తొలి చిత్రం విడుదల కాకముందే తన కుడి కాలుని కోల్పోయిన కన్నడ హీరో

కన్నడ సినీ పరిశ్రమని శోకసంద్రం లోకి ముంచేసిన వార్త ప్రముఖ నటుడు సూరజ్ కుమార్ కి బైక్ యాక్సిడెంట్ జరగడమే. తీవ్రమైన గాయాలపాలైన సూరజ్ కుమార్ ని ఆసుపత్రికి తీసుకొని పోగా, అక్కడి వైద్యులు సూరజ్ కుమార్ కుడి కాలుని తొలగించేసారు. అతని మొదటి చిత్రం ‘రథం’  మరో కొద్దిరోజుల్లో విడుదల అవ్వబోతుంది. ఇంతలోపే ఆయనకీ ఇలాంటి ఘోరమైన ప్రమాదం జరగడం శోచనీయం. ఈ చిత్రంలో వింకిల్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించింది. […]

Share:

కన్నడ సినీ పరిశ్రమని శోకసంద్రం లోకి ముంచేసిన వార్త ప్రముఖ నటుడు సూరజ్ కుమార్ కి బైక్ యాక్సిడెంట్ జరగడమే. తీవ్రమైన గాయాలపాలైన సూరజ్ కుమార్ ని ఆసుపత్రికి తీసుకొని పోగా, అక్కడి వైద్యులు సూరజ్ కుమార్ కుడి కాలుని తొలగించేసారు. అతని మొదటి చిత్రం ‘రథం’  మరో కొద్దిరోజుల్లో విడుదల అవ్వబోతుంది. ఇంతలోపే ఆయనకీ ఇలాంటి ఘోరమైన ప్రమాదం జరగడం శోచనీయం. ఈ చిత్రంలో వింకిల్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ సినీ నిర్మాత ఎస్ ఏ శ్రీనివాస్ కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సూరజ్ కుమార్ ని ‘ధృవన్’ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. సూరజ్ కుమార్ హీరో గా మారే ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా కొన్ని సినిమాలకు పనిచేసాడు. ‘తారక్’ మరియు ‘ఐరావత’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు కూడా ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు అనే విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.

హీరో అవ్వడానికి ఎన్నో లక్షణాలు ఉన్న సూరజ్ కుమార్ భారీ ఆశలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాలని అనుకున్నాడు, కానీ ఇంతలోపే ఈ ఘోరం జరిగిపోయింది. సూరజ్ కుమార్ వయస్సు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే, అతని తండ్రి కన్నడ సినీ పరిశ్రమకి ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించాడు. ఎంతో మంది సూపర్ స్టార్స్ తో సినిమాలు చేసాడు, తన కొడుకుని కూడా సూపర్ స్టార్ ని చెయ్యాలని అనుకున్నాడు, పాపం అతని ఆశలన్నీ ఆవిరైపోయాయి. రెప్పపాటు సమయం లో జరిగిన పెను ప్రమాదం వల్ల ఇంత చిన్న వయస్సులోనే తన కుడి కాలుని తీసివెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే:

శనివారం రోజు సూరజ్ కుమార్ మైసూర్ నుండి ఊటీ కి వెళ్తున్న సమయం లో రోడ్డు మీద వెళ్తున్న ట్రాక్టర్ ని ఓవర్ టెక్ చెయ్యాలనే ఉద్దేశ్యం తో మితిమీరిన వేగంగా దూసుకెళ్లాడు. స్పీడ్ అదుపుతప్పింది, ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ కి గుద్దేసాడు. దీనితో చుట్టుపక్కన ఉన్నవాళ్లు వెంటనే సూరజ్ కుమార్ ని సమీపం లో ఉన్న మణిపాల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కుడి కాలు బాగా దెబ్బతినడం తో అది తప్పనిసరిగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ తొలగించకపోతే సూరజ్ కుమార్ ప్రాణాలకే ప్రమాదం. ప్రస్తుతం సూరజ్ కుమార్ అక్కడే చికిత్స పొందుతూ ఉన్నాడు.

ఇక సూరజ్ కుమార్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు కన్నడ సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ నటీనటులందరూ మణిపాల్ ఆసుపత్రికి చేరుకొని సూరజ్ కుమార్ ని పరామర్శిస్తున్నారు. వారిలో ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరియు ఆయన సతీమణి గీత కూడా ఉన్నారు. సూరజ్ కుమార్ శివ రాజ్ కుమార్ కి బంధువు అవుతాడు. శివరాజ్ కుమార్ తల్లి పార్వతమ్మ కి సూరజ్ కుమార్ మేనల్లుడి వరుస అవుతాడు. చిన్న వయస్సులోనే సూరజ్ కుమార్ ని ఇలాంటి పరిస్థితి లో చూసినందుకు శివ రాజ్ కుమార్ పడిన బాధ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఆయన తన సొంత తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ మరణం ని జీర్ణించుకోలేకపోతున్నాడు, ఇంతలోపే ఈ సంఘటన జరగడం బాధాకరం. సూరజ్ కుమార్ తొందరగా కోలుకొని సురక్షితంగా బయటకి రావాలని కోరుకుందాము.