చంద్రముఖి 2 ప్రత్యేకతల గురించి చెప్పిన కంగనా 

చంద్రముఖి సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమైనప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే, అయితే బాలీవుడ్ తార కంగనా చంద్రముఖి 2 లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తోంది. చంద్రముఖి 1 సినిమాలో జ్యోతిక క్యారెక్టర్ లో ఇమిడిపోయేందుకు ప్రత్యేకమైన సన్నాహాలు చేసిందని చెప్పుకొచ్చింది.  చంద్రముఖి సినిమా సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు. ఒకప్పుడు చంద్రముఖి సినిమా చూసేందుకు సినీ ప్రేక్షకులు బారులు తీరారు. చంద్రముఖి క్యారెక్టర్ […]

Share:

చంద్రముఖి సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమైనప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే, అయితే బాలీవుడ్ తార కంగనా చంద్రముఖి 2 లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తోంది. చంద్రముఖి 1 సినిమాలో జ్యోతిక క్యారెక్టర్ లో ఇమిడిపోయేందుకు ప్రత్యేకమైన సన్నాహాలు చేసిందని చెప్పుకొచ్చింది. 

చంద్రముఖి సినిమా సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు. ఒకప్పుడు చంద్రముఖి సినిమా చూసేందుకు సినీ ప్రేక్షకులు బారులు తీరారు. చంద్రముఖి క్యారెక్టర్ లో నటించిన జ్యోతిక, రాజు గారి పాత్రలో నటించిన రజనీకాంత్ వంటి సినీ తారలు తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. అటువంటి చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వచ్చేసింది. ముఖ్యంగా ఇందులో రాజు పాత్ర లో నటిస్తున్న లారెన్స్ లుక్, రాణి పాత్రలో నటించిన కంగనా లుక్ ఇప్పటికే ప్రేక్షకులని ఎంతో ఆకర్షితులను చేస్తుంది. ఈ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. 

విశేషాలు చెప్పిన కంగనా: 

బాలీవుడ్ నటి కంగనా, చంద్రముఖి 2 లో చంద్రముఖిగా కనిపించబోతోంది. నిజానికి కొన్ని చిత్ర పాత్రలు ప్రత్యేకించి చాలామంది మదిలో నిలిచిపోతాయి. అదే విధంగా కంగానాకు జ్యోతిక క్యారెక్టర్ చంద్రముఖి పాత్ర కోసం మాట్లాడినప్పుడు, తాను కొద్దిసేపు ఆలోచించానని చెప్పుకొచ్చింది నటి. అయితే డైరెక్టర్ పి వాసు కారణంగా తను జ్యోతిక ప్లేస్ లో చంద్రముఖి క్యారెక్టర్ నటించేందుకు సిద్ధమైనట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా డైరెక్టర్ ద్వారా తన క్యారెక్టర్ లో నటించేందుకు చాలా బాగా సహాయపడిందని, తన ప్లేస్ లో ఇంకెవరైనా సరే అదే ఫీల్ అవుతారని మాట్లాడింది కంగనా. 

ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన కంగనా, తాను చంద్రముఖి సినిమాను రెండుసార్లు చూశానని, ప్రత్యేకించి అందులో క్యారెక్టర్స్ లో ఇమిడేందుకు తనకి సహాయం చేసింది ఆ సినిమా అంటూ చెప్పింది. అదే విధంగా ఇప్పుడు రాబోతున్న చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 కూడా అదిరిపోయే హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ అందించబోతున్నట్లు, తప్పకుండా ఒక మంచి ఎంటర్టైనర్ అవుతుందని సినిమా గురించి ప్రత్యేకించి మాట్లాడింది కంగనా. అంతేకాకుండా, సౌత్, నార్త్ అనే తేడా కారణంగా సినిమా అనేది అందరినీ అలరించకపోతోందని.. కాబట్టి అటువంటి తేడాలు ఏమి పెట్టుకోకుండా కేవలం డైరెక్షన్ పరంగా చూసుకుంటే ప్రతి సినిమా చూడదగ్గతే అని మరోసారి గుర్తు చేసింది బాలీవుడ్ నటి కంగనా. 

తాను హైదరాబాదులో ప్రమోషన్ చేసేందుకు వచ్చినప్పుడు తనకి రాజకీయపరంగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు, అయితే తాను రాజకీయానికి సంబంధించి ప్రశ్నలను పట్టించుకోకుండా, కేవలం సినిమా గురించి ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా తాను సినిమాలో భయంకరంగా కనిపిస్తోందని, తన అరుపులతో మొదటిగా ప్రేక్షకులను భయపెట్టే సంఘటనలు కనిపిస్తాయని, ఇక సెకండ్ హాఫ్ లో తన అద్భుతమైన ప్రదర్శన అందర్నీ అలరిస్తుందని మాట్లాడింది. అయితే ఇది తప్పకుండా తన కెరీర్లో ఒక బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఆశించింది నటి. 

వాయిదా పడిన చంద్రముఖి 2 రిలీజ్: 

ఇప్పటికే ట్రైలర్ తో ప్రేక్షకుల మనసులను ఎంతో అలరింపచేసి, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేసిన చంద్రముఖి 2 సెప్టెంబర్ 15వ తారీఖున రిలీజ్ కు సిద్ధంగా ఉండగా, రిలీజ్ డేట్ వాయిదా పడింది అనే వార్త బయటపడింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగానే, సినిమా రిలీజ్ సెప్టెంబర్ 28కి వాయిదాపడినట్లు సినిమా బృందం వెల్లడించింది. అయితే చంద్రముఖి 2 సినిమా చూడాలి అనుకుంటే కచ్చితంగా మరో 3 రోజులు ఆగాల్సిందే.