తను బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. బాలీవుడ్ లో తను మంచి మంచి సినిమాల్లో నటించింది. 

హీరో పంతీ అనే చిత్రంతో తను బాలీవుడ్ లో  అడుగుపెట్టింది. ఇది తెలుగు సినిమా పరుగు కి రీమేక్. తర్వాత తను సుశాంత్ సింగ్ రాజ్ పుట్ తో కలిసి రాబ్తాలో నటించింది. హౌస్ ఫుల్ 4 లో కూడా నటించింది. కృతి సనన్ మంచి యాక్టర్. బాలీవుడ్ లో తను రీసెంట్ గా ఆది పురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తన రేంజ్ ని ఇంకా పెంచింది. ఇందులో హీరోగా నటించిన ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ కావడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.  ఇక ప్రభాస్ విషయానికొస్తే తన తదుపరిచిత్రం సలార్ మీద మంచి అంచనాలు ఉన్నాయి.  ప్రభాస్ మారుతి తో కలిసి చేసే రాజా డీలక్స్ అనే సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ లాంటి స్టార్ తో కలిసి నటించడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్న అని కృతి సనన్ ఈ మధ్య తానే స్వయంగా చెప్పడం విశేషం. అంతేకాదు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని కూడా చాలా రోజులు పుకార్లు షికార్లు చేశాయి. అయితే అదేమీ లేదని కృతి ఈమధ్య వెల్లదించి ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది.