కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలో సల్మాన్ పాత్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ ఫర్హాద్..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్.. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ చిత్ర […]

Share:

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్.. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ చిత్ర దర్శకుడు ఫర్హాద్ సామ్జి సల్మాన్ ఖాన్ పాత్రపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. 

కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా ఈద్‌కు ముందే ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు తెలిపారు. కాగా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ లేటెస్ట్ స్టైల్‌ని కూడా పంచుకున్నారు. ఆ స్టైల్‌లో సల్మాన్ ఖాన్ ఫార్మల్ వైట్ షర్టుతో క్లాసిక్ లుక్ లో కనిపించాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల కాగా ఆ టీజర్‌లో సల్మాన్ ఖాన్ డైలాగ్స్ యాక్షన్ సీన్స్ అదుర్స్ అనిపించాయి. మరొక టీజర్‌లో వెంకటేష్, భూమిక బతుకమ్మ పట్టుకొని వస్తూ కనిపించరు. జగపతిబాబు కూడా విలన్‌గా పవర్‌ఫుల్ రోల్లో కనిపించనున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్ర దర్శకుడు ఫర్హాద్ ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా దర్శకుడు ఫర్హాద్ మాట్లాడుతూ.. “సల్మాన్ ఖాన్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఆయన స్టార్ డమ్‌కి న్యాయం చేయడానికి చాలా ప్రయత్నించాము. సునీల్ శెట్టి, అమితాబచ్చన్ కూడా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ రోల్ చూసి మమ్మల్ని మెచ్చుకున్నారు. లారెన్స్ బిష్ణోయ్ నుండి చంపేస్తామనే బెదిరింపుల మధ్య సల్మాన్ ఖాన్ బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్ ఎస్ యు కి మారతారు. ఆ సీన్‌లో సల్మాన్ ఒక గెటప్ లో కనిపిస్తే మరి కొన్ని సీన్స్‌లో మరొక గెటప్‌లో కనిపిస్తాడు. మొత్తం ఈ సినిమాలో మూడు గెటప్స్‌లో సల్మాన్ ఖాన్ కనిపించనున్నాడు” అని డైరెక్టర్ ఫర్హాద్ తెలిపారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌పై ఫర్హాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలు ఈ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్లాయి.‌

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన బతుకమ్మ పాట ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి మరో పాట “ఏంటమ్మా” అనే మరో సింగిల్‌ను ఏప్రిల్ 4 న విడుదల చేశారు.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ పోస్టర్స్ పాటలు అన్నీ సినిమాపై హైప్ ని క్రియేట్ చేశాయి. అదేవిధంగా ఈ సినిమా దర్శకుడు ఫర్హాద్ మాట్లాడిన మాటలు కూడా చిత్రంపై మరింతగా అంచనాలను పెంచేశాయి. మరి ఇంతమంది స్టార్లు నటించిన ఈ చిత్రం ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.