ర‌ణ్‌బీర్ క‌పూర్ గురించి కంగనా రనౌత్ షాకింగ్ వ్యాఖ్య‌లు

కంగనా రనౌత్ వాక్యాలు ప్రస్తుతం బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. రణ్‌బీర్ కపూర్‌ గురించి మాట్లాడుతూ, అలియాతో తన వివాహం నకిలీదని, అంతేకాకుండా వారికి పుట్టిన పాప కేవలం ప్రమోషనల్ స్టంట్ మాత్రమేనని అతను తనతో చెప్పినట్లు వెల్లడించింది కంగనా. ఆమె తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ గురించి కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వాళ్ళు మనుషులే కాదు అంటు కంగనా:  బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన ఆలోచనల గురించి, బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే రాజకీయాల […]

Share:

కంగనా రనౌత్ వాక్యాలు ప్రస్తుతం బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. రణ్‌బీర్ కపూర్‌ గురించి మాట్లాడుతూ, అలియాతో తన వివాహం నకిలీదని, అంతేకాకుండా వారికి పుట్టిన పాప కేవలం ప్రమోషనల్ స్టంట్ మాత్రమేనని అతను తనతో చెప్పినట్లు వెల్లడించింది కంగనా. ఆమె తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ గురించి కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

వాళ్ళు మనుషులే కాదు అంటు కంగనా: 

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన ఆలోచనల గురించి, బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే రాజకీయాల గురించి ఎప్పుడూ చెబుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక వ్యక్తి తన ఆన్‌లైన్ మేనేజర్‌గా నటిస్తూ ఇతరులను మోసగిస్తున్నాడని, అంతే కాకుండా తన అకౌంట్ ను హ్యాక్ చేస్తున్నాడని వార్తలు వచ్చిన తర్వాత, ఆమె ఇటీవల హృతిక్ రోషన్‌ గురించి మాట్లాడుతూ స్పందించడం జరిగింది. 

హృతిక్‌గా నటించిన వ్యక్తి తనను ఎలా మోసగించాడో ఆమె ప్రస్తుతం బయట పెట్టింది. అంతేకాకుండా ఆమె రణబీర్ కపూర్ గురించి కూడా మాట్లాడుతూ, అతనితో డేటింగ్ చేయమని అతను తన వెంటపడ్డాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ అలాగే ఆలియా భట్ పెళ్లి ఫేక్ అని, తన పాప కేవలం పబ్లిసిటీ స్టంట్ అని అతను తనతో చెప్పాడని కూడా ఆమె పేర్కొంది. 

కనగా రనౌత్ రణబీర్ కపూర్‌ను ఉద్దేశించి, అతనిపై కొన్ని షాకింగ్ ఆరోపణలు చేసింది. ఆమె అతని పెళ్లిని మరియు కుమార్తె గురించి కూడా, ఆమె చేసిన పోస్టులో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. Womaniser అని తెలిసిన మరొక సూపర్ స్టార్, తన ఇంటికి వచ్చి తనితో డేటింగ్ చేయమని వేడుకున్నాడని, అంతేకాకుండా తన వెంట పడుతూ రహస్యంగా కలుస్తూనే ఉన్నాడు అని పేర్కొంది. ఇలాంటి నీచమైన పని ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు, అతను ‘ఒక నా ముద్దుల కూతురు’తో డేటింగ్ చేయడం తనకి ఇష్టం లేదని.. అసలు తను ఆ అమ్మాయిని ప్రేమించలేదని, తనని కావాలని ఫోర్స్ చేశారని హీరో గారు తనతో చెప్పినట్లు కంగనా వెల్లడించింది. 

అయితే అతను పదేపదే వేరే వేరే నెంబర్లతో కాల్ చేయడం ప్రారంభించినట్లు, బ్లాక్ చేసినప్పటికీ ఏదో ఒక రకంగా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించినట్లు చెప్పింది. అంతేకాకుండా, తన డివైసెస్ అన్ని కూడా హ్యాక్ చేశాడని హీరోయిన్ కంగనా వాపోయింది. అయితే తను తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పినప్పుడు నిజానికి కంగనా ఆశ్చర్యపోయినట్లు, అసలు ప్రమోషన్ గురించి ఇంత నీచమైన పనులకు దిగిజారే వాళ్ళు మనుషులే కాదు అని రాక్షసులని మాట్లాడింది. అందుకే వారిని నాశనం చేయాలని తను నిశ్చయించుకున్నాని, ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అధర్మాన్ని నాశనం చేయడమే అని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది.

హృతిక్ రోషన్ గా నటించిన వ్యక్తి పై కంగనా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసింది. తన ఇతర ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్లో, హృతిక్ రోషన్‌గా నటించిన వ్యక్తి తనను ఎలా మోసం చేశాడో కూడా మాట్లాడింది. 

కంగనా రాబోయే సినిమాలు: 

కంగనా రనౌత్ రాఘవ లారెన్స్‌తో కలిసి నటించిన తన రాబోయే చిత్రం చంద్రముఖి 2 కోసం సిద్ధంగా ఉంది. రజనీకాంత్, జ్యోతిక జంటగా తమిళంలో హిట్టయిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ ఏడాది సెప్టెంబర్ 19న థియేటర్లలోకి రానుంది. కంగనా తన మూవీ లిస్ట్ లో, సర్వేష్ మేవారా దొరకెక్కించనున్న తేజస్, అంతేకాకుండా ఎమర్జెన్సీ మూవీస్ కూడా ఉన్నాయి.