తల్లి కాబోతున్న కత్రినా కైఫ్?

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. చాలా మంది ముద్దుగా క్యాట్ అని పిలుచుకునే ఈ అమ్మడు 2021లో మరో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుంది. చాలా రోజులు (దాదాపు రెండు సంవత్సరాల డేటింగ్) తర్వాత ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటయింది. పెళ్లయిన నుంచి అన్యోన్యంగా ఉంటున్న ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కత్రినా కైఫ్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉందని […]

Share:

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. చాలా మంది ముద్దుగా క్యాట్ అని పిలుచుకునే ఈ అమ్మడు 2021లో మరో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుంది. చాలా రోజులు (దాదాపు రెండు సంవత్సరాల డేటింగ్) తర్వాత ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటయింది. పెళ్లయిన నుంచి అన్యోన్యంగా ఉంటున్న ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కత్రినా కైఫ్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉందని అమ్మడు త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. 

కారణం ఇదే.. 

కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ ఇలా వార్తలు రావడానికి ముఖ్య కారణం ఈ బ్యూటీ మీడియాకు దూరంగా ఉండడమే. దీంతోనే ఈ బ్యూటీ ప్రెగ్నెంట్ అని చాలా మంది గుస గుసలాడుకుంటున్నారు. అంతా గుసగుసలాడుకున్న విధంగానే మొన్నా మధ్య వినాయక చవితి సందర్భంగా అపర కోటీశ్వరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో నిర్వహించిన గణేష్ చతుర్ధి వేడుకలకు కూడా క్యాట్ హాజరు కాలేదు. ఈ ఈవెంట్ కోసం చాలా మంది బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. కానీ క్యాట్ మాత్రం ఈ ఈవెంట్ కు రాలేదు. కేవలం ఈ ఈవెంట్ అని మాత్రమే కాకుండా ఈ మధ్య క్యాట్ మీడియా కంటికి కనిపించడం లేదు. దీంతోనే అమ్మడు ప్రెగ్నెంట్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. విక్కీ కౌశల్ ను ఈ బ్యూటీ రెండేళ్ల డేటింగ్ తర్వాత డిసెంబర్ 2021లో పెళ్లి చేసుకుంది.  ప్రెగ్నెన్సీ వల్లే కత్రినా మీడియా దృష్టిని తప్పించుకుంటోందని నెటిజన్లు భావిస్తున్నారు. 

అదేం లేదు… 

కానీ కొంత మంది ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. కత్రినా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉందని అంటున్నారు. అందుకోసమే ఎక్కడా బయట కనిపించడం లేదని చెబుతున్నారు. అమ్మడు ఇప్పుడే విక్కీ కౌశల్ తో బిడ్డను కనాలని అనుకోవడం లేదని చెబుతున్నారు. అంబానీ కుటుంబం గత వారం నిర్వహించిన గణపతి వేడుకలకు విక్కీ కౌశల్ ఒంటరిగా హాజరయ్యాడు. దీంతో క్యాట్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రూమర్స్ రావడంతో ఫుల్ ఖుష్ అయ్యారు. కానీ అటువంటిదేం లేదని ప్రస్తుతం మరో వార్త వైరల్ కావడంతో అసలు క్యాట్ కు ఏమైందని కంగారు పడుతున్నారు. క్యాట్ చివరి సారిగా మీడియాకు కనిపించింది కోల్ కతాలో అని అంతా చెబుతున్నారు. ఇండస్ట్రీకి చెందిన అనేక మంది క్యాట్ ప్రెగ్నెన్సీ అనే పుకార్లను కొట్టి పారేస్తున్నారు. ఈ పుకార్లలో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నారు. క్యాట్ గర్భవతి కాదని కుండ బద్దలు కొడుతున్నారు. క్యాట్ బయట కనిపించకపోవడానికి పని ఒత్తిడే కారణమని వివరిస్తున్నారు. కేవలం బిజీ షెడ్యూల్ వల్ల మాత్రమే అమ్మడు ఎటువంటి ఈవెంట్స్ కు హాజరు కావడం లేదని అంతకు మించి మరేం లేదని చెబుతున్నారు.

అప్పుడు గుర్తించని మీడియా… 

ఎవరైనా సరే మీడియా కంటికి కనిపించకుండా బయటకు పోవడం అసాధ్యం. ముంబై విమానాశ్రయం నుంచి వెళ్దామని ఎవరైనా అనుకుంటే ఎంతటి వారైనా సరే ఎంత కట్టుదిట్టంగా బయటకు పోయినా సరే వారిని మీడియా పసిగట్టేస్తుంది. కానీ క్యాట్ విషయంలో మాత్రం మీడియా అంచనాను మిస్ అయింది. గణేష్ చతుర్థికి 3-4 రోజుల ముందు ఓ వాణిజ్య ప్రకటన షూట్ కోసం క్యాట్ ముంబై విమానశ్రయం నుంచి బయటకు వెళ్లిందట. కానీ ఆమెను మీడియా గుర్తించలేకపోయింది. 

దీంతో క్యాట్ ఫొటోలు వీడియోలు ఎక్కడా బయటకు రాలేదు. లేకుంటే ఆమె ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెళ్లే ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వైరల్ అయ్యేవి. క్యాట్ ఆ ప్రకటన కోసం చాలా తొందర తొందరగా విమానశ్రయం నుంచి వెళ్లిపోయిందట. అందుకోసమే ఆమె మీడియాకు చిక్కకుండా వెళ్లింది. ఆమె పనులతో బిజీగా ఉందని చెప్పే వారు ఈ ఉదాహరణను కూడా చెబుతున్నారు. క్యాట్ కేవలం పని ఒత్తిడి వల్లే బయట కనిపించడం లేదని గర్భవతి అనే పుకార్లు నిజం కావని అంటున్నారు. ఇక అంతే కాకుండా వారు మరో విషయాన్ని కూడా చెబుతున్నారు. విక్కీ కౌశల్ కుటుంబం నుంచి శిశువు కోసం కత్రినా కైఫ్ మీద ఎటువంటి ప్రెజర్ లేదని వారు అంటున్నారు. 

అందుకోసం ఈ జంట మొదటి బిడ్డ విషయంలో ఎటువంటి తొందరపాటుకు గురి కావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కత్రినా కైఫ్ కేవలం పని ఒత్తిడి వల్లే బయట కనిపించడం లేదని అంతే కానీ అమ్మడు బయట కనిపించకపోయే సరికి గర్భవతి అని కొంత మంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని ఈ రూమర్స్ లో ఎటువంటి నిజం లేదని చెబుతున్నారు. ఈ రూమర్స్ గురించి ఎటువంటి క్లారిటీ లేకపోయినా కానీ ఈ రూమర్స్ విని ఇటు క్యాట్ ఫ్యాన్స్, అటు విక్కీ కౌశల్ ఫ్యాన్స్ మాత్రం తెగ సంబరపడిపోయారు. తమ అభిమాన హీరోకు, హీరోయిన్ కు బుల్లి సంతానం రాబోతుందని అంతా సంబరపడిపోయారు. క్యాట్ ప్రస్తుతం టైగర్-3 సినిమాలో సల్లూ భాయ్ సరసన నటిస్తోంది. క్యాట్ చాలా రోజుల నుంచి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.