అల్లు అర్జున్, కృతి స‌న‌న్‌.. క‌లిసి న‌టించ‌బోతున్నారా

టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మికల కాంబోలో వచ్చిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క సీన్ అని కాకుండా అన్ని రకాల సీన్లు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇక ఈ మూవీలోని తగ్గేదేలే అనే డైలాగ్ మాత్రం ఒక రేంజ్ లో పేలింది. దీంతో చాలా మంది సెలబ్రేటీలతో పాటు సామాన్యులు కూడా ఈ డైలాగ్ తో రీల్స్ […]

Share:

టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మికల కాంబోలో వచ్చిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క సీన్ అని కాకుండా అన్ని రకాల సీన్లు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇక ఈ మూవీలోని తగ్గేదేలే అనే డైలాగ్ మాత్రం ఒక రేంజ్ లో పేలింది. దీంతో చాలా మంది సెలబ్రేటీలతో పాటు సామాన్యులు కూడా ఈ డైలాగ్ తో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఈ మూవీ రిలీజ్ అయి ఏడాది పైనే అవుతున్నా కానీ ఈ మూవీకి ప్రస్తుతం ఉన్న పాపులారిటీని చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. అటువంటి పాపులారిటీని ఈ మూవీ సొంతం చేసుకుంది. ఇందులో చేసిన ప్రతి ఒక్కరు హీరో హీరోయిన్లనే కాకుండా అందరూ ఫేమస్ అయ్యారు. చివరికి హీరో ఫ్రెండ్ ’కేశవ‘ గా అలరించిన జగదీష్ కూడా ఒక మూవీలో హీరోగా మెయిన్ రోల్ చేశాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అని. అంతే కాకుండా మొన్న ఈ మూవీకి నేషనల్ అవార్డు కూడా రావడంతో ప్రస్తుతం ఈ మూవీ మరోసారి ట్రెండ్ అవుతోంది. 

తొలి తెలుగు మూవీ

తెలుగు మూవీ స్టార్ట్ అయి వందల సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క నేషనల్ అవార్డు కూడా రాలేదు. ఆ లోటును అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ భర్తీ చేసింది. పుష్ప మూవీకి గానూ అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కింది. కేవలం ఇది మాత్రమే కాకుండా ఇంకా వేరే కేటగిరీలలో కూడా అవార్డులు వచ్చాయి. దీంతో మూవీ యూనిట్ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. పుష్ప-2 మూవీ కొద్ది రోజుల్లో రానుండడంతో ఈ వార్త ఇప్పుడు మేకర్స్ కు ఎక్కడ లేని కాన్ఫిడెంట్ ను ఇచ్చింది. కొంత మంది స్టార్లు ఈ మూవీ ఆఫర్ ను వదులుకున్నారని ఫిలిం నగర్ టాక్. అది వేరే విషయం… ఇక జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సాధించడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర ఇండస్ట్రీల ప్రముఖులు కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కేవలం సినీ ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రమే కాకుండా అనేక మంది రాజకీయ ప్రముఖులు కూడా బన్నీని విష్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా బన్నీ విషెస్ తో సోషల్ మీడియా మార్మోగిపోతుంది. ఈ నేపథ్యంలో జాతీయ ఉత్తమ నటి అవార్డును తీసుకున్న కృతి సనన్ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను విష్ చేసింది. అమ్మడు విష్ చేస్తూ తనకు బన్నీతో కలిసి నటించాలని ఉందని కోరికను బయట పెట్టింది. 

ఇదే డైరెక్టర్ తో తొలి మూవీ

అమ్మడు ఇలా ట్వీట్ చేయడంతో అది కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక కృతి సనన్ తొలి తెలుగు మూవీ గురించి అంతా చర్చించుకుంటున్నారు. కృతి 2016లోనే మహేశ్ బాబు హీరోగా నటించిన వన్-నేనొక్కడినే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీతో తన గ్లామర్ డోస్ ఏంటో కృతి కుర్రకారుకు చూపెట్టింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన సినిమా అభిమానులను మెప్పించడంలో విఫలం అయింది. కానీ విమర్శకుల నుంచి కూడా ఈ మూవీ ప్రశంసలు అందుకుంది. సుకుమార్ టేకింగ్ నెక్ట్స్ లెవల్ అని అంతా మెచ్చుకున్నారు. కానీ ఈ మూవీ రిజల్ట్ మాత్రం యావరేజ్ అని రావడంతో అంతా ఢీ లా పడ్డారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తెరను పంచుకున్నా కానీ యావరేజ్ అయిందనో లేక మరే కారణమో కానీ కృతి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క తెలుగు మూవీ కూడా చేయలేదు. మొన్నా మధ్య ఆదిపురుష్ మూవీతో ప్రేక్షకులను పలకరించినా కానీ దానిని తెలుగు మూవీలా ఎవరూ ట్రీట్ చేయలేదు. అందులో హీరోగా నటించిన ప్రభాస్ తప్ప డైరెక్టర్, హీరోయిన్, క్రూ అంతా వేరే ఇండస్ట్రీలకు చెందిన వారే. ఇక త్వరలోనే ఈ బ్యూటీ బన్నీతో జతకడుతుందని అంతా కామెంట్ చేస్తున్నారు. మరి చూడాలి.. ఈ క్రేజీ కాంబినేష్ కుదురుతుందో లేదో..