కాంతార… సీక్వెల్‌ కాదు.. ఫ్రీక్వెల్..

కన్నడ సినిమా కాంతార.. చిన్ని మూవీగా విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిచలేదు. అయితే, అందరూ దీనికి సీక్వెల్‌ వస్తుందని భావించారు.. కానీ ఇప్పుడు ఫ్రీక్వెల్‌ తీయనున్నట్లు సమాచారం. అంటే, కాంతార స్టోరీ జరిగిన ముందు ఏం జరిగింది అనేది.. సినిమాగా తీయనున్నారు.  కాంతార… చిన్న సినిమాగా విడుదలై పాన్‌ ఇండియన్‌ లెవల్‌లో భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం. కేవలం రూ.14 కోట్లతో తీసిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.320 కోట్ల […]

Share:

కన్నడ సినిమా కాంతార.. చిన్ని మూవీగా విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిచలేదు. అయితే, అందరూ దీనికి సీక్వెల్‌ వస్తుందని భావించారు.. కానీ ఇప్పుడు ఫ్రీక్వెల్‌ తీయనున్నట్లు సమాచారం. అంటే, కాంతార స్టోరీ జరిగిన ముందు ఏం జరిగింది అనేది.. సినిమాగా తీయనున్నారు. 

కాంతార… చిన్న సినిమాగా విడుదలై పాన్‌ ఇండియన్‌ లెవల్‌లో భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం. కేవలం రూ.14 కోట్లతో తీసిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.320 కోట్ల కలెక్షన్లు సాధించి, రికార్డు సృష్టించింది. మొదట రీజినల్‌ ఫిల్మ్‌ గా మాత్రమే కన్నడలో రిలీజ్‌ అయిన ఈ మూవీ.. అక్కడ హిట్‌ కావడంతో తెలుగు, హిందీ, మలయాళం, తమిళం తదితర భాషల్లో డబ్‌ చేసి, రిలీజ్‌ చేశారు. రిలీజ్‌ చేసిన ప్రతి లాంగ్వేజ్‌లో ఈ మూవీ భారీ హిట్‌ను సొంతం చేసుకొని, ప్రొడ్యూసర్‌‌కి కాసుల వర్షం కురిపించింది. 

గ్రామీణ సంప్రదాయాలు, సంస్కృతి, ఆచార వ్యవహరాలను ఈ మూవీలో చూపించారు. రిషబ్‌ శెట్టి హీరోగా నటించి, డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ.. సీక్వెల్‌ వస్తుందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. మూవీ మేకర్స్‌ కూడా సీక్వెల్‌ తీస్తామని ప్రకటించారు. అయితే, ఇప్పుడు సీక్వెల్‌ కాకుండా, కాంతారకు ఫ్రీక్వెల్‌ తీయబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన కథ కూడా సిద్ధం అయిందని తెలిసింది. 400 సంవత్సరాల క్రితంలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబించేలా ఫ్రీక్వెల్‌ను రూపొందించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ మూవీ ఫ్రీక్వెల్‌ కోసం డైరెక్టర్‌‌ కమ్‌ హీరో రిషబ్‌ శెట్టి.. ఇప్పటికే వర్కౌట్లు చేసి దాదాపు 11 కిలోల బరువు తగ్గాడు. బాగా వర్కౌట్ చేసి సన్నగా ఫిట్‌గా తయారయ్యాడు. నిపుణుల వద్ద శిక్షణ తీసుకొని, సినిమా కోసం తనను తాను మార్చుకున్నాడు. 

