Kajal: అందులో ట్రైనింగ్ తీసుకుంటున్న కాజల్

Kajal: చందమామ కాజల్ (Kajal) అగర్వాల్ పేరు తెలియని తెలుగు (Telugu) సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోలు (Star Heros), కుర్ర హీరోలు అనే తేడా లేకుండా ఈ చందమామ అందరితో యాక్ట్ (Acting) చేసింది. తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టుకుంది. అందుకోసమే అమ్మడుకి పెళ్లయినా(Marriage) కానీ అమ్మడు చేత యాక్ట్ చేయించేందుకు దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. కాజల్ (Kajal) కు పెళ్లయినా కానీ పిల్లాడు […]

Share:

Kajal: చందమామ కాజల్ (Kajal) అగర్వాల్ పేరు తెలియని తెలుగు (Telugu) సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోలు (Star Heros), కుర్ర హీరోలు అనే తేడా లేకుండా ఈ చందమామ అందరితో యాక్ట్ (Acting) చేసింది. తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టుకుంది. అందుకోసమే అమ్మడుకి పెళ్లయినా(Marriage) కానీ అమ్మడు చేత యాక్ట్ చేయించేందుకు దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. కాజల్ (Kajal) కు పెళ్లయినా కానీ పిల్లాడు పుట్టినా కానీ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ (Second Innings) మొదలు పెట్టిన కాజల్(Kajal) ఏం చక్కా హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. 

కాజల్ (Kajal) ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు గుడ్డిగా నమ్ముతారు. అందుకోసమే కాజల్ ను యాక్ట్ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కాజల్ కూడా తన బాబు కోసం కొన్ని రోజుల పాటు లైటింగ్ కు దూరంగా ఉన్నా కానీ ప్రస్తుతం కెమెరాలతో (Camera) టచ్ లోనే ఉంటుంది. కేవలం మూవీలు చేయడం మాత్రమే కాదు.. మూవీ ప్రమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొంటోంది. కొంత మంది హీరోయిన్లలా కాజల్ కండీషన్లు పెట్టడం లేదు. దర్శక నిర్మాతలకు ఏమి కావాలో అది చేసి పెడుతోంది. అందుకోసమే తాను ఇప్పుడు సీనియర్ హీరోలకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా మారింది. అంతే కాకుండా ఏవైనా చాలెంజింగ్ రోల్స్ వస్తే కూడా చేసేందుకు చందమామ కాజల్ (Kajal) సిద్ధంగా ఉంటోంది. 

కేసరితో గ్రాండ్ వెల్ కమ్

పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయిన కాజల్ (Kajal) భగవంత్ కేసరి సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. తన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా గ్రాండ్ గా చాటుకుంది. మొన్నటి వరకు టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉండేది. కానీ కాజల్ (Kajal) ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందో ఇక అప్పటి నుంచి సీనియర్ హీరోలకు హీరోయిన్ల (Heroines) కొరత లేకుండా అయిపోయింది. ఎటువంటి సీనియర్ హీరో అయినా కానీ అతడి పక్కన యాక్ట్ చేసేందుకు చందమామ కాజల్ బెస్ట్ ఆప్షన్ (Best Option) గా మన దర్శక నిర్మాతలకు కనబడుతోంది. అందుకోసమే ఈ బ్యూటీకి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 

పోలీస్ పాత్రలో..

చందమామ కాజల్ (Kajal) ప్రస్తుతం పోలీస్ పాత్రలో (Police Role) నటిస్తోంది. యువ దర్శకుడు శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ (Lady Oriented) మూవీ చేస్తోంది. గూఢచారి, మేజర్ వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన శశికిరణ్ తిక్కా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. శశి కిరణ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా అంటే అందులో ఏదో సమ్ థింగ్ స్పెషల్ ఉంటుంది.  అందుకోసమైనా ప్రేక్షకులు థియేటర్లకు (Theaters) క్యూ కడుతుంటారు. కాజల్ అగర్వాల్ ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో కనిపించనుందట. అందుకోసం ఇప్పటికే రియల్ లైఫ్ పోలీసులతో కాజల్ ఇంటరాక్ట్ అయిందని దర్శకుడు తెలిపారు. అంతే కాకుండా అమ్మడు ఒకదాంట్లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు దర్శకుడు ప్రకటించారు. 

అందులో శిక్షణ తీసుకుంటున్న చందమామ

శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం కాజల్ అగర్వాల్ ప్రత్యేకంగా MMA (మిక్ట్స్ మార్షల్ ఆర్ట్స్) లో శిక్షణ (Training) తీసుకుంటుందట. ఈ సినిమాలో తన రోల్ పవర్ ఫుల్ (Powerful) గా ఉండడంతో యాక్షన్ సీన్లు దండిగానే ఉంటాయని తెలుస్తోంది. అందుకోసమే అమ్మడు ఇందులో శిక్షణ తీసుకుంటున్నట్లు వినికిడి.  ఈ విషయాలను ఎవరో బయటి వారు వెల్లడించలేదు. స్వయాన ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న శశి కిరణ్ తిక్కానే ఈ విషయాలను వెల్లడించాడు. కాజల్ ముందే అందంతో అందర్నీ కట్టిపడేస్తుంది. ఇంకా అమ్మడు వీటిల్లో కూడా ట్రైనింగ్ తీసుకుంటే సినిమా హిట్ (Hit) అవడం పక్కా అని అంతా కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ మీద ఎటువంటి అపనమ్మకాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. 

హిట్ సినిమాల దర్శకుడే శశి.. 

శశి కిరణ్ తిక్కా యువ దర్శకుడే కానీ సినిమాలకు మాత్రం కొత్తేం కాదు. ఈ డైరెక్టర్ (Director) ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. గూఢచారి, మేజర్ వంటి సినిమాలను డైరెక్ట్ చేసి తన స్టఫ్ ఏంటో అందరికీ ప్రూవ్ (Proove) చేసుకున్నాడు. కనుక ఈ దర్శకుడి మూవీ రిజల్ట్ గురించి ఆలోచించాల్సిన పని లేకుండా నిశ్చింతంగా ఉండొచ్చు. అంతే కాకుండా ఈ మూవీ కాజల్ (Kajal) అగర్వాల్ ను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ రోల్ లో చూపిస్తున్నారు కాబట్టి మూవీ లవర్స్ కు పండగే అని చెప్పాలి.