చిరంజీవి డాన్స్ స్టెప్పుల గురించి మాట్లాడిన కీర్తి సురేష్

మహేష్ బాబు స‌ర్కారువారి పాట‌, నాని (నేను లోకల్), దుల్కర్ సల్మాన్ (మహానటి) వంటి పెద్ద స్టార్స్‌ తో జత కట్టి  నటించిన తర్వాత, నటి కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి సోదరిగా నటించే అవకాశం వచ్చింది  భోలా శంకర్ మూవీ తో. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్ట్ 11న గ్రాండ్ రిలీజ్ కానుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  తమన్నా భాటియా మరియు కీర్తి సురేష్ ముఖ్య పాత్రలు […]

Share:

మహేష్ బాబు స‌ర్కారువారి పాట‌, నాని (నేను లోకల్), దుల్కర్ సల్మాన్ (మహానటి) వంటి పెద్ద స్టార్స్‌ తో జత కట్టి  నటించిన తర్వాత, నటి కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి సోదరిగా నటించే అవకాశం వచ్చింది  భోలా శంకర్ మూవీ తో.

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్ట్ 11న గ్రాండ్ రిలీజ్ కానుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  తమన్నా భాటియా మరియు కీర్తి సురేష్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించగా, మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చారు .. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ఏరియాల్లో భోళా శంకర్ బుకింగ్స్ మొదలు కాగా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి  ఇప్పుడు ‘భోళాశంకర్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచేసింది. ఈ క్రమంలోనే తాజాగా ‘భోళా శంకర్’ మూవీ టీం స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత అనిల్ సుంకర, హీరోయిన్స్ తమన్నా, కీర్తి సురేష్ పాల్గొనగా.. గెటప్ శీను మూవీ టీంని ఇంటర్వ్యూ చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి కీర్తి సురేష్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఈ మేరకు చిరంజీవి మాట్లాడుతూ..”పున్నమి నాగు.. సినిమాలో కీర్తి సురేష్ వాళ్ళ అమ్మ (మేనక)తో కలిసి నేను నటించాను. ఆ తర్వాత మేము కలిసినప్పుడల్లా తాను కీర్తి సురేష్ గురించి చెబుతూ ఉండేది. ‘మహానటి’ సినిమాలో కీర్తి సురేష్ నటన చూసి ఆశ్చర్యపోయాను. ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నేను ఎంతో ఆనందించాను. ఆ ఆనందాన్ని మూవీ టీంతో పంచుకోవడానికి నేను వాళ్ళని ఇంటికి పిలిచాను. కానీ అప్పుడు కీర్తి సురేష్ ని మిస్సయ్యాను.

 ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి మహానటి సినిమాలో ఎంత అద్భుతంగా నటించిందని నా సంతోషాన్ని ఆమెతో పంచుకున్నాను. ఇక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కీర్తి సురేష్ కి మెసేజ్ ద్వారా నా అభినందనలు తెలిపాను. అప్పటినుంచి కీర్తి సురేష్ సినిమాలు చూడడం మొదలు పెట్టాను. మొన్న కూడా వడివేలుతో కలిసి నటించిన ‘మామన్నన్’ సినిమా చూశాను.

 ఆ సినిమాలో కూడా చాలా బాగా నటించింది. తను ఇప్పటివరకు చాలా విభిన్న పాత్రలు చేసింది. అందుకే ఈ ‘బోళా శంకర్’ లో సిస్టర్ క్యారెక్టర్ ఆమె చేస్తే బాగుంటుందని మేమంతా అనుకోవడం జరిగింది. ఇక షూటింగ్లో మా ఇద్దరి మధ్య ఎంతో మంచి బంధం ఏర్పడింది. అంతేకాదు కీర్తితో సీన్స్ చేస్తున్నప్పుడు నిజంగా సిస్టర్ లాంటి ఫీలింగ్ కలిగింది అని ఆయన అన్నారు 

కీర్తి సురేష్ పీక పట్టుకోవడం గతంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ 

కీర్తి పీక పట్టుకోవడం గురించి మెగాస్టార్ స్పందిస్తూ మా ఇంట్లో తమిళ వంట మనిషి ఉన్నాడని కీర్తికి కావాల్సిన భోజనం అతనే పంపేవాడని చెప్పారు.ప్రతిరోజూ కీర్తి చాలా వెరైటీలు తినేదని తినే మొత్తం తక్కువే అయినా ఎంజాయ్ చేసేదని ఒక్కోసారి ఏం కావాలో డిమాండ్ చేసేదని చిరు తెలిపారు.

ఉప్పు, కారం తగ్గితే ఫుడ్ ను కీర్తి సురేష్ వెనక్కు పంపేదని మళ్లీ సరిగ్గా చేయమని కోరేదని చిరంజీవి పేర్కొన్నారు.ఒకసారి షూట్ లో బిజీగా నన్ను కీర్తి సురేష్ రేపు మెనూ ఏంటి అని అడిగిందని నాకు ఒక్కసారిగా కోపమొచ్చి పీక పట్టుకున్నానని ఈ షాట్ ఆ సమయంలో తీసిన షాట్ అని చిరంజీవి అన్నారు.

అప్పుడు రజినీకాంత్ చెల్లిగా… ఇప్పుడు చిరంజీవి చెల్లిగా.. కీర్తి  

కీర్తి సురేష్ మాట్లాడుతూ … నేను దాని గురించి చాలా సంతోషంగా ఉన్నాను. నేను రజనీకాంత్ గారి అన్నత్తే పూర్తి చేసిన తర్వాత భోళా శంకర్ టీమ్ నన్ను సంప్రదించింది. మెగాస్టార్ చిరంజీవి గారు మరియు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇద్దరు లెజెండ్స్, వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భోళా శంకర్‌లో చిరు గారితో కలిసి డ్యాన్స్ కూడా చేశాను. చిరంజీవి గారితో కలిసి డ్యాన్స్ చేయాలనేది నా కల, కానీ భోళా శంకర్‌లో మెగాస్టార్‌గారితో రెండు పాటల్లో డ్యాన్స్ చేసే అదృష్టం నాకు దక్కింది అని ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.