రూ.150 కోట్ల బడ్జెట్‌తో…

కాంతార భారీ సక్సెస్‌ సాధించడంతో కాంతార 2ను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూసర్లు  నిర్మిస్తున్నారు. దాదాపురూ. 150 కోట్లతో సినిమాను నిర్మించనున్నారు. కాంతార మూవీ రూ.14 కోట్లతో నిర్మించి, రూ.320 కోట్లు రాబట్టింది. దీంతో తర్వాతి సినిమాపై ప్రొడ్యూసర్లు భారీగా ఖర్చు పెడ్తున్నారు. కాంతార ఫ్రీక్వెల్‌ కూడా రిషబ్‌ శెట్టి నటిస్తూ, డైరెక్ట్ చేయనున్నాడు. ఈ మూవీ కోసం చాలా వర్క్‌ చేశాడని, ఆక్టుకునే గ్రిప్పింగ్‌ కథనాన్ని రాశాడు. 4వ శతాబ్దంలో గ్రామీణ నాటకాన్ని, నిజ జీవిత సంఘటనలు, పాత్రల ఆధారంగా తీయనున్నారు. ఈ మూవీ ఫ్రిక్వెల్‌ ప్రేక్షకులకు తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తుందని సమాచారం. 

కేజీఎఫ్‌తో కన్నడ స్టార్‌‌ యష్‌ పాన్‌ ఇండియా హీరోగా మారాడు. కేజీఎఫ్‌1, 2తో యష్‌కు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. కేవలం సౌతిండియాతో మాత్రమే కాదు… నార్త్ లో కూడా యష్‌ కేజీఎఫ్‌తో ప్రభంజనం సృష్టించాడు. మళ్లీ ఆ రేంజ్‌లో కాంతార సినిమాతో రిషబ్‌ శెట్టి అందరి దృష్టి తనపై పడేలా చేశాడు. ఇప్పుడు కాంతారకు ఫ్రీక్వెల్‌ తీస్తున్నారని తెలియడంతో మరోసారి అందరి దృష్టి రిషబ్‌పై పడింది. 

కాంతార సినిమాలో క్లైమాక్స్‌లో రిషబ్‌ ఎమోషనల్‌ పెర్‌‌ఫార్మెన్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఆ తర్వాత వరాహ రూపం సాంగ్‌ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. వరాహ భగవానుడి సాయంతో దుష్ట శక్తులపై గిరిజనులు చేసే పోరాటం ఆకట్టుకుంది.  

కాంతార కథ 1847లో ప్రారంభం అవుతుంది. వేల కోట్ల సంపద, మంచి కుటుంబం  ఉన్నా ఓ రాజుకు ప్రశాంతత కరువతుంది. కావాల్సినవన్నీ ముందున్నా.. ఏదో లోటు ఉందని మదన పడుతుంటాడు. ఓ స్వామిజీ సూచన మేరకు ప్రశాంతత కోసం ఒంటరిగా వెళ్తాడు. ఏ ప్రదేశానికి వెళ్లినా ఆయన మనసుకు ప్రశాంతత లభించదు. చివరిలో ఓ అడవిలోకి వెళ్తుండగా, అక్కడ ఓ దేవుడి శిల ముందు ఆగిపోతాడు. అది చూడగానే మనసు తేలికైపోతుంది. ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. దీంతో ఆ దేవుడి శిల తనకు కావాలని అక్కడి ప్రజలను అడుగుతాడు. దానికి బదులుగా ఏం కావాలన్న ఇస్తానంటాడు. అయితే, అక్కడ కోలం ఆడే వ్యక్తి ఆ శిలకు బదులుగా ఆ అడవినంతా అక్కడున్న ప్రజలకు ఇవ్వాలని చెబుతాడు. దీంతో ఆ రాజు ఆ అడవి భూమిని అక్కడి ప్రజలకు దానం చేసి, దేవుడి శిలను తీసుకెళ్తాడు. అయితే, కొన్నేండ్లు గడిచిన తర్వాత ఆ భూమి తమదే అంటూ ఆ రాజు వారసులు అక్కడికి వచ్చి అడుగుతారు. ఈ భూమిపై మీకు ఎలాంటి హక్కులు లేవని, మీ వంశస్తులదని, తమ భూమి తమకు ఇవ్వాలంటూ బెదిరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? రాజు వంశస్తులు ఆ భూమిని చేజిక్కించుకున్నారా.. లేదా.. ఇందులో హీరో ప్రమేయం ఎంటీ అనేవి మిగతా కథ.