ఆదిపురుష్‌పై బ్యాన్ ఎత్తివేత‌.. ఖాఠ్మండు మేయ‌ర్ ఆవేద‌న‌

ఆదిపురుష్ సినిమా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య జూన్ 16న 7000 స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. మొదట టీజర్ తో ఎన్నో వివాదాలలో చుట్టుకున్న ఈ సినిమా ఆ తరువాత ట్రైలర్ తో మాత్రం మెప్పిచ్చి సినిమా పైన అంచనాలను పెంచింది. కానీ సినిమా విడుదల అయక మాత్రం మళ్లీ వివాదాలలో చిక్కుకునింది ఈ చిత్రం. అసలు రామాయణంతో ఈ చిత్రానికి పోలికలే లేవు అని అలానే హనుమంతుడి డైలాగులు కూడా మరీ తక్కువ చేసి […]

Share:

ఆదిపురుష్ సినిమా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య జూన్ 16న 7000 స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. మొదట టీజర్ తో ఎన్నో వివాదాలలో చుట్టుకున్న ఈ సినిమా ఆ తరువాత ట్రైలర్ తో మాత్రం మెప్పిచ్చి సినిమా పైన అంచనాలను పెంచింది.

కానీ సినిమా విడుదల అయక మాత్రం మళ్లీ వివాదాలలో చిక్కుకునింది ఈ చిత్రం. అసలు రామాయణంతో ఈ చిత్రానికి పోలికలే లేవు అని అలానే హనుమంతుడి డైలాగులు కూడా మరీ తక్కువ చేసి రాశారు అని ఎంతోమంది ఎన్నో వివాదాలకు తెరలేపారు. ఈ నేపథ్యంలో సీతా దేవి జన్మస్థలం గురించి ఈ సినిమాలో చూపించింది తప్పు అంటూ నేపాల్ వారు కూడా కేసు వేశారు. ఆదిపురుష్ సినిమాలో సీతా దేవి భారతదేశపు కుమార్తె అని డైలాగ్ చెబుతూ ఓ సన్నివేశం ఉంటుంది. దీనిని నేపాల్ సెన్సార్ బోర్డు తప్పుబట్టింది. ఎందుకు అంటే సీతా దేవి నేపాల్‌లో జన్మించిందని వారి నమ్మకం. జానకి అని కూడా పిలువబడే సీత, ఆగ్నేయ నేపాల్‌లోని జనక్‌పూర్‌లో జన్మించిందని చాలామంది నమ్ముతారు. దీంతో అక్కడ సినిమా రిలీజ్‌ కాలేదు. ఖాట్మండులోని కొన్ని థియేటర్లలో ఆదిపురుష్ సినిమాను బ్యాన్ కూడా చేశారు. అంతేకాదు ఈ డైలాగ్ మార్చకపోతే ఈ సినిమాతో పాటు అసలు ఇండియా సినిమాలు అక్కడ విడుదల చేయనివ్వము అని కూడా హెచ్చరించారు.

కోర్టు తీర్పు…

ఇక దీనిపైన ఏకంగా కోర్టులో కూడా కేసు వేయగా,నేపాల్ కోర్టు గురువారం నాడు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సహా హిందీ చిత్రాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. దేశ సెన్సార్ బోర్డు ఆమోదించిన ఏ సినిమా ప్రదర్శనను నిలిపివేయవద్దని అధికారులను కోరింది.

అయితే నేపాల్ కోర్టు ఆదిపురుష్‌పై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ, ఖాట్మండు మేయర్ షా ఈ సినిమాని వారి ప్రాంతాల థియేటర్స్ నుండి దూరంగా ఉంచడానికి మొగ్గు చూపారు. నేపాల్ సార్వభౌమాధికారం మరియు స్వాతంత్య్రానికి సంబంధించిన విషయం కాబట్టి ఎలాంటి శిక్షనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే సినిమా ప్రదర్శనను అనుమతించబోనని షా గురువారం చెప్పారు.సెన్సార్ బోర్డు నుంచి అనుమతి పొందిన సినిమాల ప్రదర్శనను నిలిపివేయరాదని పేర్కొంటూ పటాన్ హైకోర్టు న్యాయమూర్తి ధీర్ బహదూర్ చంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

నేపాల్ భారతదేశం కింద ఉంది..

అయితే దీనికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్ పోస్ట్‌లో, షా “కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండను” అని అన్నారు.”నేపాల్ భారతదేశం కింద ఉందని, ఇది భారతదేశం యొక్క దురుద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని చిత్ర రచయిత అన్నారు. దీనిని నేపాల్ ప్రభుత్వం చేసిన స్టంట్‌గా పేర్కొనడం మరియు సినిమా ప్రదర్శనకు అనుకూలంగా కోర్టు ద్వారా ఉత్తర్వులు జారీ చేయడం అంటే, నేపాల్ ఒకప్పుడు భారతదేశం కింద ఉంది అని అంగీకరించడమే. భారతదేశ పాలనలో, కోర్టు మరియు ప్రభుత్వం రెండూ భారతదేశానికి బానిసలు గా మారాయి, ”అని అతను పోస్ట్‌లో పేర్కొన్నాడు.

“దీనికి ఎలాంటి శిక్షనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ సినిమా నడపడానికి అనుమతించబడదు,” అన్నారాయన.

ఖాట్మండులో ఆదిపురుష్‌ను నిషేధించాలని ఖాట్మండు మేయర్ నిర్ణయం తీసుకున్న తర్వాత, ధరన్ మేయర్ హర్కా సంపాంగ్ మరియు పోఖారా మేయర్ కూడా ఆ దావాను అనుసరించారు, చివరికి నేపాల్ అంతటా “ఆదిపురుష్” స్క్రీనింగ్ మళ్లీ నిలపబడింది.

ఇక ఓం రౌట్, దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ సినిమాని టి – సిరీస్, రెట్రో ఫైల్స్ మరియు UV క్రియేషన్స్ నిర్మించారు.  ఈ చిత్రంలో ప్రభాస్ మరియు కృతి సనన్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ మరియు దేవదత్తా నాగే కూడా నటించారు.