అత‌నితో శ్రీదేవి రెండో కూతురు డేటింగ్

 టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఈమె చెల్లెలు ఖుషి కపూర్ కూడా త్వరలో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయబోతుంది.ది ఆర్చీస్ అని తో ఖుషి ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ స్టార్ కిడ్ తన డేటింగ్ రూమర్స్ వల్ల సోషల్ మీడియాలో వైరల్  అయ్యింది. ఎక్కడ చూసినా బ్రౌన్ ముండే సింగర్ ధిల్లాన్‌తో ఖుషీ డేటింగ్ […]

Share:

 టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఈమె చెల్లెలు ఖుషి కపూర్ కూడా త్వరలో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయబోతుంది.ది ఆర్చీస్ అని తో ఖుషి ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ స్టార్ కిడ్ తన డేటింగ్ రూమర్స్ వల్ల సోషల్ మీడియాలో వైరల్  అయ్యింది.

ఎక్కడ చూసినా బ్రౌన్ ముండే సింగర్ ధిల్లాన్‌తో ఖుషీ డేటింగ్ అన్న రూమర్ ప్రచారంలో ఉంది. ఇన్‌స్టంట్ బాలీవుడ్ రిపోర్టు ప్రకారం కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో కథ నడుస్తుంది. రీసెంట్ గా ఈ పంజాబీ సింగర్ రిలీజ్ చేసిన ఆల్బమ్ లోని ఒక పాట తర్వాత ఈ చర్చ మొదలయ్యింది. ట్రూ స్టోరీస్ అనే ఈ ఆల్బమ్ లో ధిల్లాన్‌ పాట లిరిక్స్ లో “జాదోన్ హస్సే తన్ లగే తు ఖుషీ కపూర్.” అంటే, “నువ్వు నవ్వినప్పుడు ఖుషీ కపూర్‌లా కనిపిస్తావు”అన్న వాక్యం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఖుషీ డెబ్యూ

ఈ బాలీవుడ్ స్టార్ కిడ్ తన డెబ్యూ మూవీ ది ఆర్చీస్ కోసం రెడీ అవుతుంది.జోయా అక్తర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ తో  షారుఖ్ ఖాన్ గారాల పట్టి 

సుహానా మరియు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ మూవీ లో అదితి సైగల్, వేదంగ్ రైనా, యువరాజ్ మెండా మరియు మిహిర్ అహుజా నటిస్తున్నారు.అయితే ది ఆర్చీ కామిక్స్ ఇండియన్ వెర్షన్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన తర్వాత అది చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందులో చూపించిన క్యారెక్టర్స్ మరియు వాళ్ళ వేషధారణ చూస్తే వాళ్ళు ఇండియాకు సంబంధించిన వాళ్ళు లాగా కనిపించడం లేదు అని చాలామంది నటిజన్స్ కామెంట్ చేశారు. అయితే దీనికి డైరెక్టర్ రేంజ్ లో రెస్పాండ్ అని తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు.

జాన్వీ కపూర్ ఖుషీ తన తొలి చిత్రం కోసం ఎంతో కష్టపడుతోంది అని ఇండియా టుడేతో జరిగిన చాట్ లో పేర్కొన్నారు.” నేను ఖుషీ పడుతున్న శ్రమ చూసి ఎంతో హ్యాపీగా ఉన్నాను హ్యాపీ గా ఉన్నాను. ఖుషీ ఈ మూవీ లో తన క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ ఇవ్వడానికి ఎంతో హార్డ్ వర్క్ చేసింది.”అని జాన్వీ అన్నారు.

రూమర్స్ లో నిజం ఎంత?

ఇది కేవలం రూమర్ తప్ప ఇందులో నిజానిజాలు ఎవరికి తెలియదు. కానీ ఈ సాంగ్ ఇష్యు బయటకు వచ్చినప్పటి నుంచి రకరకాల కామెంట్స్ తో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఖుషీ మరియు ధిల్లాన్‌ కు మధ్య ఏదో గొడవ జరిగిందని.. అందుకే ఖుషీ ను ఖుష్ చేసి కూల్ చేయడానికి  ధిల్లాన్ తన సాంగ్ లో ఖుషీ నవ్వు గురించి మెన్షన్ చేశాడు అని కొత్తగా కథలు సృష్టిస్తున్నారు.

ఇంతవరకు ఈ డేటింగ్ పుకార్లపై ఖుషీ మరియు ఏపీ ధిల్లాన్ స్పందించలేదు. అంటే వాళ్ళు ఈ డేటింగ్ రూమర్స్‌ను సమర్థిస్తున్నారా లేక మాకు ఇటువంటి వాటితో పనిలేదు అని కామ్‌గా ఉన్నారా .. అన్న విషయం పై ఎటువంటి స్పష్టత లేదు.అయితే మరోపక్క ఖుషీ కపూర్ కు మిస్టరీ మ్యాన్ ఆకాష్ మెహతా డేటింగ్ చేస్తున్నట్లు కొని రూమర్స్ ఉన్నాయి.