లీగల్ కాపీరైట్ నోటీస్ జారీ చేసిన కల్కీ టీం

కల్కీ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి, రీసెంట్గా చిత్ర యూనిట్ సినిమాకి సంభందించి లీగల్ కాపీరైట్ నోటీస్ జారీ చేశారు. ఎందుకంటే చాలామంది కూడా ఇటీవల కాలంలో కాపీరైట్స్ ఉల్లంఘన చేస్తున్న క్రమం కనిపిస్తుంది. అందుకే చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కల్కీ పై భారీ అంచనాలు ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా పేరు కల్కీ, ఈ సినిమాని నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నాడు, ఇందులో దీపికా పదుకొనే కథానాయక. రీసెంట్ గా ఈ […]

Share:

కల్కీ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి, రీసెంట్గా చిత్ర యూనిట్ సినిమాకి సంభందించి లీగల్ కాపీరైట్ నోటీస్ జారీ చేశారు. ఎందుకంటే చాలామంది కూడా ఇటీవల కాలంలో కాపీరైట్స్ ఉల్లంఘన చేస్తున్న క్రమం కనిపిస్తుంది. అందుకే చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కల్కీ పై భారీ అంచనాలు

ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా పేరు కల్కీ, ఈ సినిమాని నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నాడు, ఇందులో దీపికా పదుకొనే కథానాయక. రీసెంట్ గా ఈ సినిమా మేకర్స్ కాపీ రైట్ నోటీస్ జారీ చేశారు. దీని ప్రకారం ఈ సినిమా స్టిల్స్, సీన్స్, మ్యూజిక్, ఫుటేజ్ దేన్ని వాడినా కానీ లీగల్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి వాళ్ళు నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ ఇంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు. ఈ సినిమా క్లిప్స్ ని ఎవరు షేర్ చేసినా వాళ్లపై కేసులు పెడతామని వైజయంతి వారు హెచ్చరించారు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది వైజయంతి మూవీసే. వైజయంతి మూవీస్ పతాకంపై ఈ సినిమాను అశ్విని దత్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని థియేటర్లో ఎవరు షూట్ చేసినా వాళ్ల మీద కేసులు పెడతామని వైజయంతి వాళ్ళు హెచ్చరించారు.

కల్కీ సినిమా అప్డేట్స్

కల్కీ అనే సినిమా పూర్తిగా సైన్స్ ఫిక్షన్ సినిమా. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ప్రాజెక్టు కే. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబచ్చన్ లాంటి టాప్ స్టార్లు యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ని సాన్డిగో కామిక్ కాన్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తను ఇంతకుముందు వడా చెన్నై మూవీకి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాకు డైలాగులు సాయి మాధవ్ బుర్రా అందించాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుంది. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది.

ప్రభాస్ రాబోయే చిత్రాల పరిస్థితి ఏంటి?

ప్రభాస్ తదుపరిచిత్రం సలార్ పార్ట్ వన్ రిలీజ్ కి రెడీగా ఉంది. దీనికి కే జి ఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీళ్ళు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇది కాకుండా ప్రభాస్ రాజా డీలక్స్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. రాజా డీలక్స్ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రాజా డీలక్స్ సినిమా హారర్ జానర్ లో వస్తుంది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ ఇవి కాకుండా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో కూడా ఒక మూవీ చేస్తున్నాడు.

 సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం రణ్బీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అవ్వగానే ప్రభాస్ తో సినిమా మొదలవుతుంది. ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా సినిమా అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ మీదికి వెళుతుంది. ప్రభాస్ మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. రీసెంట్ గా ప్రభాస్ యూవీ క్రియేషన్స్ నిర్మించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ప్రభాస్ uv క్రియేషన్స్ లో కూడా రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలు చేయనున్నాడు.