కంగనా రనౌత్ సినిమాల్లో కేవలం డ్యాన్స్ చేసేసి, మగాళ్ళతో చెంపదెబ్బలు తినే మూస పాత్రలలో నటించే ఆషామాషీ హీరోయిన్ కాదు: ఆర్ మాధవన్

కంగనా రనౌత్ ‘మూస పాత్రల హీరోయిన్ కాదు’ అని, మగాళ్ల చేత చెంపదెబ్బలు తిని వెళ్లిపోయే తరహా నటి కాదని మాధవన్ అన్నారు. తను వెడ్స్ మనులోను, దాని సీక్వెల్‌లో ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆర్ మాధవన్ కంగనా రనౌత్‌తో రెండుసార్లు పనిచేశాడు. వీరిద్దరూ 2011లో తను వెడ్స్ మనులో వీరిద్దరు చక్కగా జోడీ కట్టి, మంచి విజయాన్ని అందించారు, ఆ తర్వాత మరోసారి 2015లో తను వెడ్స్ మను రిటర్న్స్‌తో మంచి విజయాన్ని చవిచూశారు. ఇటీవలి […]

Share:

కంగనా రనౌత్ ‘మూస పాత్రల హీరోయిన్ కాదు’ అని, మగాళ్ల చేత చెంపదెబ్బలు తిని వెళ్లిపోయే తరహా నటి కాదని మాధవన్ అన్నారు. తను వెడ్స్ మనులోను, దాని సీక్వెల్‌లో ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆర్ మాధవన్ కంగనా రనౌత్‌తో రెండుసార్లు పనిచేశాడు. వీరిద్దరూ 2011లో తను వెడ్స్ మనులో వీరిద్దరు చక్కగా జోడీ కట్టి, మంచి విజయాన్ని అందించారు, ఆ తర్వాత మరోసారి 2015లో తను వెడ్స్ మను రిటర్న్స్‌తో మంచి విజయాన్ని చవిచూశారు. ఇటీవలి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, మాధవన్ తన జీవితంలోని బలమైన మహిళల గురించి మాట్లాడుతూ, ఆ కోవకే చెందిన బలమైన మహిళగా కంగనాను గుర్తుకు తెచ్చుకొని ఆమెను ప్రశంసించాడు. తాము నటించే పాత్రల కోసం ఆడిషన్ అవసరం లేదని భావించే వారిపై స్పందిస్తూ, తను అందుకు విరుద్ధమని, తను నటించే పాత్రల కోసం ఆడిషన్ కోరి చేస్తానని చెప్పారు.

మాధవన్ 2022 దర్శకత్వం వహించిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌కి వచ్చిన విమర్శకుల ప్రశంసలను హాయిగా ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో ఎన్నో హిందీ, తమిళ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

రోహన్ దువా ఒక ఇంటర్వ్యూలో, మాధవన్ కంగనాతో కలిసి పనిచేయడం గురించి మరియు ఆమె కూడా ‘ఫైటర్’ అవడం వల్ల ఆమె విజయాన్ని మాధవన్ ఎలా చూశారో అని అడిగారు. మాధవన్ మాట్లాడుతూ, “నా సినిమాలన్నిటిలోనూ ప్రధాన పాత్రలు పోషించిన మహిళలను మీరు గమనించినట్లయితే, వారు ఎంతో బలమైన వ్యక్తితం గలవారనే విషయం మీకు అవగతం అవుతుంది. నేను చాలా అదృష్టవంతుడిని, ఎందుకంటే మా ఇంట్లోనే చాలా మంచి వ్యక్తిత్వం గల మహిళల మధ్యలో నేను పెరిగాను. మా అమ్మ 30 ఏళ్లుగా బీహార్ లో ఒక బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్నారు. కాబట్టి మీరు మహిళలు ఎంత మనోబలంతో ఉంటారో గమనిచవచ్చు. నేను వారిని ఒక బలమైన జాతిగా జమకడతాను. వారు చాలా ఏళ్లపాటు ఇలానే మనగలుగుతారు. మీరు మీ తాత ముత్తాతలను గమనించినట్లయితే, ఈ రోజు మీ తాత ముత్తాతలు అందరికంటే ఎక్కువగా మీ అమ్మమ్మల మీదనే ఆధారపడతారని నేను ఘంటాపధంగా చెప్పగలను. ఇది పురుషులందరూ అంగీకరించవలసిన ఒక సార్వత్రిక సత్యం.

కంగనా రనౌత్ గురించి మాట్లాడుతూ, “కంగనా లేదా షాలిని వంటి వారితో కలిసి పని చేయడమే కాక మానసికంగా బలమైన మహిళలందరితో కలిసి పని చేసే అదృష్టం నాకు కలిగింది, వారంతా తమవైన స్వంత ఇష్టాలు కలిగినవారు. వాళ్ళందరూ ఆషామాషీ నటీమణులు కారు. వారు ఒకట్రెండు సినిమాల్లో వచ్చి డ్యాన్స్ చేసి, ఎవరో ఒకరి చేతిలో చెంపదెబ్బ తిని వెళ్లిపోయే తరహా మూస పాత్రల హీరోయిన్లు కారు. ఇలాంటి సినిమాలు నా జీవితంలో ఇప్పటివరకు చేయాలనుకున్నవి లేదా చేస్తాననుకున్న సినిమాలు కావు. అలాంటి కథలను ఇష్టపడేవారిని, ఈనాటి ప్రపంచం నిజంగా మూర్ఖులుగా జమకడతాను. కానీ వారి వ్యక్తిగత విజయాలతో పాటు వారికున్న అనుభవం ఇంకా వారి అద్భుతమైన నటనా పటిమ కారణంగా వారు తెరపైన చూపించే ఆ మనోబలాన్ని గుర్తించడం ఎంతో ముఖ్యం. కంగన ఒక అద్భుతమైన ప్రతిభగల నటి. ఆమె ఎంతో తెలివైనది. తను చేసే పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసే ఆమె, నిజంగా ఒక అసాధారణ నటీమణి. అంతేకాదు, ఈ రోజుల్లో ఆమె నటించే అన్ని రకాల చిత్రాలలో ఎలా రాణిస్తుందో చూడండి, ఆమె పనితనం చూసి నేను చాలా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను.

మాధవన్ తన రాబోయే సరికొత్త షో, ది రైల్వే మెన్‌లో కనిపించనున్నారు. ఇది భోపాల్ గ్యాస్ దుర్ఘటన స్పూర్తితో రూపొందింది మరియు బాబిల్ ఖాన్, కే కే మీనన్ ఇంకా దివ్యేందు శర్మ కూడా ఇందులో నటించారు. అతని చేతిలో ప్రస్తుతం కొన్ని హిందీ ఇంకా తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి, వాటిలో రెండు బయోపిక్‌లు అని తెలుస్తోంది.