Kajal Agarwal: కొత్త పాత్రలకు ఓటు వేస్తున్న కాజల్

తెలుగు సినీ ప్రేక్షకులకు కాజల్ (Kajal) అగర్వాల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. కాజల్ (Kajal) తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఎక్కువగా హీరోయిన్ (Heroine) ఓరియంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.  కొత్త పాత్రలకే తన ఓటు:  గ్లామ్ కాజల్ (Kajal) అగర్వాల్ తన కెరీర్‌లో ప్రస్తుతం వైవిద్య పాత్రలకే ఓటు […]

Share:

తెలుగు సినీ ప్రేక్షకులకు కాజల్ (Kajal) అగర్వాల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. కాజల్ (Kajal) తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఎక్కువగా హీరోయిన్ (Heroine) ఓరియంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

కొత్త పాత్రలకే తన ఓటు: 

గ్లామ్ కాజల్ (Kajal) అగర్వాల్ తన కెరీర్‌లో ప్రస్తుతం వైవిద్య పాత్రలకే ఓటు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నిర్మాత తిక్క మోహన్ ఇటీవల చెప్పిన ఒక హీరోయిన్ (Heroine) ఓరియంటెడ్ సినిమాకి ఓకే చెప్పేసినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సినిమాలో ఒక కొత్త పాత్రలో ప్రత్యేకంగా కనిపించేందుకు కాజల్ (Kajal) తన మేకోవర్ చేంజ్ చేసుకోబోతున్నట్లుగా, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ఆవేశంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

శ్రీకృష్ణుడు భార్య సత్యభామ పౌరాణిక కథ నుండి ప్రేరణ పొందిన ‘సత్యభామ’ టైటిల్‌ను జస్టిఫై చేస్తూ, సవాళ్లను ఎదుర్కోవటానికి ధైర్యంగా ఉండే నవతరం సత్యభామగా చిత్రీకరించబోతున్నాము అని చెప్పాడు నిర్మాత. వాస్తవానికి నవంబర్‌లో దీపావళి సందర్భంగా టీజర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కాజల్ (Kajal) అగర్వాల్ రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు వంటి సూపర్ స్టార్‌లతో నటించిన తర్వాత ఇప్పుడు హీరోయిన్ (Heroine) ఓరియంటెడ్ ఎంటర్‌టైనర్‌తో అభిమానులను ఆకట్టుకోవడానికి వచ్చేస్తుంది.

ఇటీవల బాలకృష్ణ (Bala krishna)ని పొగడ్తలతో ముంచేత్తిన కాజల్ (Kajal): 

పెద్ద సూపర్‌స్టార్ అయినప్పటికీ, బాలయ్య ఎప్పుడూ అందరితో కలుపుగోలుతనంతో స్నేహభావంతో ఉల్లాసంగా ఉంటాడు అని ‘భగవంత్ కేసరి’ కార్యక్రమంలో నటి కాజల్ (Kajal) అగర్వాల్ అన్నారు. అంతేకాకుండా బాలకృష్ణ (Bala krishna) ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకం అంటూ మాట్లాడింది. నందమూరి వారసత్వం, ఇలాగే విజయాలతో ఆకాశాన్ని తాకాలని ఆమె ఆకాంక్షించారు. ముఖ్యంగా ఇప్పటివరకు ఎన్నో మంచి విజయాలు సాధిస్తూ ఎంతోస్థాయికి చేరిన బాలకృష్ణ (Bala krishna) మరింత ఎత్తులకు ఎదగాలని ఆశించింది నటి కాజల్ (Kajal) అగర్వాల్. 

నిజానికి పెళ్లి తర్వాత, ఒక బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ (Kajal) అగర్వాల్ చేసిన సినిమాలు అన్ని కూడా హీరోయిన్ (Heroine) ఓరియంటెడ్ ఉండడం చూసే ఉంటాం. అయితే ఇప్పుడు కాజల్ (Kajal) అగర్వాల్ మరొకసారి ప్రేక్షకుల ముందు ఒక ప్రత్యేకమైన పాత్రలో పోషించడానికి, ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ హిట్ కొట్టడానికి, బాలకృష్ణ (Bala krishna) సరసన నటించడానికి కాజల్ (Kajal) అగర్వాల్ మక్కువ చూపించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆమె ‘ఖైదీ నంబర్ 150’లో మెగాస్టార్ చిరంజీవితో నటించింది. ఇటీవల సత్యభామ సినిమాతో మరొకసారి అందరినీ ఆకర్షించింది కాజల్ (Kajal) అగర్వాల్.

ఈమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది. ఈమె 2009లో హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజతో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రం (Movie)తో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే. మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేనితో కలిసి గణేష్,అల్లు అర్జున్తో ఆర్య-2 లో నటించింది. తర్వాత 2010లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ (Heroine) గా మెప్పించింది. తర్వాత జూనియర్ ఎంటీయార్ తో బృందావనంలో సమంతతో పాటుగా నటించింది. తరువాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించారు. 2010లో ఈమె తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన నా పేరు శివ చిత్రం (Movie)లో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 2012లో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మాన్ సినిమాలో నటించారు. సూర్య సరసన మాట్రన్ అనే తమిళ సినిమాలో నటించింది.

ఇంతకుముందు, కాజల్ (Kajal) మహేష్ బాబు (బిజినెస్‌మెన్), ఎన్టీఆర్ జూనియర్ (టెంపర్), అల్లు అర్జున్ (ఆర్య), రామ్ చరణ్ (మగధీర) వంటి బిగ్గెస్ట్ స్టార్‌లతో కలిసి పని చేసి, 10 సంవత్సరాలలో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి హీరోయిన్ (Heroine)‌గా ఎదిగింది.