కాజల్ అగర్వాల్ లేటెస్ట్ మూవీ న్యూస్

పెళ్లయినా కాజల్‌కు తగ్గని డిమాండ్..  ఎన్ని కోట్లయిన ఇచ్చేందుకు నిర్మాతలు రెడీసెకండ్ ఇన్నింగ్స్‌లోనూ జోరు చూపిస్తున్న చందమామ హీరోయిన్లకు పెళ్లి అయితే డిమాండ్ తగ్గిపోతుంది. అభిమానులు కూడా పెళ్లయిన వాళ్లని హీరోయిన్‌‌గా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవు. ఆల్ మోస్ట్ హీరోయిన్లుగా కెరీర్ ముగిసినట్లే. ఒకప్పుడు అక్క, అమ్మ పాత్రలకే పరిమితమయ్యే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు పెళ్లయిన తర్వాత కూడా స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న నటీమణులు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో చూస్తే […]

Share:

పెళ్లయినా కాజల్‌కు తగ్గని డిమాండ్.. 

ఎన్ని కోట్లయిన ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ
సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ జోరు చూపిస్తున్న చందమామ

హీరోయిన్లకు పెళ్లి అయితే డిమాండ్ తగ్గిపోతుంది. అభిమానులు కూడా పెళ్లయిన వాళ్లని హీరోయిన్‌‌గా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవు. ఆల్ మోస్ట్ హీరోయిన్లుగా కెరీర్ ముగిసినట్లే. ఒకప్పుడు అక్క, అమ్మ పాత్రలకే పరిమితమయ్యే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు పెళ్లయిన తర్వాత కూడా స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న నటీమణులు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో చూస్తే హీరోయిన్లందరూ పెళ్లి అయిన వాళ్లే. పెళ్లికి కెరీర్‌కి సంబంధం లేదని వారు భావిస్తారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతారు. బాలీవుడ్‌లో చూస్తే దీపికా పదుకొణె, కత్రినా కైఫ్, అలియా భట్, రీసెంట్‌‌గా కియారా అద్వానీలు పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మల్లో ఉన్నారు. అయితే ఇప్పటికీ వారే స్టార్ హీరోయిన్లు. ఒక్కో సినిమాకు కనీసం 10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటారు. సౌత్‌లో కూడా ఈ ట్రెండ్ వచ్చింది. ఇక్కడా నాగ చైతన్యతో పెళ్లి అయిన తర్వాత కూడా సమంత ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంది. అతనితో విడిపోయిన తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు నాలుగైదు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా టాలీవుడ్ సంప్రదాయాలకు భిన్నంగా చందమామ కాజల్ కూడా దూసుకుపోతుండడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చాలా మంది స్టార్ హీరోయిన్లు పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. కానీ చందమామ కాజల్ విషయంలో మాత్రం అంతా దానికి రివర్స్​లో జరుగుతోంది. 

తాజాగా కాజల్ అగర్వాల్ కూడా సెకండ్ ఇన్నింగ్స్‌ను గట్టిగానే ప్లాన్ చేస్తోంది. రెండేళ్లుగా సినిమాలు చేయని కాజల్.. తాజాగా బాలకృష్ణ సినిమాతో పాటు అజిత్ సినిమాకి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా వస్తున్న చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌‌గా ఎంపికైంది. ఈ సినిమాకు ఆమె 3 కోట్ల రెమ్యునరేషన్ కావాలని అడిగినట్లు బయట ప్రచారం జరుగుతోంది. ఇక ఈ అమ్మడు ఈ సినిమాలే కాకుండా ఇంకా కొన్ని సినిమాలను కూడా లైన్లో పెట్టినట్లు ఫిలిం నగర్ టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా చందమామ పెళ్లికి ముందు ఎలా జోరు చూపించిందో.. పెళ్లి తర్వాత కూడా అలాగే జోరు చూపించడం గమనార్హం. 

ఆ సినిమాకు కాజల్ రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్ అందుకోనుంది. పెళ్లికి ముందే కాజల్ సినిమాలు చేయడానికి ఒకటిన్నర నుండి రెండు కోట్ల వరకు తీసుకునేది. అయితే పెళ్లి తర్వాత కాజల్ 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని టాక్. దీంతో మొత్తంగా ఇండస్ట్రీలో పెళ్లయిన హీరోయిన్లకు కూడా డిమాండ్ పెరిగింది. మరోవైపు నిర్మాతలు కూడా తమ సినిమాల్లో హీరోయిన్ నుంచి క్రేజ్ వస్తుందని భావిస్తే ఎన్ని కోట్లు అయినా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు.