ఖుషి క‌థ విజ‌య్ కోస‌మే రాసా

‘బేబీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ప్రేమకథలకు రెక్కలు తొడిగారు ప్రేక్షకులు. అదే ఊపులో ఇప్పుడు ‘ఖుషి’ సినిమా ప్రేక్షకుల్ని పలకరించింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో ఈ ప్రేమకథలకు ఓ దండంరా బాబూ.. ఇక లవ్ స్టోరీస్ చేయనని స్టేట్ మెంట్ ఇచ్చేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండని ‘ఖుషి’ సినిమా కథతో మళ్లీ లవ్ ట్రాక్ ఎక్కించారు దర్శకుడు శివ నిర్వాణ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై […]

Share:

‘బేబీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ప్రేమకథలకు రెక్కలు తొడిగారు ప్రేక్షకులు. అదే ఊపులో ఇప్పుడు ‘ఖుషి’ సినిమా ప్రేక్షకుల్ని పలకరించింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో ఈ ప్రేమకథలకు ఓ దండంరా బాబూ.. ఇక లవ్ స్టోరీస్ చేయనని స్టేట్ మెంట్ ఇచ్చేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండని ‘ఖుషి’ సినిమా కథతో మళ్లీ లవ్ ట్రాక్ ఎక్కించారు దర్శకుడు శివ నిర్వాణ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమా విజయంపై దర్శకుడు శివ మీడియాతో ముచ్చటించి, సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు…

‘నిన్ను కోరి’ సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన శివ నిర్వాణ.. డెబ్యూతోనే సూపర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత ‘మజిలీ’ మూవీతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు.ఈ క్రమంలో ఇప్పుడు ‘ఖుషి’ అనే రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ను అలరించాడు.

‘ఖుషి’కి స్పందన 

”పెళ్లికి ముందు పెళ్లి తర్వాత సమస్యలతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో టైటిల్ కు తగినట్లుగా ఎంటర్టైన్మెంట్ తో కథను చెప్పాలని అనుకున్నాను. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి వస్తున్న ప్రశంసలు చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. యూత్ ఫస్ట్ హాఫ్ అంటే విజయ్ కామెడీ టైమింగ్, సామ్ స్క్రీన్ ప్రెజెన్స్, పాటలు మరియు ఎమోషన్స్‌తో కనెక్ట్ అయ్యే మరో వర్గం ప్రేక్షకులు మరియు క్లైమాక్స్‌కి పరిణితి చెందిన విధానం నచ్చుతుంది. నా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నదని తెలియడం ఆనందంగా ఉందని శివనిర్వాణ చెప్పారు. ‘డియర్ కామ్రేడ్’ సినిమా టైంలో విజయ్ కి ఈ స్టోరీ చెప్పానని, ఏడాదిన్నర తర్వాత సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లామని తెలిపారు. ఈ సారి ఔట్ ఆఫ్ ది బాక్స్ మూవీ చేయాలని అనుకున్నానని, విజయ్ కి ‘ఖుషి’ లైన్ నచ్చడంతో ఈ జర్నీ మొదలైందన్నారు.

‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాల్లో ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ చూపించాను. కానీ ఈసారి ఒక ఎంటర్టైనింగ్, ఎనర్జిటిక్, సరదాగా ఉండే ప్రేమ కథను రూపొందించాలని అనుకున్నాను. నేను వ్యక్తిగతంగా చాలా సరదాగా ఉండే మనిషిని. ఈ సినిమాకు ‘సరదా’ అని, మరికొన్ని టైటిల్స్ కూడా అనుకున్నాను. కానీ విజయ్, సమంతకున్న పాన్ ఇండియా ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమాని తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఐదు భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అలా ‘ఖుషి’ టైటిల్ ఫిక్స్ చేశామని దర్శకుడు వివరించారు.

‘సఖి’ సినిమాతో పోలికలు

‘సఖి’ సినిమాతో పోలికలు రావడంపై శివ నిర్వాణ స్పందిస్తూ.. ‘ఖుషి’ సినిమా మణిరత్నం ‘సఖి’ లాంటి పాయింట్ అనే వార్తలు వచ్చాయి. కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. ఇవాళ్టి కాంటెంపరరీ సొసైటీలో ఉన్న ఒక ఇష్యూను విజయ్, సమంత లాంటి పాపులర్ స్టార్స్ ద్వారా అడ్రస్ చేయిస్తే బాగుంటుందని నమ్మాను. వాళ్లకూ ఈ పాయింట్ కనెక్ట్ అయ్యింది. ఆ పాయింట్ ఏంటనేది ట్రైలర్ లో మేము చూపించలేదు. థియేటర్ లో చూడాలి అని అన్నారు.

హేషాబ్ కృషి అసాధారణం

‘హృదయం’ పాటలు విని ‘ఖుషి’ మ్యూజిక్ కోసం హేషమ్ ను కలిసినప్పుడు ఆయన మంచి మ్యూజిక్ ఇవ్వగలడని అనిపించింది. విజయ్ కూడా ఓకే అన్నాడు.విజయ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. పెళ్లి చూపులు, గీత గోవిందంలో ఒకలాంటి కామెడీ టైమింగ్ చూశారు. కానీ ఇందులో స్టైలిష్ కామెడీ చేశాడు. అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియెన్స్ కు విజయ్ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. అందరూ ఆయన క్యారెక్టర్ ను ఓన్ చేసుకుంటారు. ‘ఖుషి’ లో హిందూ ముస్లిం మధ్య గొడవలు చూపించడం లేదు. కానీ ఒక వెరీ సెన్సిటివ్ ఇష్యూను కథలో చూపిస్తాం. అది మీకు నచ్చుతుంది. ఒక ప్లెజంట్ ఎట్మాస్పియర్ కోసమే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నామని శివ వివరించారు. 

మైత్రీ మూవీ మేకర్స్

ఖుషి నిర్మాతల గురించి దర్శకుడు మాట్లాడుతూ.. మైత్రీ నిర్మాతలు డైరెక్టర్స్ కు ఎంతో ఫ్రీడమ్ ఇస్తారు. వాళ్లు ఇచ్చిన రిసోర్సెస్ ను బాగా ఉపయోగించుకోవాలే గానీ ఎంతైనా క్రియేటివిటీ చూపించుకోవచ్చు. సెట్ కొచ్చి.. ఇంకొంచెం పెద్ద సెట్ వేస్తే బాగుండేది అనేవారంటే వాళ్లు ఎంత సపోర్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. నేను కనెక్ట్ అయితే వరుసగా సినిమాలు చేస్తాను. నానితో రెండు సినిమాలు చేశాను, అలాగే షైన్ స్క్రీన్స్ సంస్థలో రెండు మూవీస్ చేశాను. ఇప్పుడు మైత్రీతో అనుబంధం ఏర్పడింది అని చెప్పారు.

మణిరత్నం అభిమానిని

“నేను మణిరత్నం అభిమానిని. ఆయన సినిమాలను ఇష్టపడతాను. ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు చెన్నై వెళ్లి ఆయన దగ్గర జాయిన్ అవ్వాలనుకున్నా. అయితే వారం రోజులు ప్రయత్నించినా ఆయన్ని కలవడం కుదరలేదు. ఆయన సినిమాలను ఇష్టపడతాను కానీ నేను ఆయనలా తీయాలనుకోను. మణిరత్నంలా ఒక్క ఫ్రేమ్ కూడా ఎవరూ పెట్టలేరు. ఆయన సినిమాల్లోని ఈస్థటిక్ సెన్స్, మ్యూజిక్ సెన్స్ నుంచి ఇన్ స్పైర్ అవుతాం అంతే” అని శివ అన్నారు.

‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కార్తికేయ’ వంటి సినిమాలన్నీ మనకు నచ్చేలా చేసుకున్న సినిమాలు. ఇతర భాషల వాళ్లు ఇష్టపడటంతో పాన్ ఇండియా అయ్యాయి. నా దృష్టిలో మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చి పాన్ ఇండియా మూవీ అవుతుంది. దానికి మనం ప్లాన్ ముందే చేసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం. ‘ఖుషి’ చూసిన తర్వాత, థియేటర్ లో నుంచి ఒక మంచి అనుభూతితో బయటకు వచ్చారని డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పుకొచ్చారు.