సీక్వెల్‌లో నటించడం ఇదే మొదటిసారి- కొంకణా సేన్ శర్మ

ముంబై డైరీస్ 26/11 వెబ్ సిరీస్ 2021లో చాలా పాపులర్ అయింది. ముంబైలో 2008లో జరిగిన పేలుళ్ల సమయంలో బాంబే జనరల్ ఆసుపత్రి సిబ్బంది పడిన కష్టం ఆధారంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఆ సీజన్‍కు మంచి ఆదరణ లభించింది. కాగా, ఇప్పుడు రెండేళ్ల తర్వాత ముంబై డైరీస్ సిరీస్‍లో రెండో సీజన్ వస్తోంది. ముంబైలో సంభవించిన భీకర వరదల నేపథ్యంలో ఈ మెడికల్ థ్రిల్లర్ సీజన్ రూపొందింది. ఈ ముంబై డైరీస్ సీజన్ 2కు […]

Share:

ముంబై డైరీస్ 26/11 వెబ్ సిరీస్ 2021లో చాలా పాపులర్ అయింది. ముంబైలో 2008లో జరిగిన పేలుళ్ల సమయంలో బాంబే జనరల్ ఆసుపత్రి సిబ్బంది పడిన కష్టం ఆధారంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఆ సీజన్‍కు మంచి ఆదరణ లభించింది. కాగా, ఇప్పుడు రెండేళ్ల తర్వాత ముంబై డైరీస్ సిరీస్‍లో రెండో సీజన్ వస్తోంది. ముంబైలో సంభవించిన భీకర వరదల నేపథ్యంలో ఈ మెడికల్ థ్రిల్లర్ సీజన్ రూపొందింది. ఈ ముంబై డైరీస్ సీజన్ 2కు సంబంధించిన ట్రైలర్ సెప్టెంబర్ 29 రిలీజ్ అయింది. ఈ షోలో డా. చిత్రా దాస్‌గా తనలోని రాక్షసులతో పోరాడుతున్న దుర్బలమైన స్త్రీ పాత్రను  కొంకణా సేన్ శర్మ పోషించింది. తన పాత్రను తిరిగి పోషించడంపై తన ఆలోచనలను మరియు తన కెరీర్‌లో మొదటిసారి సీక్వెల్‌లో పని చేయడంలో ఉన్న ఉత్సాహాన్ని పంచుకుంది.

కొంకణా సేన్ శర్మ ఈ సిరీస్ యొక్క సీక్వెల్‌లో పని చేయడం గురించి తన అనుభవాన్ని గురించి మాట్లాడుతూ.. షో సీక్వెల్‌లో పనిచేయడం తనకు ఇదే మొదటిసారి అని, ఆ అనుభవం చాలా ఆనందదాయకంగా ఉందని ఆమె పేర్కొంది. ఆమె దానిని “గృహప్రవేశం యొక్క అనుభూతి”గా అభివర్ణించింది, ఎందుకంటే అవి పూర్తిగా కొత్త పాత్రతో ప్రారంభం కావు, బదులుగా మునుపటి సీజన్‌లోని పాత్రపై ఆధారపడి ఉన్నాయని, సీక్వెల్‌ను చిత్రీకరించడం చాలా సరదాగా ఉందని, తన పాత్ర మరియు ప్రదర్శన యొక్క సారాంశాన్ని లోతుగా పరిశోధించడం తనకు అద్భుతమైన అనుభవంగా మారిందని ఆమె పంచుకున్నారు.

ముంబైలో 2005, జులై 26న కురిసిన వరదలకు సుమారు 1100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రాణాలు విడిచేటపుడు..జరిగిన సంఘటనలను ట్రైలర్లో ఎంతో హార్ట్ టచింగ్గా చూపించారు. ఈ వరదల్లో ముంబై నగరం అంతా మునిగిపోతుండగా..డాక్టర్లు, సిబ్బంది..రోగులకు వైద్యం చేసేందుకు ఎలా శ్రమించారో ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఒక పక్క పూర్తిగా కరెంట్ పోవడం, వర్షం నీళ్లు డైరెక్ట్ హాస్పిటల్స్ లోకి రావడం వంటి సీన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ వరదల వల్ల సామాన్య ప్రజల జీవితం అస్తవ్యస్తంగా మారిపోవడం..రోడ్డుపై వెహికిల్స్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ లో చిక్కుకొని ఉండటం..ప్రజలు వరదలో కొట్టుకుపోవడం సీన్స్ ఇంటెన్స్ వైబ్ ని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా..హఠాత్తుగా మ్యాన్ హోల్స్ లో పడి జనాలు గల్లంతు అయ్యే సీన్స్ ఎమోషన్ అయ్యేలా చేస్తున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తినడానికి తిండి కూడా దొరకకుండా చనిపోయిన మనుషులను చూపిస్తూ కంటతడి పెట్టేలా చేశాడు డైరెక్టర్. ఈ ప్రకృతి విపత్తుని ఎదుర్కోవడానికి ప్రభుత్వం, అధికారులు, ప్రజలు, డాక్టర్స్ ఎలా తమ ప్రాణాలని తెగించి పోరాడారో ట్రైలర్లో చక్కగా చూపించారు.

ముంబై డైరీస్ సీజన్ 2లో మోహిత్ రాణా, కొంకనా సేన్ శర్మ, శ్రేయ ధన్వంతరీ, నటాశా భరద్వాజ్, సత్యజీత్ దూబే, మృణ్‍మయీ దేశ్‍పాండే, టీనా దేశాయ్, ప్రకాశ్ బేలవండి కీలకపాత్రలు పోషించారు. రీసెంట్గా మలయాళీ సూపర్ హిట్ మూవీ 2018కి ముంబై డైరీస్ సీజన్ 2 దగ్గర పోలీకలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 2018 మూవీ కూడా కేరళలో సంభవించిన తుఫాన్, వరదల నేపథ్యంలోనే తెరకెక్కించగా రిలీజైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇకపోతే ముంబై డైరీస్ సీజన్ 1 టెర్రర్ ఎటాక్స్ నేపథ్యంలో వచ్చి అందరినీ కదిలించింది. ఇప్పుడు ముంబై డైరీస్ సీజన్ 2 ముంబై ఫ్లడ్స్ నేపథ్యంలో వస్తుంది. ఈ సిరీస్ కూడా ఆడియన్స్ని మెప్పెంచేలా ఉంది. వచ్చే నెల (అక్టోబర్ 26న) ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కానుంది. ముంబై డైరీస్ సీజన్ 2 నిఖిల్ అద్వానీ డైరెక్ట్ చేస్తుండగా..మోనిషా అద్వానీ & మధు భోజ్వానీ నిర్మిస్తున్నారు.