షోలే న‌చ్చ‌లేదంటున్న క‌మ‌ల్ హాస‌న్

ఇంతకీ ప్రాజెక్ట్క కే అంటే “కల్కి”, కల్కి గా రాబోతున్న ప్రభాస్. కల్కి 2898 AD సినిమా ప్రాజెక్ట్ కే అనే దాని మీద ఆధారపడి ఉంది. అయితే ఈ సినిమా టీజర్ 2023లో శాన్ డియాగో లో జరిగిన కామిక్-కాన్ (SDCC)లో విడుదల చేశారు. ఇసి భారతదేశ సినిమాకి, ముఖ్యంగా మన తెలుగు సినిమాకి దక్కిన అరుదైన గౌరవం. ఇందులో భారత దేశం గర్వించే సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హస్సన్ కూడా ఉండటం […]

Share:

ఇంతకీ ప్రాజెక్ట్క కే అంటే “కల్కి”, కల్కి గా రాబోతున్న ప్రభాస్. కల్కి 2898 AD సినిమా ప్రాజెక్ట్ కే అనే దాని మీద ఆధారపడి ఉంది. అయితే ఈ సినిమా టీజర్ 2023లో శాన్ డియాగో లో జరిగిన కామిక్-కాన్ (SDCC)లో విడుదల చేశారు. ఇసి భారతదేశ సినిమాకి, ముఖ్యంగా మన తెలుగు సినిమాకి దక్కిన అరుదైన గౌరవం. ఇందులో భారత దేశం గర్వించే సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హస్సన్ కూడా ఉండటం విశేషం. శాన్ డియాగో కామిక్-కాన్‌లో కల్కి 2898 AD టీజర్ లాంచ్ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ ఒకరి పని గురించి ఒకరు మాట్లాడారు. అయితే ఈ కామిక్ కాన్ వేదిక పై కమల్ అన్న కొన్ని మాటలు ఆసక్తి రేపుతున్నాయి. 

ఈర్షపడి పొగడలేనంత ద్వేషం: 

ఇప్పుడు ప్రభాస్ మరియు రానా దగ్గుబాటి యుఎస్ లో కమల్ హాసన్‌తో పాటు శాన్ డియాగో కామిక్-కాన్‌కు హాజరవుతున్నారు. ఈవెంట్ సందర్భంగా, ప్రాజెక్ట్ కె మేకర్స్ చిత్రానికి సంబంధించి మొదటి స్నీక్ పీక్‌ను విడుదల చేశారు, సినిమా పేరు కల్కి 2898 AD అని  పెట్టారు. ఈ వేదికపై వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయిన అమితాబ్ బచ్చన్ వీడియో కాల్ ద్వారా ఈవెంట్‌లో చేరారు. అమితాబ్ బచ్చన్‌ను ప్రశంసిస్తూ, కమల్ హాసన్, “అమిత్జీ ఎనర్జీతో సమానంగా.. నేను కూడా వారితో కలవడం నాకు చాలా గౌరవంగా ఉంది.” దీనికి అమితాబ్, “అంత నిరాడంబరంగా ఉండటం మానేయండి, కమల్. మీరు మా అందరి కంటే చాలా గొప్పవారు” అని సరదాగా అన్నారు. 

మెగాస్టార్ మాట్లాడుతూ,“తన ప్రతి చిత్రం వాస్తవికతతో దగ్గరగా ఉంటుంది. ఒక్కో సినిమాకి చాలా ఎఫర్ట్ పెడతాడు. ఆయన పోషించిన పాత్రలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయనతో కలిసి ఒకే సినిమాలో నటించడం విశేషం. మేమిద్దరం కలిసి రెండు సినిమాలు చేశాం కానీ ఇది చాలా స్పెషల్‌గా ఉంటుంది’’ అన్నారు అమితాబ్. కమల్ హాసన్, అప్పుడు చిన్నగా చమత్కరిస్తూ, “నేను షోలేకి అసిస్టెంట్ డైరెక్టర్‌ని. నేను సినిమాని చాలా అసహ్యించుకున్నాను. నేను సినిమా చూసిన రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నేను ఆ చిత్ర నిర్మాతను మరింత అసహ్యించుకున్నాను. నాకు ఒక గొప్ప చిత్రనిర్మాతతో పనిచేసే అవకాశం వచ్చింది, అందులో అమితాబ్ గొప్ప నటనకి ఆ సినిమాని అసహ్యించుకునే అంత ఈర్షణ నాలో పుట్టింది. నిజంగా చెప్పాలంటే టెక్నీషియన్‌గా, ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు, తరువాత అమిత్‌జీ అలాంటి గొప్ప సినిమాలు చాలా చేశారు. ఈరోజు ఆయన నా సినిమాల గురించి మంచి మాటలు చెప్పడం నేను ఊహించని విషయం” అంటూ కమల్ అమితాబచ్చన్ని పొగిడేసారు.

మైథాలజీ పై ఆధారపడిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్: 

చరిత్ర సృష్టిస్తూ, ప్రాజెక్ట్ K 2023లో శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC)లో ప్రారంభమైన మొట్టమొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈవెంట్‌కు ముందు, న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రాజెక్ట్ K కోసం ఒక బిల్‌బోర్డ్, “జూలై 20న మొదటి గ్లింప్సె” అనే సందేశంతో ప్రేక్షకులను ఆకర్షించింది. ముందుగా ప్రభాస్ ఫస్ట్ లుక్ రివీల్ అయింది. మైథాలజీ పై ఆధారపడిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్గా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్యానల్ డిస్కషన్‌లో ప్రభాస్, రానా దగ్గుబాటితో పాటు కమల్ హాసన్, దీపికా పదుకొణె, నాగ్ అశ్విన్ పాల్గొంటారు.