కమల్ హాసన్ సినీ కెరీర్ కు 64 సంవత్సరాలు

కమల్ హాసన్, భారతీయ సినిమా లెజెండరీ ఫిగర్, సినీ రంగంలో 64 సంవత్సరాలను పూర్తి చేస్తూ, ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. తన అసమానమైన ప్రతిభ, క్రాఫ్ట్ పట్ల అంకితభావం, దిగ్గజ నటుడు తరాల నటులు మరియు చిత్రనిర్మాతలకు ప్రేరణగా నిలిచాడు. కళత్తూర్ కనమ్మ (1960)తో బాలనటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన కళాకారుడు కమల్ హాసన్, చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.  స్ఫూర్తినిచ్చిన కమల్ హాసన్:  ప్రముఖ నటుడు కమల్ హాసన్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. […]

Share:

కమల్ హాసన్, భారతీయ సినిమా లెజెండరీ ఫిగర్, సినీ రంగంలో 64 సంవత్సరాలను పూర్తి చేస్తూ, ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. తన అసమానమైన ప్రతిభ, క్రాఫ్ట్ పట్ల అంకితభావం, దిగ్గజ నటుడు తరాల నటులు మరియు చిత్రనిర్మాతలకు ప్రేరణగా నిలిచాడు. కళత్తూర్ కనమ్మ (1960)తో బాలనటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన కళాకారుడు కమల్ హాసన్, చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. 

స్ఫూర్తినిచ్చిన కమల్ హాసన్: 

ప్రముఖ నటుడు కమల్ హాసన్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. బహుముఖ పాత్రలను ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న హీరో కమల్ హాసన్. సినీ ప్రపంచంలో ఎందరో యువ నటులకు కమల్ హాసన్ స్ఫూర్తి. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ వరకు 64 ఏళ్ల సినీ పరిశ్రమలో ఆయన చేసిన ప్రయాణం అపురూపం. ఆరు భారతీయ భాషలలో 232 చిత్రాలతో 64 సంవత్సరాల పాటు విశేషమైన మరియు విశిష్టమైన కెరీర్‌ ఎంతో మంది యువ నటులకు స్ఫూర్తి. ఆయన చేసిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ఆయన నటించిన మరోచరిత్ర, సాగర సంగమం, స్వాతిముత్యం, వంటి తెలుగు సినిమాలో నటించిన ఆయనకి ప్రత్యేక ఆదర అభిమానాలను తెచ్చిపెట్టాయి. 

విక్రమ్ సినిమాతో పరిశ్రమను కొత్త స్థాయికి తీసుకెళ్లాడు. కమల్ హాసన్ 1992లో తన చిత్రం తేవర్ మగన్‌తో భారతదేశపు మొట్టమొదటి ఆస్కార్ ఎంట్రీని ప్రదర్శించడం ద్వారా భారతీయ సినిమాను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లాడు. అతని దర్శకత్వ వెంచర్ హే రామ్, అతని బ్యానర్‌లో తెరకెక్కింది, 2000లో ఆస్కార్‌ వేదికపై భారతదేశ అధికారిక ప్రవేశం అయ్యింది. భారతీయ సినిమాలో అత్యధిక సంఖ్యలో అకాడమీ అవార్డు అందుకుని ఉన్న ఏకైక నటుడు డాక్టర్ కమల్ హాసన్. 1985 మరియు 1987 మధ్య, అతని మూడు సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి అంటే ఆయన నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 

ఇటీవల కమల్ కు హాలీవుడ్ ఎంట్రీ సలహా ఇచ్చిన రెహ్మాన్: 

20 ఏళ్ల క్రితమే హాలీవుడ్ ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభించమని నటుడు కమల్ హాసన్‌ను కోరినట్లు మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ ఇటీవల వెల్లడించారు. సంగీత విద్వాంసుడు ఏఆర్ రెహమాన్ మరియు ప్రముఖ నటుడు-చిత్ర నిర్మాత కమల్ హాసన్ మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల హాసన్‌తో తన రిలేషన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు రెహమాన్. దాదాపు 20 ఏళ్ల క్రితమే హాలీవుడ్‌లోకి అడుగుపెట్టమని హాసన్‌కు తాను సలహా ఇచ్చానని రెహమాన్ వెల్లడించాడు.

భారతీయుడు-2తో మరోసారి అలరించనున్న కమల్ హాసన్: 

ఇప్పుడు, ఇండియన్ 2కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, కమల్ హాసన్ ఈ చిత్రంలో డిజిటల్‌గా డి-ఏజ్డ్‌గా కనిపించబోతున్నారు అని. దీనికి కారణం దర్శకుడు ఎస్ శంకర్ చేసిన ఓ ట్వీట్ జనాలను ఆలోచింపజేస్తోంది. ఈమధ్య సినిమాల్లో విఎఫ్ఎక్స్లు కొత్తేమి కాదు, శంకర్ గారి ట్వీట్‌ సాంకేతికత విషయానికి వస్తే, శంకర్ దృష్టి ఎంత పెద్దదైతే అంత మంచి ఫలితం వస్తుందని మనందరికీ తెలుసు, రోబో సినిమాలు తీసింది కూడా ఆయనే కదా,  మీకు గుర్తు ఉండే ఉంటుంది రజిని శివాజీ సినిమా లో ఓ పాటలో కూడా తెల్లగా కనిపించడానికి ఒక తెల్లమ్మాయి చర్మరంగుతో టెక్నాలజీ సాయం తో మార్పులు చేసి తెరపై చూపించారు.. అందువల్ల, ఆ ట్వీట్ లో “లోలా VFX LA వంటి అధునాతన సాంకేతికతను స్కాన్ చేస్తోంది” అని రాసే సరికి ఇండియన్ 2 కోసం కొత్త ప్రయోగాలు చేస్తున్నారేమో అనే సందేహం వస్తోంది. ఇలాగే మరిన్ని కొత్త కొత్త ప్రయోగాలతో కమల్ హాసన్ మరిన్ని చిత్రాలతో అందరి ముందుకు రావాలని కోరుకుందాం.