చంద్రముఖిగా కంగనా రనౌత్‌ ఫస్ట్ లుక్ వచ్చేసింది 

చంద్రముఖి సినిమా సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు. ఒకప్పుడు చంద్రముఖి సినిమా చూసేందుకు సినీ ప్రేక్షకులు బారులు తీరారు. చంద్రముఖి క్యారెక్టర్ లో నటించిన జ్యోతిక, రాజు గారి గతంలో రజనీకాంత్ వంటి సినీ తారలు తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. అటువంటి చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వచ్చేసింది. ముఖ్యంగా ఇందులో రాజు పాత్ర లో నటిస్తున్న లారెన్స్ ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులని ఎంతో ఆకర్షితులను చేస్తుంది. ఈ సినిమా మీద అంచనాలను అమాంతం […]

Share:

చంద్రముఖి సినిమా సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు. ఒకప్పుడు చంద్రముఖి సినిమా చూసేందుకు సినీ ప్రేక్షకులు బారులు తీరారు. చంద్రముఖి క్యారెక్టర్ లో నటించిన జ్యోతిక, రాజు గారి గతంలో రజనీకాంత్ వంటి సినీ తారలు తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. అటువంటి చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వచ్చేసింది. ముఖ్యంగా ఇందులో రాజు పాత్ర లో నటిస్తున్న లారెన్స్ ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులని ఎంతో ఆకర్షితులను చేస్తుంది. ఈ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. అప్పటినుంచి రాణి పాత్ర పోషిస్తున్న కంగనా రనౌత్‌ ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి చూశారు. రోజు రానే వచ్చింది… ఆగస్టు 5 ఉదయం 11 గంటలకు చంద్రముఖి-2 లో రాణి పాత్రలో నటిస్తున్న కంగనా రనౌత్‌ ఫస్ట్ లుక్ వచ్చేసింది.

కంగనా రనౌత్‌ ఫస్ట్ లుక్:

నటి కంగనా రనౌత్‌కి సంబంధించిన ‘చంద్రముఖి 2’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్.

పి వాసు తెరకెక్కించిన ప్రముఖ హారర్ కామెడీ చంద్రముఖి సినిమా సీక్వెల్ వచ్చేసింది. చంద్రముఖిగా కంగనా రనౌత్‌ ఫస్ట్‌లుక్‌ని శనివారం విడుదల చేశారు మేకర్స్. దీనికి ముందు మేకర్స్ మరో రెండు పోస్టర్‌లను విడుదల చేశారు, మొదటిది సినిమా పోస్టర్ రెండవది, నటుడు లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్.

శుక్రవారం, లైకా ప్రొడక్షన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ కంగనా రనౌత్ వీడియోతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి కట్టే పడేసింది. ఫ్యాషన్లో సోనాలి, రాణిలో రాణి, తను వెడ్స్ మనులో తనూ, రాజ్ 3లో మండిత మరియు చంద్రముఖి 2లో చంద్రముఖి పాత్రలో నటించిన కంగనా ఫస్ట్ లుక్ అందరినీ మెప్పించింది. ముఖ్యంగా ఆమెకు సంబంధించిన వీడియో అందరినీ ఆకర్షించిందని చెప్పాలి. వీడియోలో మొత్తం కంగనా నటించిన సినిమాల యొక్క ప్రాముఖ్యతను చూపిస్తూ, ఆమె ప్రతి సినిమాలోని తన నటనతో ఎంతగా అలరించిందో చూపురులకు కళ్ళకు కట్టినట్టు చూపించారు.

కంగనా చంద్రముఖిగా వీడియోలో కనిపిస్తూ ఉంటే, దాని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో వినిపిస్తున్న గజ్జల చప్పుడు మరింత హంగుని తీసుకువచ్చింది. ఎట్టకేలకు మేకర్స్ శనివారం అంటే ఆగస్టు 5న ఉదయం 11 గంటలకు ఆమె లుక్‌ని ఆవిష్కరించారు. పోస్టర్‌లో, కంగనా గోల్డెన్ ఎంబ్రాయిడరీతో కూడిన గ్రీన్ కలర్ చీరలో కనిపిస్తోంది. ఆమె ఒక ప్యాలెస్ లోపల నుంచుని గంభీరంగా దూరంగా చూస్తోంది. ఆమె బంగారు నగలతో చాలా అందంగా రాని పాత్రలో ముస్తాబై కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చంద్రముఖి 2 లో కనిపించిన కంగనా ఫస్ట్ లుక్ చూసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఆమె ఆకర్షణీయమైన కళ్ళు చూసే అందరూ మంత్రముగ్ధులయ్యారు. నిజంగా ఆమె ఒక దేవకన్యలా కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా విడుదల గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం వినాయక చవితికి చంద్రముఖి-2 రిలీజ్ కానుందని ఇప్పటికే విడుదల డేట్ కూడా వచ్చేసింది అని చెప్పుకోవాలి.

పి వాసు దర్శకత్వం వహించిన చద్రముఖి 2, రజనీకాంత్ మరియు జ్యోతిక కీలక పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ చంద్రముఖి యొక్క సీక్వెల్. చంద్రముఖి 2 లో కంగనా తన అందం మరియు నృత్య నైపుణ్యాలకు పేరుగాంచిన డ్యాన్సర్ ఛనాద్రముఖి పాత్రను పోషిస్తుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా ఐదు భాషల్లో ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది.