ఖుషి సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఖుషి.. శివ నిర్మాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నా రోజా నువ్వే అంటూ మొదటి పాటను విడుదల చేయగా అనూహ్యమైన స్పందనను సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో రికార్డులు […]

Share:

విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఖుషి.. శివ నిర్మాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నా రోజా నువ్వే అంటూ మొదటి పాటను విడుదల చేయగా అనూహ్యమైన స్పందనను సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రంలోని రెండవ పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఆరాధ్య అనే సెకండ్ సింగిల్ ప్రోమో ని మేకర్స్ విడుదల చేశారు. ఫుల్ సాంగ్ ని జూలై 12న విడుదల చేయనున్నారు. మొదటి పాటకి లిరిక్స్ రాసిన దర్శకుడు శివ నిర్వాణ ఈ సెకండ్ సాంగ్ కి కూడా సాహిత్యం అందించారు. ఈ పాటను సిద్ధ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు.. మొదటి పాట లాగానే ఈ పాటకి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సాంగ్ క్రమ ని విడుదల చేశారు మేకర్స్.

ఆరాధ్య  అంటూ సెకండ్ సింగిల్ కి సంబంధించిన కొత్త పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు. అందులో విజయ్ సమంత ఒకరి చేతులు మరొకరు పట్టుకొని నవ్వుతూ ఎంతో అందంగా కనిపించారు. ఈ సెకండ్ సింగిల్ 25 సెకండ్ల ప్రోమో చాలా బాగుంది. మొదటి పాటలాగే ఈ ఆరాధ్య కూడా డిఫరెంట్ ఫీల్ ను కలిగిస్తోంది. ఈ ప్రోమో లిరిక్స్ మొత్తం ఇంగ్లీషులోనే ఉన్నాయి. యు ఆర్ మై సన్ షైన్.. యు ఆర్ మై మూన్ లైట్.. యు ఆర్ స్టార్ ఇన్ ది స్కై.. కం విత్ మీ నౌ అని పాట సాగుతుంది.. ఈ పాటకి యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

 ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ సమంతతో పాటు జయరాం, మురళీ శర్మ, సచిన్ కేడేకర్ , ఆలీ , రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, లక్ష్మీ నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ , మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. డిజిటల్ రైట్స్ కూడా బడా సంస్థ భారీ ధర చెల్లించి కొనుగోలు చేయనుందని టాక్. మొత్తానికి ఈ సినిమాపై పాజిటివ్ వైస్ అయితే ఉన్నాయి. కానీ ఈ సినిమా విడుదల అయిన తరువాత ఇదే పాజిటివిటీని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. 

ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం విజయ్ సమంతా ఇద్దరు వరుస ప్లాపుల్లో ఉన్నారు. దీంతో వీరిద్దరి నుంచి అభిమానులు ఒక హిట్టు కోసం చూస్తున్నారు.  శివ నిర్వాణకి లవ్ స్టోరీ లో 100% సక్సెస్ రేట్ ఉంది. దీంతో ఈ సినిమాపై విజయ్, సమంత అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా వీరిద్దరికీ ఏమాత్రం కలిసొస్తుందో చూడాలి.

విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో వచ్చిన మహానటి సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. వీరి నటనకు ఈ సినిమాలో మంచి మార్కులే పడ్డాయి. వీళ్ళిద్దరూ కలిసి ఫుల్ లెన్త్ ఖుషి సినిమాలో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.