Japan: కార్తి నటించిన జపాన్ మూవీ ఎలా ఉండబోతుందంటే..

తమిళ నటుడు కార్తి (Karthi) నటించిన జపాన్ (Japan) మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొన్నే ఈ మూవీ ట్రైలర్ (Trailer) ను రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ఫిలిం మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. కార్తి (Karthi)కి తమిళ (Tamil Market) మార్కెట్ మాత్రమే కాకుండా తెలుగులో కూడా మార్కెట్ ఉంది. అందుకోసమే ఈ మూవీని తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్ (Dub) చేశారు. దీంతో ఈ మూవీ […]

Share:

తమిళ నటుడు కార్తి (Karthi) నటించిన జపాన్ (Japan) మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొన్నే ఈ మూవీ ట్రైలర్ (Trailer) ను రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ఫిలిం మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. కార్తి (Karthi)కి తమిళ (Tamil Market) మార్కెట్ మాత్రమే కాకుండా తెలుగులో కూడా మార్కెట్ ఉంది. అందుకోసమే ఈ మూవీని తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్ (Dub) చేశారు. దీంతో ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవనుంది. ఈ మూవీలో కార్తి (Karthi) డిఫరెంట్ రోల్ లో నటించారు. కార్తి చెప్పిన డైలాగ్స్ కూడా డిఫరెంట్ స్లాంగ్ (Slang) లో ఉన్నాయి. దీంతో ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ మూవీ ఎలాగైనా హిట్ అవుతుందని అంతా నమ్ముతున్నారు. 

డైరెక్ట్ తెలుగు మూవీనే చేసిన కార్తి.. 

హీరో కార్తి (Karthi) తమిళ స్టారే అయినప్పటికీ ఆయన తెలుగు  ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కార్తి (Karthi) మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. అది మాత్రమే కాదు ఆయన నాగార్జునతో కలిసి ఓ తెలుగు స్ట్రెయిట్ మూవీ కూడా చేశాడు. దీంతో కార్తి (Karthi)ని చూస్తే ఎవరూ అరవ హీరోలా (Tamil Hero) ఫీల్ అవరు. మళ్లీ మన తెలుగు ప్రేక్షకులు అది తమిళ మూవీనా బాలీవుడ్ మూవీనా అని చూడకుండా సినిమాలో కంటెంట్ ఉంటే దానిని తప్పకుండా హిట్ చేస్తారు. అందుకోసమే అనేక మంది తమిళ స్టార్లకు ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. మన తెలుగు ప్రొడ్యూసర్స్ కూడా మరీ తమిళ ప్రొడూసర్లలా కాకుండా కొంచెం వేరే దృష్టి కోణంతో ఉంటారు. మన తెలుగు సినిమాలకు పెద్ద సంఖ్యలో స్క్రీన్స్ కేటాయించకపోయినా కానీ ఇతర భాషల చిత్రాలకు పెద్ద సంఖ్యలో థియేటర్లు ఇస్తుంటారు. అటువంటి సమయంలో కార్తి నటించిన జపాన్ (Japan) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో కార్తి డైలాగ్స్ చెప్పిన స్లాంగ్ చూస్తేనే వావ్ అనిపిస్తుంది. ఈ మూవీ హిట్ కంపల్సరీ అని చాలా మంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

రిలీజ్ అప్పుడే.. 

కార్తి (Karthi) నటించిన జపాన్ (Japan) మూవీ దీపావళికి (Deepavali) రిలీజ్ అవుతుందని మేకర్స్ వెల్లడించారు. దీపావళి అని చెప్పారు కానీ ఏ డేట్ అనేది పక్కాగా అనౌన్స్ చేయలేదు. ఈ మూవీలో కార్తి (Karthi) సరసన అను ఎమ్మాన్యుయెల్ (Anu Emmanuel) నటిస్తోంది. అను ఎమ్మాన్యుయెల్ బోల్డ్ బ్యూటీ అనే పేరును సంపాదించుకుంది. అమ్మడు ఫుల్ మీల్స్ లా ప్రేక్షకులకు ఫన్ అందిస్తుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ ఎక్స్ పోజింగ్ కు (Exposing) అడ్డు చెప్పదు. ఈ బ్యూటీకి ఎక్కువగా అవకాశాలు లేకపోయినా కానీ వచ్చిన సినిమాల్లో ఎక్స్ పోజింగ్ తో ఇరగదీస్తోంది. తాజాగా ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నుంచి ప్రొడ్యూసర్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. మూవీ రిజల్ట్ మీద కాన్ఫిడెంట్ వ్యక్తం చేశారు. 

కార్తి చాలా ప్రత్యేకం.. 

కార్తి (Karthi) గురించి ఆ ప్రొడ్యూసర్ అనేక విషయాలు పంచుకున్నారు. ఆయన చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తారని వెల్లడించారు. కార్తి కథలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారని అందుకోసమే ఆయన నుంచి ఎక్కువ సినిమాలు రావని వెల్లడించారు. కార్తికిది 25వ సినిమా కావడం విశేషం. 25వ సినిమా విషయంలో కార్తి (Karthi) చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇదో డిఫరెంట్ జానర్ లో నడిచే సినిమా అని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ఈ మూవీలో మన తెలుగు యాక్టర్ సునీల్ కూడా నటించాడు. సునీల్ ఉండడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మూవీని తమిళ డైరెక్టర్ రాజు మురుగన్ తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీకి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) స్వరాలు సమకూరుస్తున్నారు. దీంతో ఈ చిత్రం మీద అందరికీ అంచనాలు పెరిగిపోయాయి.