KGF-3 అప్డేట్ వచ్చేసింది

యావత్ భారతదేశం ఒక్కసారిగా యష్ హీరో వైపు తిరిగిందని చెప్పుకోవచ్చు. కేజీఫ్ చాప్టర్1,2 సినిమాలతో ప్రసిద్ధి చెందిన హీరో యాష్ హాలీవుడ్ రేంజ్కి ఎదిగాడ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక హాలీవుడ్ దర్శకుడుతో కనిపించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. ఒక కొత్త అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా స్క్రిప్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు యష్ కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీళ్ […]

Share:

యావత్ భారతదేశం ఒక్కసారిగా యష్ హీరో వైపు తిరిగిందని చెప్పుకోవచ్చు. కేజీఫ్ చాప్టర్1,2 సినిమాలతో ప్రసిద్ధి చెందిన హీరో యాష్ హాలీవుడ్ రేంజ్కి ఎదిగాడ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక హాలీవుడ్ దర్శకుడుతో కనిపించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. ఒక కొత్త అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా స్క్రిప్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు యష్ కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీళ్ కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్ ఆయన KGF-1,2కి సీక్వెల్ KGF చాప్టర్-3 అప్డేట్ అయితే వచ్చేసింది. 

KGF-3 అప్డేట్: 

కన్నడ సూపర్‌స్టార్ యష్, KGF ఫిల్మ్ సిరీస్ భారీ విజయాల తర్వాత సినిమాలకు చాలా విరామం ఇచ్చాడని చెప్పుకోవాలి. తమ సినిమాల బాక్సాఫీస్ విజయాలను క్యాష్ చేసుకోవడంలో సమయం వృథా చేసుకోని సూపర్ స్టార్‌ల మాదిరిగా కాకుండా, ‘రాకీ భాయ్’ తాను ఎంచుకునే తదుపరి ప్రాజెక్ట్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

KGF సిరీస్ నిజానికి ప్రేక్షకులలో భారీ విజయాన్ని సాధించింది. తరువాతి భాగం కోసం ఎదురుచూపులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సాలార్‌తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్, ఈ సంవత్సరం చివరిలో KGF: చాప్టర్ 3 అధికారిక ప్రకటన చేయబోతున్నారు. యష్ నటించిన KGF చాప్టర్ 3 విడుదల తేదీ మరియు కథాంశం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు, KGF చాప్టర్ 3 తప్పకుండా 2025లో విడుదల కానుందని, మాస్టర్ స్టోరీటెల్లర్, ప్రశాంత్ దానిని 2024,అక్టోబర్‌లో కేజిఎఫ్ కి సంబంధించిన సన్నాహాలు ప్రారంభించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. 

యష్ 19: 

యష్ డిసెంబర్ 2023 నుండి యష్ 19 షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడని.. ప్రస్తుతం ప్రిపరేషన్ వర్క్ జరుగుతోందని.. రాబోయే కాలంలో యష్‌కి కూడా లుక్ కి సంబంధించిన కొన్ని టెస్ట్‌లు జరుగుతాయని. యష్‌కి సినీ రంగం నుంచి కొన్ని స్క్రిప్స్ వచ్చినప్పటికీ, గీతు మోహన్‌దాస్ కోంబోలో చిత్రం రాబోతుందని స్పష్టం చేశారు సన్నిహిత వర్గాలు.

యష్, గీతు మోహన్‌దాస్ కొంబోలో రాబోతున్న ప్రాజెక్ట్‌ కోసం సిద్ధమవుతున్నారు. ఈ భారీ అంచనాల చిత్రం అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. గీతు మోహన్‌దాస్ ఇప్పటికే మలయాళ సినిమా రంగంలో ప్రశంసలు సంపాదించడం గమనించదగ్గ విషయం.’మూథోన్’ సినిమాకి గాను మలయాళంలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రతిష్టాత్మకమైన జాతీయ చలనచిత్ర అవార్డుతో సహా.. కెరీర్ పరంగా కూడా అనేక ప్రశంసలను అందుకున్నారు.

ఇటీవల హాలీవుడ్ దర్శకుడు జేజే పెర్రీని కలిసిన యష్: 

లండన్‌లో ఉన్న కన్నడ సూపర్‌స్టార్, గీతు మోహన్‌దాస్ దర్శకత్వం కోసం తన ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లు చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇటీవల ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు JJ పెర్రీతో కనిపించి ఆకట్టుకున్నారు యష్. దర్శకుడు JJ పెర్రీ ప్రముఖ జాన్ విక్ సిరీస్ తీసి ప్రసిద్ధి చెందారు.

చిత్రనిర్మాత, తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో, KGF నటుడితో తీసుకున్న ఒక బెస్ట్ ఫోటో పంచుకున్నారు, అతని పోస్ట్‌కి క్యాప్షన్ , లండన్‌లో నా సోదరుడు @thenameisyash అంటూ రాస్కొచ్చారు. వీరిద్దరి తాజా సమావేశం వెనుక ఉద్దేశ్యాన్ని జెజె పెర్రీ వెల్లడించనప్పటికీ, యష్ అభిమానులు మాత్రం ఇది ఖచ్చితంగా నటుడి నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ ఒకటి అని ఊహాగానాలు చేస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ త్వరలో హాలీవుడ్ అరంగేట్రం చేయడానికి చర్చలు జరుపుతున్నారా అని ఇప్పుడు సినీ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే, ప్రస్తుతం అందిన కేజిఎఫ్-3  అప్డేట్ అభిమానులకు ట్రీట్ గా మారనుంది